- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మ టీ20 ఎంట్రీకి 15 ఏళ్లు... స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చి, టీమిండియా కెప్టెన్‌గా...
రోహిత్ శర్మ టీ20 ఎంట్రీకి 15 ఏళ్లు... స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చి, టీమిండియా కెప్టెన్‌గా...
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాని కెప్టెన్‌గా నడిపించబోతున్నాడు రోహిత్ శర్మ. అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడింది ఈరోజే. టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీలో భాగంగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ టీ20 ఆరంగ్రేటం చేశాడు రోహిత్ శర్మ...

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు చేసింది. యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లతో అదరగొట్టి 14 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 58 పరుగులు చేసింది ఈ మ్యాచ్‌లోనే.
ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, తొలి టీ20లో బ్యాటింగ్‌కి రాలేదు. శ్రీశాంత్, ఆర్‌పీ సింగ్, జోగిందర్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తమ కోటా నాలుగు ఓవర్లను వేయడంతో రోహిత్ శర్మకు ఈ మ్యాచ్‌లో బౌలింగ్ కూడా రాలేదు. ఫీల్డింగ్‌లో ఓ క్యాచ్ అందుకున్నాడు.. జోగిందర్ శర్మకు కూడా ఇదే మొట్టమొదటి టీ20 మ్యాచ్.
2007లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినా టీమ్‌లో స్థిరమైన చోటు దక్కించుకోవడానికి రోహిత్ శర్మకు దాదాపు ఆరేళ్ల సమయం పట్టింది. 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో మాత్రం బ్రేక్ లేకుండా ఆడుతూ వచ్చాడు...
rohit sharma
2007 నుంచి 2022 వరకూ ప్రతీ టీ20 వరల్డ్ కప్ ఆడిన ఇద్దరిలో రోహిత్ శర్మ ఒకడు. (బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరో ప్లేయర్). మొట్టమొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ చేయలేకపోయిన రోహిత్ శర్మ... 15 ఏళ్ల తర్వాత టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడని బహుశా అతను కూడా ఊహించి ఉండడేమో...
Image credit: Getty
టీ20ల్లో 3629 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు. అంటే పొట్టి ఫార్మాట్‌లో నాలుగు సెంచరీలు బాదిన రోహిత్, టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు...
టీ20ల్లో 171 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, మార్టిన్ గుప్టిల్ (172 సిక్సర్లు) తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు బాదితే... ఈ రికార్డు కూడా అతని సొంతం అవుతుంది...
టీ20ల్లో 32 సార్లు 50+ స్కోర్లు సాధించిన రోహిత్ శర్మ, అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీతో (33 సార్లు) ఈ విషయంలో పోటీపడుతున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ అందుకున్న రోహిత్ శర్మ, టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత సారథిగా ఎంఎస్ ధోనీ తర్వాతి స్థానంలో నిలిచాడు.