- Home
- Sports
- Cricket
- 7 నెలల పాటు రోజూ బౌలింగ్ ప్రాక్టీస్... కపిల్‌దేవ్ యాక్షన్‌ను కాపీ చేసేందుకు రణ్‌వీర్ సింగ్ కష్టాలు వింటే...
7 నెలల పాటు రోజూ బౌలింగ్ ప్రాక్టీస్... కపిల్‌దేవ్ యాక్షన్‌ను కాపీ చేసేందుకు రణ్‌వీర్ సింగ్ కష్టాలు వింటే...
భారత జట్టుకి మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన సారథి కపిల్‌దేవ్. 1983 వన్డే వరల్డ్‌కప్ నాటి సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిన ‘83’ మూవీకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో కపిల్‌దేవ్ పాత్రలో నటించిన బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది...

భారత క్రికెట్‌లో స్పిన్నర్లకు ఘనమైన చరిత్ర ఉంది. అనిల్ కుంబ్లే, భిషన్ సింగ్ బేడీ, భగవత్ చంద్రశేఖర్, రవిశాస్త్రి, ప్రసన్న, హర్భజన్ సింగ్ వంటి స్పిన్నర్లే భారత జట్టులో కీలక బౌలర్లుగా ఉండేవాళ్లు...
అలాంటి టీమిండియాలో ఓ సంచలన మార్పు తీసుకొచ్చిన పేసర్ కపిల్‌దేవ్. మిగిలిన ఫాస్ట్ బౌలర్ల కంటే కపిల్‌దేవ్ బౌలింగ్ యాక్షన్ చాలా స్ట్రైల్‌గా ఉండేది...
కపిల్‌దేవ్ తర్వాతే భారత యువ క్రికెటర్లు ఫాస్ట్ బౌలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం మొదలెట్టారని చెప్పొచ్చు. ఇప్పుడు భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఇంత బలంగా తయారయ్యిందంటే దానికి కపిల్‌దేవ్ వేసిన మూలాలే ఓ కారణం...
అలాంటి కపిల్‌దేవ్ బౌలింగ్ యాక్షన్‌ను తెరమీద అచ్చుదింపేశాడు రణ్‌వీర్ సింగ్. అయితే ఇది అంత ఈజీగా రాలేదు. దాదాపు 7 నెలల పాటు రోజూ నాలుగు గంటల పాటు ప్రాక్టీస్ చేశాడట రణ్‌వీర్...
‘కపిల్‌దేవ్ బౌలింగ్ యాక్షన్ చాలా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా బంతిని విడుదల చేసేటప్పుడు అది ఎక్కడ పడుతుందో చూసేలా ఫేస్‌ని ముందుకు తెచ్చేవారు కపిల్...
నా బాడీ, ఫిజిక్ దానికి సహకరించలేదు. సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ వంటి సీనియర్లు కూడా కపిల్‌దేవ్ యాక్షన్‌ను కూడా కాపీ కొట్టలేవని చెప్పేశారు...
అయితే 7 నెలల పాటు రోజూ 4 గంటల పాటు ప్రాక్టీస్ చేస్తే కానీ... కపిల్‌దేవ్ యాక్షన్‌ను దింపడం వీలుకాలేదు... అప్పటికే ‘సింబా’ షూటింగ్ ముగించాను...
ఆ సినిమా కోసం కొంచెం బాడీ పెంచాల్సి వచ్చింది. కపిల్ పాత్ర కోసం బాడీని తగ్గించాల్సి వచ్చింది. స్టార్టింగ్‌లో నేను బౌలింగ్ చేస్తుంటే, ఎవరో పహిల్వాన్ బౌలింగ్ చేయడానికి వచ్చినట్టు కనిపించేది...
నాలుగు నెలల ప్రిపరేషన్స్ తర్వాత షూటింగ్ మొదలెట్టాం. ఆ తర్వాత రెండు, మూడు నెలల పాటు బౌలింగ్ చేశా. ఆయన బౌలింగ్ యాక్షన్‌ను ప్రయత్నించే సమయంలో నాకు కొన్ని గాయాలు కూడా అయ్యాయి...
అయితే ఎట్టకేలకు కాస్త మంచి బౌలర్‌గా మారగలిగాను. కపిల్‌దేవ్ ‘83’ మూవీ చూసిన తర్వాత నన్ను హత్తుకోగానే నేను పడిన కష్టాన్నంతా మరిచిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు రణ్‌వీర్ సింగ్.