MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఫాస్ట్ బౌలర్లకు ఆసియా కప్ గండం... బుమ్రా, హర్షల్ పటేల్, షాహీన్ ఆఫ్రిదీ లిస్టులోకి ఛమీరా...

ఫాస్ట్ బౌలర్లకు ఆసియా కప్ గండం... బుమ్రా, హర్షల్ పటేల్, షాహీన్ ఆఫ్రిదీ లిస్టులోకి ఛమీరా...

ఆసియా కప్ 2022 టోర్నీ ఫాస్ట్ బౌలర్లకు గండంగా మారినట్టుంది. టోర్నీ ఇంకా ఆరంభం కాకముందే ఒకటికి నలుగురు ఫాస్ట్ బౌలర్లు గాయాలతో తమ తమ జట్లకు దూరం కావడం విశేషం. ఆసియా కప్‌కి ముందు భారత స్టార్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్... గాయాలతో ఈ టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 23 2022, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొన్నేళ్లుగా టీమిండియా ప్రధాన బౌలర్‌గా మారిన జస్ప్రిత్ బుమ్రా లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడనుంది టీమిండియా. అలాగే 2021 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న హర్షల్ పటేల్ కూడా దూరం కావడం, జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపే ప్రమాదముంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
shaheen

shaheen

అలాగే పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ కూడా గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి దూరమయ్యాడు. ఆఫ్రిదీ మోచేతికి గాయం కావడంతో అతను కోలుకోవడానికి రెండు నెలల దాకా సమయం పడుతుందని తేల్చారు వైద్యులు. టీ20 వరల్డ్ కప్ 2022 సమయానికి అతను కోలుకోవడానికి బలంగా కోరుకుంటున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్...

36

తాజాగా ఐదు సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన శ్రీలంక జట్టుకి కూడా ఊహించని షాక్ తగిలింది. లంక జట్టు ప్రధాన స్టార్ బౌలర్ దుస్మంత ఛమీరా గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు. కొన్నాళ్లుగా లంక తరుపున అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ ఐపీఎల్‌లోనూ ఛాన్స్ కొట్టేశాడు దుస్మంత ఛమీరా...

46

50 టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో 48 వికెట్లు తీసిన ఛమీరా... ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డాడు. అతని ఎడమ కాలికి గాయం కావడంతో ఛమీరా స్థానంలో నువాన్ తుషారాకి లంక జట్టులో చోటు కల్పించారు సెలక్టర్లు. అసలే సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత మునుపటి వైభవం కోల్పోయిన లంక జట్టుపై దుస్మంత ఛమీరా లేని లోటు తీవ్రంగా పడనుంది...

56

దుస్మంత ఛమీరాకి రోహిత్ శర్మపై అదిరిపోయే రికార్డు ఉంది. ఛమీరా బౌలింగ్‌లో 30 బంతులాడి 32 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ, 6 సార్లు అవుట్ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టీ20 సిరీస్‌లోనూ రోహిత్‌ని రెండు సార్లు అవుట్ చేశాడు దుస్మంత ఛమీరా...

66
Image credit: Getty

Image credit: Getty

అలాగే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో రోహిత్ శర్మను ఇన్నింగ్స్ తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన పాక్ స్టార్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ కూడా గాయంతో ఆసియా కప్‌కి దూరమైన విషయం తెలిసిందే. తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన దుస్మంత ఛమీరా, షాహీన్ ఆఫ్రిదీ ఇద్దరూ గాయపడడంతో రోహిత్ శర్మ ఈసారి ఆసియా కప్ 2022 టోర్నీలో ఏ స్థాయిలో రెచ్చిపోతాడో చూడాలి... 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved