- Home
- Sports
- Cricket
- అలవెన్స్ రూ.200, మ్యాచ్ ఫీజు రూ.1500... 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు పారితోషికాలు తెలిస్తే...
అలవెన్స్ రూ.200, మ్యాచ్ ఫీజు రూ.1500... 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు పారితోషికాలు తెలిస్తే...
టీమిండియా క్రికెట్ చరిత్ర గురించి చెప్పాలంటే 1983 వన్డే వరల్డ్ కప్‌కి ముందు, ఆ తర్వాత అని విడదీసి చెప్పాల్సి ఉంటుంది. అసలు భారత జట్టు క్రికెట్ ఆడుతుందని కూడా తెలియని చాలామందిని క్రికెట్ ఫ్యాన్స్‌గా మార్చేసిన టోర్నీ ఇదే...

కపిల్ దేవ్ కెప్టెన్సీలో అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా బరిలో దిగిన టీమిండియా, 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచి... క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది...
అప్పటిదాకా క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్‌ని ఫైనల్ మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో చిత్తు చేసి... మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ కప్ ఖాతాలో వేసుకుంది...
ఈ విజయంపై అనేక సినిమాలు వచ్చాయి. తాజాగా రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘83’ పేరుతో విడుదలైన కపిల్ దేవ్ బయోపిక్ కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది...
అయితే 1983 వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొన్న భారత క్రికెటర్లు పారితోషికంగా అందుకున్న మొత్తం ఎంతో తెలుసా... రూ.2100... అవును! 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకి చెల్లించిన వేతనాలకు సంబంధించిన ఓ స్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
ఈ స్లిప్ ప్రకారం అయితే రోజుకి రూ.200 అలవెన్స్ చొప్పున మూడు రోజులకు రూ.600, మ్యాచ్ ఫీజు రూపంలో రూ.1500... మొత్తంగా రూ.2100 లను వరల్డ్ కప్ గెలిచిన ప్లేయర్లకు చెల్లించింది బీసీసీఐ...
1983 World Cup
అప్పటి టీమిండియా మేనేజర్ బిషన్ సింగ్ బేడీకి కూడా రూ.2100 చెల్లించినట్టు ఈ రషీదులో ఉంది. కపిల్ దేవ్ కెప్టెన్‌గా, మోహిందర్ అమర్‌నాథ్ వైస్ కెప్టెన్‌గా వరల్డ్ కప్ 1983 కోసం ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లింది భారత జట్టు.
‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్‌తో పాటు కృష్ణమాచారి శ్రీకాంత్, యష్‌పాల్ శర్మ, సందీప్ పాటిల్, కిర్టి ఆజాద్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణీ, ఆర్ సంధు, దిలీప్ వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, సునీల్ వాల్సన్... 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో సభ్యులుగా ఉన్నారు...
వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ప్లేయర్లకు కనీసం రూ.3 వేలు కూడా వేతనం ఇవ్వలేని స్థితిని ఎదుర్కొన్న భారత క్రికెట్ బోర్డు, ప్రస్తుతం ఐపీఎల్ 2022 టోర్నీ ద్వారానే దాదాపు రూ.30 వేల ఆదాయాన్ని ఆర్జిస్తోంది...
ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీల రాకతో బీసీసీఐ హుండీకి రూ.12 వేలకు పైగా ఆదాయం రాగా, ప్రసారహక్కుల ద్వారా మరో రూ.30-40 వేల కోట్ల దాకా ఆదాయం ఆర్జించాలని టార్గెట్‌గా పెట్టుకుంది...