- Home
- Sports
- Cricket
- నన్ను బాగా ఇబ్బంది పెట్టింది ఆ ముగ్గురే... ఏబీ డివిల్లియర్స్ లిస్టులో టీమిండియా బౌలర్ కూడా..
నన్ను బాగా ఇబ్బంది పెట్టింది ఆ ముగ్గురే... ఏబీ డివిల్లియర్స్ లిస్టులో టీమిండియా బౌలర్ కూడా..
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్, కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 360 డిగ్రీస్‌లో బ్యాటింగ్ చేస్తూ, ఎలాంటి బాల్‌నైనా బౌండరీకి తరలించదగ్గ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఏబీ డివిల్లియర్స్, తన కెరీర్‌లో తనను బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ల గురించి మాట్లాడాడు...

సౌతాఫ్రికా తరుపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచులు ఆడిన ఏబీ డివిల్లియర్స్, ఓవరాల్‌గా 47 సెంచరీలతో 20 వేలకు పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, సెంచరీ, 150 పరుగులు చేసిన బ్యాటర్‌గా ఏబీడీ రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు..
Image credit: RCB/Facebook
ఐపీఎల్‌లో 184 మ్యాచులు ఆడిన ఏబీ డివిల్లియర్స్, 39.71 సగటుతో 5162 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 5 వేలకు పైగా పరుగులు చేసిన ఇద్దరు విదేశీ బ్యాటర్లలో ఏబీ డివిల్లియర్స్ ఒకడు. డేవిడ్ వార్నర్ ఒక్కడే ఈ ఫీట్ సాధించాడు..
AB de Villiers
‘2006లో మొదటిసారి ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లాను. అప్పటికీ నేను ఇంకా యంగ్ బ్యాటర్‌నే. నా దగ్గర సరైన స్కిల్స్ లేకనే, లేక నా టెక్నిక్ సరిగ్గా లేకపోవడం వల్లే తెలీదు కానీ షేన్ వార్న్ నన్ను బాగా ఇబ్బందిపెట్టాడు. అతను వస్తే చాలు, ఓ రకమైన భయం మొదలైపోయేది..
నేను అవుట్ అయిపోతానని అర్థమైపోయేది. షేన్ వార్న్ చాలా స్మార్ట్ బౌలర్. అంతకంటే అద్భుతమైన ప్లేయర్. అయితే చాలా త్వరగానే వార్న్ బౌలింగ్‌ని ఫేస్ చేయడం ఎలాగో నేర్చుకున్నా. ఆయన స్పీడ్ తగ్గించి, తగ్గించి.. వికెట్ టు వికెట్ వేసి కంఫ్యూజ్ చేస్తాడు..
2007 వరకూ స్ట్రైయిక్ బాల్స్‌ని ఎక్కువగా మిస్ చేసేవాడిని. అది నా వీక్‌నెస్. బ్యాటర్ చేసే ప్రతీ చిన్న తప్పును పసికట్టి, వికెట్ రాబట్టడం వార్న్ స్పెషాలిటీ. ఆ తర్వాత నన్ను బాగా ఇబ్బంది పెట్టింది రషీద్ ఖాన్. ముఖ్యంగా నైట్ మ్యాచుల్లో అతని బౌలింగ్ పసికట్టడం చాలా కష్టం..
అతని బౌలింగ్‌లో కొన్నిసార్లు అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా 3 సిక్సర్లు కొట్టాను, అయితే ఆ తర్వాతి బంతికే అతను నన్ను అవుట్ చేశాడు. బౌలింగ్‌లో మార్పులు చేస్తూ వికెట్ తీయడం ఎలాగో రషీద్ ఖాన్‌కి బాగా తెలుసు...
Jasprit Bumrah
జస్ప్రిత్ బుమ్రా కూడా ఛాలెంజింగ్ బౌలర్. అతను బౌలింగ్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు అతని బౌలింగ్‌లో బౌండరీలు బాదాను. అయితే ఆ తర్వాత కూడా అద్భుతమైన బౌలింగ్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వడం అతనికి తెలుసు. ఓటమిని అస్సలు ఒప్పుకోడు.. అతనిలో ఉన్న ఆ పోటీతత్వమే అతన్నే బెస్ట్ బౌలర్‌గా మార్చింది..’ అంటూ కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్..