- Home
- Sports
- Cricket
- 2011 వన్డే వరల్డ్ కప్ విజయానికి 11 ఏళ్లు... 110 కోట్ల మంది కలలను నిజం చేసిన ఆ 11 మంది...
2011 వన్డే వరల్డ్ కప్ విజయానికి 11 ఏళ్లు... 110 కోట్ల మంది కలలను నిజం చేసిన ఆ 11 మంది...
ఏప్రిల్ 2... నేటి తరానికి, ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇది చాలా స్పెషల్ రోజు. ఎందుకంటే 28 ఏళ్ల తర్వాత ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ గెలిచింది ఈరోజే. 11 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు... మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు, వన్డే వరల్డ్‌కప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచింది.

Sachin Tendulkar
2003లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో వరల్డ్‌కప్ ఫైనల్‌లో బోల్తాపడిన టీమిండియా, 2011లో మాత్రం అంచనాలకు తగ్గట్టు అదరగొట్టి, రెండో ప్రపంచకప్ కైవసం చేసుకుంది.
ఏప్రిల్ 2, 2011న ముంబైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది భారత జట్టు... మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది.
శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్థనే సెంచరీతో అజేయంగా నిలవగా కుమార సంగర్కర 48 పరుగులు చేశాడు. అయితే ఈ లక్ష్యఛేదనలో భారత జట్టుకి శుభారంభం దక్కలేదు...
బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ కావడం, సచిన్ టెండూల్కర్ 18 పరుగులు చేసి అవుట్ కావడంతో 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
అయితే విరాట్ కోహ్లీ 35, గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేసి అమూల్యమైన భాగస్వామ్యాన్ని నిర్మించగా మహేంద్ర సింగ్ ధోనీ 91, యువరాజ్ 21 పరుగులు చేసి విజయాన్ని అందించారు...
మ్యాచ్‌ను ముగిస్తూ ధోనీ కొట్టిన హెలికాఫ్టర్ షాట్ సిక్సర్‌కి యావత్ భారతం ఫిదా అయిపోయింది... 11 ఏళ్లు గడుస్తున్నా ఈ మ్యాచ్, ఈ ఫైనల్ ఇప్పటికీ చాలామందికి నిన్నే చూసిన అనుభూతిని మిగిల్చింది...
ఫైనల్ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ చేసిన 97 పరుగులు, మహంద్ర సింగ్ ధోనీ చేసిన 91 పరుగుల కారణంగానే వరల్డ్ కప్ గెలిచిందని ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి...
అయితే వన్డే వరల్డ్ కప్ 2011 విజయంలో యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీతో పాటు 11 మంది, మొత్తంగా 15 మంది భాగస్వామ్యం...
వన్డే వరల్డ్ కప్ 2011 ఫైనల్ మ్యాచ్ ఆడిన భారత జట్టు ఇదే: సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్
తన కెరీర్‌లో 20 వేలకు పైగా పరుగులు, 70 సెంచరీలు చేసిన భారత మాజీ సారథి విరాట్, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో చేసిన 35 పరుగులు ఇచ్చిన సంతృప్తి... మరో ఇన్నింగ్స్ ఇవ్వలేదని అంటాడు కోహ్లీ...