16లక్షల మందికి పరీక్షలు.. 10వేల మరణాలకు చేరువలో అమెరికా
సామాజిక దూరం తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. దేశంలో దాదాపు 95శాతం ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.
అమెరికాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రోజురోజుకీ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకు కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య పదివేలకు చేరువలో ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపు లక్ష మంది వరకు చనిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాగా.. దీనిపై ట్రంప్ మాట్లాడారు. తమ దేశంలో ఇప్పటి వరకు 16లక్షల మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పాడు. మృతుల సంఖ్య పదివేలకు చేరువలో ఉండటంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు.
సామాజిక దూరం తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. దేశంలో దాదాపు 95శాతం ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు 9,626మంది వైరస్ కారణంగా ప్రాణాలు వదిలారు. 9/11 ఉగ్రదాడిలో చనిపోయిన వారితో పోలిస్తే.. మూడు వంతులు ఎక్కువ మందే ప్రాణాలు వదలడం గమనార్హం. కేవలం ఆదివారం ఒక్కరోజే 1,118 మంది ప్రాణాలు వదలడం గమనార్హం.
ఊహించినదానికంటే ఎక్కువగా పరిస్థితులు దిగజారడం అందరినీ కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం తాము తీసుకుంటున్న చర్యలను ట్రంప్ వివరించారు.
ప్రపంచ దేశాల నుంచి మాస్క్ లు, గ్లౌజులు, ఇతర సేఫ్టీ సాధనాలు అమెరికా తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో తాజా పరిస్థితిని విపత్తుగా ప్రకటించారు.
హైడ్రో క్లోరో క్వీన్ ఉపయోగాన్ని ట్రంప్ మరోసారి ధ్రువీకరించారు. దాదాపు 29లక్షల డోసుల ఔషధాన్ని తెప్పించినట్లు వెల్లడించారు. రానున్న రెండు వారాలు అత్యంత కఠినంగా గడవనున్నాయని ట్రంప్ చెప్పారు.