MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 4 మ్యాచ్‌లు, 49 వికెట్లు.. ప్ర‌పంచంలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌.. బ్యాట‌ర్ల‌ను హ‌డ‌లెత్తించాడు !

4 మ్యాచ్‌లు, 49 వికెట్లు.. ప్ర‌పంచంలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌.. బ్యాట‌ర్ల‌ను హ‌డ‌లెత్తించాడు !

In 4 matches, 49 wickets: ప్ర‌స్తుతం క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం చెలాయించినప్పటికీ, ఒకప్పుడు బౌలర్లదే పైచేయి. ముఖ్యంగా పేసర్లు అద్భుత‌మైన బౌలింగ్ తో లెజెండ‌రీ బ్యాట‌ర్ల‌ను కూడా వ‌ణికించాడు. 4 మ్యాచ్‌లు, 49 వికెట్లు తీసి ప్ర‌పంచంలో అత్యంత ప్రమాదకరమైన, అద్భుత‌మైన బౌలర్ గా రికార్డు సృష్టించాడు సిడ్నీ బర్న్స్. 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 01 2024, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Sydney Barnes : అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా గొప్ప బౌలర్లు చాలా మంది ఉన్నారు. గొప్పగొప్ప‌ బ్యాట్స్‌మెన్‌లను సైతం తమ తుఫాను పేస్ లేదా స్పిన్ మాయాజలంతో త‌మ ట్రాప్ లో వేసుకుని పెవిలియన్‌కు దారి చూపించారు. అయితే, లెజెండ‌రీ బౌల‌ర్లు అన‌గానే చాలా మంది చెప్పే పేర్లు ముత్తయ్య మురళీధరన్ (1347 వికెట్లు), షేన్ వార్న్ (1001 వికెట్లు) పేర్లు అభిమానుల పెదవులపై తరచుగా వినిపిస్తాయి.

ఎందుకంటే వారిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు. అయితే, వీరిని మించిన ఒక లెజెండ‌రీ బౌల‌ర్ ఉన్నాడు. త‌న కెరీర్ లో అత్య‌ధిక వికెట్లు తీసుకునే రికార్డును సాధించ‌క‌పోయిన అత‌ను సాధించిన ఇత‌ర రికార్డుల‌ను ఇప్పటికీ ఏ బౌల‌ర్ కూడా బ్రేక్ చేయ‌లేక‌పోయాడు. అతని కెరీర్ చాలా తక్కువగా ఉండవచ్చు, కానీ ఒకప్పుడు ఈ లెజెండ్ అంటే బ్యాట‌ర్ల‌కు హ‌డ‌ల్. అత‌నే సిడ్నీ బర్న్స్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Sydney Barnes, England

Sydney Barnes, England

తుఫాను వేగంతో బ్యాట్స్‌మెన్ హ‌డ‌లెత్తించిన సిడ్నీ బర్న్స్ 

తుఫాను వేగంతో బ్యాట్స్‌మెన్ హ‌డ‌లెత్తించిన దిగ్గ‌జ బౌల‌ర్ సిడ్నీ బర్న్స్. అత‌ని కెరీర్ లో త‌క్కువ మ్యాచ్ లే ఆడిన‌ప్ప‌టికీ క్రికెట్ లో ఎవ‌రూ సాధించ‌లేని రికార్డులు సృష్టించాడు.

ఇంగ్లండ్‌కు చెందిన ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ అంతర్జాతీయ కెరీర్ 27 టెస్ట్ మ్యాచ్‌లను మాత్ర‌మే ఆడాడు. కానీ, అత‌ను ఏకంగా 189 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఒకే మ్యాచ్ లో ఏకంగా 17 వికెట్లు తీసుకుని త‌న కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 2.36  అద్భుత‌మైన ఎకానమీతో బౌలింగ్ చేసిన ఏకైక బౌల‌ర్ అత‌ను.

24 సార్లు ఐదేసి వికెట్లు ప‌డ‌గొట్టాడు.7 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. చాలా మంది లెజెండ్ బ్యాట్స్‌మెన్‌లకు హ‌డ‌లెత్తించి వారికి రాత్రింభ‌వ‌ళ్లు పీడకలగా మిగిలాడు  సిడ్నీ బర్న్స్. 

