- Home
- Sports
- Cricket
- Adam Zampa : టీ20 లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఎస్ఆర్‌హెచ్ లో ... అతడితో మామూలుగా ఉండదు
Adam Zampa : టీ20 లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఎస్ఆర్‌హెచ్ లో ... అతడితో మామూలుగా ఉండదు
Indian Premier League 2025 : ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఆడమ్ జంపా ఇప్పుడు ఐపిఎల్ లో బంతితో మ్యాజిక్ చేసేందుకు సిద్దమయ్యారు. అతడు మొదటిసారిగా ఐపిఎల్ లో సన్ రైజర్స్ తరపున ఆడుతున్నాడు.

Indian Premier League 2025
ఆడమ్ జంపా : సన్ రైజర్స్ హైదరాబాద్ టీ బ్యాటింగ్ లో ముందునుండే తోపులు. బౌలింగే ఆ టీం వీక్ నెస్ గా ఉండేది. కానీ కమిన్స్, షమీ లాంటి వరల్డ్ క్లాస్ పేసర్లతో పాటు ఆడమ్ జంపా లాంటి టీ20 స్పెషలిస్ట్ స్పిన్నర్ ఈ జట్టులో చేరారు. ఆసిస్ తరపున టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఇతడే. దీన్నిబట్టే ధనాధన్ టీ20 ఫార్మాట్ లో జంపా ఎంత చక్కగా బౌలింగ్ చేస్తాడో అర్థమవుతోంది.
గూగ్లీలతో బ్యట్ మెన్స్ ను బోల్తా కొట్టించగలడు... బంతిని గింగిరాలు తిప్పుతూ వికెట్లను గిరాటేయగలడు. వికెట్లు తీయడమే కాదు పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేయగలడు. ఇలా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో తానేంటో నిరూపించుకున్న జంపా సన్ రైజర్స్ తరపున ఐపిఎల్ సత్తా చాటేందుకు సిద్దమయ్యారు.
జంపాను సన్ రైజర్స్ ఫ్యాన్ 'జూపార్క్ జంపా', 'జూబ్లీహిల్స్ జంపా' గా పిలుచుకుంటున్నారు. కేవలం మన జట్టులో చేరాడనే ఇంతలా అభిమానిస్తున్నారు తెలుగు ఫ్యాన్స్... ఇక టీంను గెలిపించే బౌలింగ్ చేస్తే జంపా జపం చేయడం ఖాయం. జంపా కూడా తన సహచర క్రికెటర్ కమిన్స్ ను ఫాలో అవుతున్నాడు... తెలుగు ఫ్యాన్స్ మమేకం అవుతున్నారు.
Adam Zampa
ఆడమ్ జంపా ఐపిఎల్ కెరీర్ :
ఈ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపిఎల్ లో అద్భుతాలు చేయడానికి సిద్దమయ్యారు. 2016 లో ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన జంపా ఇప్పటివరకు 21 మ్యాచులాడి 30 వికెట్లు పడగొట్టాడు. ఇతడి బెస్ట్ ఫీగర్స్ 6/19. ఐపిఎల్ ఆడిన మొదటి సంవత్సరంలో ఈ ఘనత సాధించాడు.... ఇలా 2016 లో కేవలం 5 మ్యాచులే ఆడిన జంపా 12 వికెట్లు పడగొట్టాడు.
గత ఐపిఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు జంపా. ఇటీవల జరిగిన మెగా వేలంలో ఇతడిని సన్ రైజర్స్ రూ.2.40 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఇతడు హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు.