- Home
- Sports
- Cricket
- చాలా మంది ఏడుస్తున్నారు.. అదొస్తే అంతే సంగతులు.. ఉమెన్స్ ఐపీఎల్ పై ఆసీస్ క్రికెటర్ కామెంట్స్
చాలా మంది ఏడుస్తున్నారు.. అదొస్తే అంతే సంగతులు.. ఉమెన్స్ ఐపీఎల్ పై ఆసీస్ క్రికెటర్ కామెంట్స్
Women's IPL: ఐపీఎల్ తరహాలోనే మహిళల ఐపీఎల్ కూడా నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తమవుతున్నది. ఈ మేరకు తగిన ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నది.

ఐపీఎల్ ద్వారా ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని తనవైపునకు తిప్పుకున్నది బీసీసీఐ. ఇదే క్రమంలో మహిళల క్రికెట్ ను ప్రోత్సహిస్తూ.. మెరికల్లాంటి క్రికెటర్లను వెలికితీసేందుకు గాను ఉమెన్స్ ఐపీఎల్ ను కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉమెన్స్ ఐపీఎల్ ను 2023 లో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ అలానా కింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కింగ్ మాట్లాడుతూ.. ‘ఆ టోర్నీ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఆస్ట్రేలియా మహిళల కోసం బిగ్ బాష్ లీగ్ ఉంది. ఇంగ్లాండ్ లో హండ్రెడ్ లీగ్ ఉంది.
ఒకవేళ ఉమెన్స్ ఐపీఎల్ వస్తే మాత్రం అంతే సంగతులు. అది ప్రపంచంలోనే నెంబర్ వన్ టోర్నీ అవుతుందనడంలో సందేహమే లేదు. చాలా మంది అమ్మాయిలు ఉమెన్స్ ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా... అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీ త్వరగా ప్రారంభం కావలని ఏడుస్తున్నారు (ఫన్నీగా).
ఈ టోర్నీ ప్రారంభమైతే భారత్ లోని చాలా మంది ప్రతిభ కలిగిన మహిళా క్రికెటర్లు వెలుగులోకి వస్తారు. అది భారత క్రికెట్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కు కూడా శుభపరిణామం...’అని తెలిపింది.
ఆస్ట్రేలియా జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న అలానా.. యాషెస్ సిరీస్ తో పాటు ఇటీవలే ఆ జట్టు వన్డే ప్రపంచకప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించింది. వారం రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ మహిళల టీ20 ఛాలెంజ్ లో ఆమె సూపర్ నోవాస్ తరఫున ఆడింది.