35

4 మ్యాచ్‌ల్లో 49 వికెట్లు తీసిన  సిడ్నీ బర్న్స్ 

1901లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సిడ్నీ బర్న్స్ తన చివరి టెస్టులో పెను సంచలనం సృష్టించాడు. 1913-14లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య జరిగిన 4 టెస్టుల సిరీస్‌లో సిడ్నీ బార్న్స్ బ్యాట్స్‌మెన్‌పై విధ్వంసం సృష్టించి 49 వికెట్లు పడగొట్టాడు.

ఇది అంత‌ర్జాతీయ క్రికెట్ టెస్టు సిరీస్ లో ఒక బౌల‌ర్ సాధించిన అత్య‌ధిక వికెట్ల రికార్డు. దీంతో అత‌ను ఒకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇది ఇప్పటికీ నిలిచి ఉన్న ప్రపంచ రికార్డు. ఈ నాలుగు మ్యాచ్‌ల 8 ఇన్నింగ్స్‌ల్లో సిడ్నీ బర్న్స్ వరుసగా 5, 5, 8, 9, 3, 5, 7, 7 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో 7 సార్లు 5 వికెట్లు, 3 సార్లు 10 వికెట్లు తీశాడు.

45
England Cricket

England Cricket

సిడ్నీ బర్న్స్  ఈ గొప్ప రికార్డు ఇప్ప‌టికీ బ‌ద్ద‌లు కొట్ట‌లేక‌పోయారు.. 

సిడ్నీ బర్న్స్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయిన రికార్డును కూడా నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 1913లో దక్షిణాఫ్రికాపై 150వ వికెట్‌ తీసి ఈ ఘనత సాధించాడు. బర్న్స్ తన 24వ మ్యాచ్‌లో 150 వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు.

అతను 40 సంవత్సరాల వయస్సులో ఒక టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసుకున్నాడు, ఈ ఫార్మాట్‌లో 10 వికెట్లు తీసిన నాల్గవ అధిక వ‌య‌స్సు క‌లిగిన క్రికెటర్‌గా నిలిచాడు.

55

సిడ్నీ బర్న్స్ అద్భుతమైన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్

సిడ్నీ బర్న్స్ పూర్తి పేరు సిడ్నీ ఫ్రాన్సిస్ బర్న్స్. అత‌ను ఇంగ్లాండ్ లో ఏప్రిల్ 19న  స్మెత్‌విక్, స్టాఫోర్డ్‌షైర్ లో జ‌న్మించాడు. ఇంగ్లండ్ జాతీయ జ‌ట్టుతో పాటు లంకాషైర్, వేల్స్, వార్విక్‌షైర్ రైట్‌విక్‌షైర్ జ‌ట్ల‌కు ఆడాడు. రైట్‌షైర్ రైట్-ఆర్మ్ ఫాస్ట్-మీడియం, రైట్-ఆర్మ్ మీడియం బౌల‌ర్ గా అద్భుత‌మైన క్రికెట్ కెరీర్ ను కొన‌సాగించాడు. 1901లో అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 

సిడ్నీ బర్న్స్ గణాంకాలు గ‌మ‌నిస్తే.. లాంకషైర్ లో జరిగిన లీగ్ లలో 6 సగటుతో 4069 వికెట్లు పడగొట్టాడు. మైనర్ కౌంటీ స్థాయిలో, స్టాఫోర్డ్షైర్ తరఫున, అతను 9 కంటే తక్కువ సగటుతో 1492 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 17 స‌గ‌టుతో  719 వికెట్లు పడగొట్టాడు. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్ 1894 నుంచి 1930 మధ్య 36 సంవత్సరాలు కొనసాగింది. జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున‌ టెస్టుల్లో కేవ‌లం 27 టెస్టుల్లో 189 వికెట్లు పడగొట్టాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఐదో టీ20లో భారత్‌కు ఓటమి.. 3-2తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
Recommended image2
Mumbai Indians: హార్దిక్ పాండ్యా ఔట్ ! ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరు?
Recommended image3
IND vs NZ: చేతులెత్తేసిన బ్యాట‌ర్లు.. టీమిండియా ఓటమికి కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved