మహేంద్ర సింగ్ ధోనీ ఎంట్రీకి 16 ఏళ్లు... సరిగా ఇదే రోజు సచిన్ టెండూల్కర్ కూడా..
‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో జనాల్లోకి వెళ్లగలిగే క్రికెటర్ ఎవ్వరైనా ఉంటారా? అని అనుమానించారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, మాస్ జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ‘మిస్టర్ కూల్’, ‘కెప్టెన్ కూల్’, ‘తలైవా’ మహేంద్ర సింగ్ ధోనీ. టీమిండియా కెప్టెన్‌గా, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఎనలేని ఫాలోయింగ్ తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ ఎంట్రీకి నేటితో 16 ఏళ్లు. సరిగా ధోనీ వన్డే ఎంట్రీ రోజే, సచిన్ వన్డేల నుంచి తప్పుకున్నారు.

డిసెంబర్ 23, 2004లో బంగ్లాదేశ్‌పై చెట్టగ్రామ్‌లో తన మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఆ మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు ధోనీ...

బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మూడు వన్డేల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసిన మహేంద్ర సింగ్ ధోనీ... ఏప్రిల్ 2005లో పాక్‌తో జరిగిన సిరీస్‌లో సత్తా చాటాడు.

తన ఐదో వన్డేలో పాకిస్థాన్‌పై 123 బంతుల్లో 148 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ... భారత జట్టులో స్థిరమైన చోటు దక్కించుకున్నాడు.

1999 నుంచి 2004 వరకూ భారత జట్టుకి వికెట్ కీపర్‌గా వ్యవహారించిన రాహుల్ ద్రావిడ్‌కి విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో స్థిరమైన వికెట్ కీపర్ కోసం వెతుకుతున్న టీమిండియాకు ఆశాకిరణంలా దొరికాడు మహేంద్ర సింగ్ ధోనీ.

జులపాల జట్టుతో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ జార్ఖండ్ డైనమేట్... 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచులు ఆడి, ప్రపంచంలో అత్యత్తుమ వికెట్ కీపర్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.

ఓపెనర్‌గా, వన్‌డౌన్ ప్లేయర్‌గా, టూ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా, లోయర్ ఆర్డర్ ఫినిషర్‌గా ఇలా జట్టు అవసరాలకు తగ్గట్టుగా బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి దిగిన ధోనీ... ‘బెస్ట్ ఫినిషర్’గా కీర్తి పొందాడు.

అనుకోకుండా 2007 టీ20 వరల్డ్‌కప్‌కి కెప్టెన్ అయిన ధోనీ, భారత జట్టుకి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు...

2011లో వన్డే వరల్డ్‌కప్ అందించిన ధోనీ, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాడు...

రనౌట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో రనౌట్‌గానే వెనుదిరగడం విశేషం.

వన్డే వరల్డ్‌కప్ 2019 సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రనౌట్ అయ్యి, భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు మహేంద్ర సింగ్ ధోనీ.

ధోనీ రనౌట్ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన టీమిండియా... స్వల్ప లక్ష్యాన్ని చేధించగల వరల్డ్ కప్ సెమీస్ నుంచే వెనుదిరిగింది.

వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఏడాదిన్నర అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ... 2020 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు.

ధోనీ వన్డే ఎంట్రీ ఇచ్చిన 8 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజు... వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు సచిన్ టెండూల్కర్...

రికార్డు స్థాయిలో 463 వన్డేలు ఆడిన సచిన్ టెండూల్కర్, 49 సెంచరీలతో 18,426 పరుగులు చేసి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.