- Home
- Sports
- Cricket
- క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... పింక్ బాల్ టెస్టుకి స్టేడియం ఫుల్ అవ్వాల్సిందే...
క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... పింక్ బాల్ టెస్టుకి స్టేడియం ఫుల్ అవ్వాల్సిందే...
క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా శుభవార్తే. కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా స్టేడియంలో స్వేచ్ఛగా మ్యాచ్ చూడలేకపోయామని బాధపడిన అభిమానులకు ఇక ఆ గొడవ ఉండదు. బెంగళూరు వేదికగా ఇండియా, శ్రీలంక మధ్య జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కి నూరు శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ..

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా, శ్రీలంక మధ్య డే నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. పింక్ బాల్ టెస్టు కావడంతో ఈ మ్యాచ్‌కి ఫుల్లు డిమాండ్ ఏర్పడింది...
టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. అదీకాకుండా బెంగళూరులో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. దీంతో కరోనా ఆంక్షలు కూడా తొలగించింది కర్ణాటక...
అభిమానుల నుంచి భారీ డిమాండ్ వస్తుండడంతో రెండో టెస్టు మ్యాచ్‌కి 100 శాతం ప్రేక్షకుల మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ...
భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి చిన్నస్వామి స్టేడియంలో మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఇది హోం గ్రౌండ్...
ఎక్కువ ఐపీఎల్ మ్యాచులు ఈ మైదానంలోనే ఆడిన విరాట్ కోహ్లీ, తన కెరీర్‌లో 100వ టెస్టు ఇక్కడే ఆడాలని భావించాడు. అయితే బీసీసీఐ షెడ్యూల్ మార్చడంతో నూరో టెస్టు మొహాలీలో ఆడాల్సి వచ్చింది...
బెంగళూరు టెస్టు మ్యాచ్, భారత నయా సారథి రోహిత్ శర్మ కెరీర్‌లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. భారత జట్టు నుంచి ఈ ఘనత సాధించిన 9వ ప్లేయర్‌గా నిలవబోతున్నాడు రోహిత్...
పింక్ బాల్ టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న రెండో ఇండియన్ కెప్టెన్‌గానూ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు రోహిత్ శర్మ...
ఇప్పటిదాకా భారత జట్టు నాలుగు డే నైట్ టెస్టు మ్యాచులు ఆడింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, పింక్ బాల్ టెస్టులో శతకం నమోదు చేసిన మొట్టమొదటి భారత ప్లేయర్ రికార్డు క్రియేట్ చేశాడు...
విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి వచ్చిన ఆఖరి సెంచరీ కూడా అదే. ఈ సెంచరీ తర్వాత రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నాడు విరాట్...