ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు.. పాక్ ను దంచికొట్టిన అభిషేక్ శర్మ
Abhishek Sharma : అభిషేక్ శర్మను రెచ్చగొడితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ కు చూపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ తో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే, ఆసియా కప్ 2025లో రెండు సార్లు ఫస్ట్ బంతి సిక్స్ కొట్టి మరో రికార్డు సాధించాడు.

అభిషేక్ శర్మ కొత్త చరిత్ర
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్‌తో దుబాయ్ లో జరిగిన మ్యాచ్‌లో 172 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తున్న భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించాడు. అభిషేక్ శర్మ ఫస్ట్ బంతి సిక్స్ కొట్టి ప్రత్యేక రికార్డు నమోదు చేశాడు. గతంలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఫస్ట్ బంతి సిక్స్ కొట్టిన అభిషేక్ ఇప్పుడు రెండు సార్లు ఈ ఘనతను సాధించిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు సాధించాడు.
If Abhishek Sharma makes 80+ runs today then I will give 10000 rupees to everyone who likes AND retweets this tweet.🔥🔥#PakvsInda#PakVsInd#INDvPAK
pic.twitter.com/u1BWWjkp7T— The Daily Snitch (@TheDailySnitch) September 21, 2025
అభిషేక్ శర్మ గ్లోబల్ రికార్డ్
అభిషేక్ శర్మ ఫస్ట్ బంతి సిక్స్ కొట్టి మరో ప్రపంచం రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను షాహీన్ షా ఆఫ్రిదీ బౌలింగ్ లో సిక్స్ కొట్టాడు. షాహీన్ 70 సార్లు ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేశాడు, కానీ ఫస్ట్ బంతి సిక్స్ కొట్టిన తొలి బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మనే.
Abhishek sharma to shaheen Afridi: "jaa ball daal teri maa ki chut"😭😭 pic.twitter.com/c2o6MUQMC4
— ADITYA 🇮🇹 (@Wxtreme10) September 21, 2025
అయితే, ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మను హారీష్ రౌఫ్ బౌలింగ్ చేస్తూ రెచ్చగొట్టాడు. దీనికి అభిషేక్ శర్మ గట్టిగానే సమాధానం ఇచ్చాడు. అలాగే, తన ఇన్నింగ్స్ లో మరింత దూకుడు పెంచాడు. పాకిస్తాన్ బౌలింగ్ ను దంచికొట్టాడు. భారత్ విజయం దిశగా ముందుకు తీసుకెళ్లాడు.
IND vs PAK : అభిషేక్ శర్మను రెచ్చగొట్టిన పాక్.. హరీష్ రౌఫ్ ను ఏమనివుంటాడు?#AbhishekSharma#HarisRauf#INDvPAK#indvspak2025#AsiaCup2025#Dubai#Cricket#IndiavsPakistan#AsiaCupSuper4#INDvsPAK#FakharZaman#SanjuSamson#ThirdUmpirepic.twitter.com/6XlRtAmoLo
— Asianetnews Telugu (@AsianetNewsTL) September 21, 2025
ఫస్ట్ బంతి సిక్స్ కొట్టిన భారత ప్లేయర్లు వీరే
భారత క్రికెట్ చరిత్రలో ఫస్ట్ బంతి సిక్స్ కొట్టిన క్రికెటర్లు
• రోహిత్ శర్మ – అదీల్ రషీద్ – ఇంగ్లాండ్ – అహ్మదాబాద్ – 2021
• యశస్వి జైస్వాల్ – సికందర్ రజా – జింబాబ్వే – హరారే – 2024
• సంజూ శాంసన్ – జోఫ్రా ఆర్చర్ – ఇంగ్లాండ్ – ముంబై – 2025
• అభిషేక్ శర్మ – హైదర్ అలీ – UAE – దుబాయ్ – 2025
• అభిషేక్ శర్మ – షాహీన్ షా ఆఫ్రిదీ – పాకిస్తాన్ – దుబాయ్ – 2025
అభిషేక్ శర్మే ఫస్ట్ బంతి సిక్స్ రెండుసార్లు సాధించిన ఏకైక భారత క్రికెటర్.
పాకిస్తాన్ ను దంచికొట్టిన అభిషేక్ శర్మ
అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ నాక్ తో అదరగొట్టాడు. ఆరంభం నుంచే తుఫాను బ్యాటింగ్ తో చెలరేగాడు. కేవలం 24 బంతుల్లోనే 50 పరుగులు సాధించి డగౌట్ వైపు బ్యాట్ చూపుతూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. మొత్తంగా అభిషేక్ శర్మ 74 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.
FIFTY!
Abhishek Sharma brings up a fantastic half-century off just 24 deliveries.
His third in T20Is 👏🔥
Live - https://t.co/XXdOskvd5M#AsiaCup2025#Super4pic.twitter.com/IJtM0H8DEU— BCCI (@BCCI) September 21, 2025
అభిషేక్ శర్మతో కలిసి గిల్ అదిరిపోయే నాక్
అభిషేక్ శర్మతో కలిసి శుభ్ మన్ గిల్ అదిరిపోయే ఇన్నింగ్స్ ను ఆడాడు. అద్భుతమైన షాట్లతో పాక్ బౌలింగ్ ను దంచికొట్టాడు. హాఫ్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. 47 పరుగుల తన ఇన్నింగ్ లో శుభ్ మన్ గిల్ 8 ఫోర్లు బాదాడు. శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మలు కలిసి భారత్ కు మంచి శుభారంభం అందించారు. గిల్, అభిషేక్ లు భారత్ కు 105 పరుగుల భాగస్వామ్యం అందించారు.