- Home
- Sports
- Cricket
- విరాట్‌ని చూడగానే పొగరుబోతులా కనిపించాడు కానీ, బొత్తిగా... ఏబీ డివిల్లియర్స్ కామెంట్స్...
విరాట్‌ని చూడగానే పొగరుబోతులా కనిపించాడు కానీ, బొత్తిగా... ఏబీ డివిల్లియర్స్ కామెంట్స్...
15 సీజన్లుగా టైటిల్ గెలవకపోయినా ఆర్‌సీబీకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికి ముఖ్యకారణం విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్. ఈ ఇద్దరు లెజెండరీ ప్లేయర్ల కారణంగా బెంగళూరుకి అండగా నిలుస్తున్నారు అభిమానులు..

ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరినా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2022 సీజన్‌లో ఇంకో అడుగు ముందుకేసి రెండో క్వాలిఫైయర్ ఆడింది. ఈసారి మరో రెండు అడుగులు ముందుకేసి ఎలాగైనా టైటిల్ గెలవాలనుకుంటోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న ఏబీ డివిల్లియర్స్, 2023 సీజన్‌లో ఆర్‌సీబీ కోచింగ్ టీమ్‌లో చేరాడు. ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్‌తో కలిసి ఐపీఎల్ 2023 సీజన్‌ని ముందు ‘బోల్డ్ డైరీస్’లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు ఏబీ డివిల్లియర్స్..
‘విరాట్ కోహ్లీని ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అనే ప్రశ్న నాకు చాలా సార్లు ఎదురైంది. దీనికి ఎన్నోసార్లు సమాధానం చెప్పాను కూడా. మళ్లీ అదే అడుగుతున్నారు. సరే చెబుతా... నేను ఫస్ట్ టైమ్ విరాట్‌ని చూసి పొగరుబోతు అనుకున్నా..
అతని హెయిర్ స్టైయిల్ కూడా పైకి లేచి ఉండేది. ఎవరి మాట వినే రకం కాదు, కాస్త తల బిరుసు ఎక్కువేనని అనుకున్నా.. అయితే అతనితో మాట్లాడిన కొన్ని నిమిషాలకే నా అంచనాలన్నీ తప్పని తేలిపోయింది... అతను చాలా సింపుల్...
మనిషిగా విరాట్ కోహ్లీ ఏంటో తెలిసాక అతనిపై గౌరవం పెరిగింది. విరాట్ తన చుట్టూ ఓ పరిధి గీసుకున్నాడు. దాన్ని దాటి వచ్చిన వారికే విరాట్‌లోని అసలైన మనిషి తెలుస్తాడు...
ఆరంభంలో విరాట్ కోహ్లీ నాకు నచ్చేవాడు కాదు, కానీ మెల్లిమెల్లిగా అతనికి బాగా అలవాటైపోయా. అతను ఎంతో ఎత్తుకు ఎదిగాడు కానీ నేను మొదటిసారి కలిసినప్పుడు విరాట్ కోహ్లీ ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు... ’ అంటూ చెప్పుకొచ్చాడు ఏబీ డివిల్లియర్స్..