- Home
- Sports
- Cricket
- 38 ఏళ్ల వయసులో కమ్‌బ్యాక్ ఇస్తానంటున్న కేదార్ జాదవ్... ఏకంగా విరాట్ కోహ్లీ ప్లేస్‌కే ఎసరు పెడతానంటూ...
38 ఏళ్ల వయసులో కమ్‌బ్యాక్ ఇస్తానంటున్న కేదార్ జాదవ్... ఏకంగా విరాట్ కోహ్లీ ప్లేస్‌కే ఎసరు పెడతానంటూ...
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్లలో కేదార్ జాదవ్ ఒకడు. ధోనీ ఆప్తమిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న కేదార్ జాదవ్, టీమిండియా తరుపున 73 వన్డేలు, 9 టీ20 మ్యాచులు ఆడాడు. అప్పుడెప్పుడో 2020లో ఆఖరి మ్యాచ్ ఆడిన కేదార్ జాదవ్, టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు..

ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన 38 ఏళ్ల కేదార్ జాదవ్, ఎప్పటిలాగే తన ఫెయిల్యూర్‌ని కొనసాగించాడు. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో కోలాపూర్ టస్కర్స్ టీమ్‌ని ఆడుతున్న కేదార్ జాదవ్, టీమిండియా రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..
‘నేను నా గేమ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నా. నిలకడగా పరుగులు చేయగలుగుతున్నా, ఫలితం త్వరలోనే వస్తుంది. నాకు అవకాశం దక్కిన ప్రతీసారీ నూరు శాతం ఇవ్వడమే నా చేతుల్లో ఉంది. నేను టీమిండియాకి ఆడాలా? వద్దా? అనేది సెలక్టర్ల చేతుల్లో ఉంది..
Kedar Jadhav
నేను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నా. టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడాన్ని నేను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తా. మహారాష్ట్రకి నేను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తా. వైట్ బాల్ క్రికెట్‌లో నాకు వన్‌డౌన్‌లో మంచి రికార్డులు ఉన్నాయి..
టీమిండియా తరుపున కూడా వన్‌డౌన్‌లో ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ స్థానంలో అయితే స్వేచ్ఛగా నా షాట్స్ ఆడగలను. చాలామంది ఆల్‌రౌండర్లంటే చాలా తక్కువగా చూస్తారు...
అయితే బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు చేయాలంటే చాలా అరుదైన స్కిల్స్ ఉంటాయి. ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు మెంటల్ ఫిట్‌నెస్ కూడా చాలా ముఖ్యం. అందుకే సెలక్టర్లు కూడా సరైన ఆల్‌రౌండర్లను వెతికి పట్టుకోలేకపోతున్నారు..
టీమిండియాలో బ్యాటర్లు, బౌలింగ్ చేయడం తేలికే కానీ వికెట్లు తీయడం చాలా కష్టం. అలాగే బౌలర్లు, బ్యాటింగ్ చేస్తూ పరుగులు చేసి గెలిపించడం చాలా అరుదు. అదీకాకుండా నేను వికెట్ కీపింగ్ కూడా చేయగలను.. అందుకే నేను చాలా స్పెషల్ అని నాకు తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్..