- Home
- Sports
- Cricket
- 23 ఏళ్ల కుర్రాడు, రికార్డుల్లో గట్టోడు... నాలుగో టెస్టులో అరుదైన ఘనత సాధించిన శుబ్‌మన్ గిల్...
23 ఏళ్ల కుర్రాడు, రికార్డుల్లో గట్టోడు... నాలుగో టెస్టులో అరుదైన ఘనత సాధించిన శుబ్‌మన్ గిల్...
శుబ్‌మన్ గిల్, టీమిండియా ఫ్యూచర్ స్టార్. ఐపీఎల్‌లో, దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఇచ్చిన పర్ఫామెన్స్‌తో టీమ్‌లోకి వచ్చిన శుబ్‌మన్ గిల్, వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్నాడు. అతి కొద్ది కాలంలోనే టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మారిపోయాడు శుబ్‌మన్ గిల్...

Shubman Gill
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో 235 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 128 పరుగులు చేసి అవుట్ అయ్యాడు శుబ్‌మన్ గిల్. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కి 74 పరుగులు జోడించిన గిల్, ఛతేశ్వర్ పూజారాతో కలిసి రెండో వికెట్‌కి 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. విరాట్ కోహ్లీతో కలిసి 58 పరుగుల పార్టనర్‌షిప్ తర్వాత అవుట్ అయ్యాడు..
2023 ఏడాది శుబ్‌మన్ గిల్‌లో టర్నింగ్ పాయింట్‌గా మిగిలిపోవడం గ్యారెంటీ. ఈ ఏడాదిలో టీ20ల్లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్, తన ఆరో టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు...
Shubman Gill
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్, తాజాగా టెస్టు సెంచరీతో ఒకే ఏడాదిలో మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
Shubman Gill
ఇంతకుముందు 2010లో సురేష్ రైనా, 2016లో కెఎల్ రాహుల్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేస్తే, 2017లో టెస్టుల్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. రోహిత్ తర్వాత ఆరేళ్లకు శుబ్‌మన్ గిల్ ఈ లిస్టులో చేరాడు...
Image credit: PTI
ఒకే ఏడాదిలో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత ఓపెనర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్. ఇంతకుముందు రోహిత్ శర్మ, మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసినా టెస్టుల్లో ఓపెనర్‌గా మారింది మాత్రం 2019లోనే...
Shubman Gill
23 ఏళ్ల వయసులో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్. ఇంతకుముందు 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సచిన్ టెండూల్కర్, 23 ఏళ్ల వయసులో 220 ఇన్నింగ్స్‌లో ఆడి 22 సెంచరీలు చేస్తే, 18 ఏళ్ల వయసులో టీమిండియాలోకి వచ్చిన విరాట్ కోహ్లీ 119 ఇన్నింగ్స్‌లు ఆడి 15 సెంచరీలు చేశాడు. శుబ్‌మన్ గిల్ 55 ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలతో మూడో స్థానంలో నిలిచాడు..
Image credit: PTI
మొదటి 3 నెలలలోనే 5 సెంచరీలు చేసిన నాలుగో భారత బ్యాటర్ శుబ్‌మన్ గిల్. ఇంతకుముందు 2010లో సచిన్ టెండూల్కర్, 2004లో వీవీఎస్ లక్ష్మణ్, 1999లో రాహుల్ ద్రావిడ్ ఈ ఫీట్ సాధించాడు.. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో, ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో సెంచరీ చేస్తే, గిల్ ఈ ముగ్గురినీ దాటేస్తాడు...
ఓవరాల్‌గా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన 10వ క్రికెటర్ శుబ్‌మన్ గిల్. ఇంతకుముందు 2010లో మహేళ జయవర్థనే, సురేష్ రైనా, 2011లో తిలకరత్నే దిల్షాన్, 2014లో షాజాద్, 2016లో తమీమ్ ఇక్బాల్, కెఎల్ రాహుల్, 2017లో రోహిత్ శర్మ, 2019లో డేవిడ్ వార్నర్, 2022లో బాబర్ ఆజమ్ ఈ ఫీట్ సాధించారు.