కరోనా లాక్ డౌన్... ఇంట్లోనే భార్యభర్తలు.. పెరిగిన విడాకుల కేసులు..
అయితే..భార్యాభర్తలు ఇళ్ళల్లోనే ఉండవలసి రావడం.. ఆ సమయంలో వారికి గొడవలు ఎక్కువగా జరగడం గమనార్హం. అదే ఇప్పుడు విడాకులకు దారి తీసింది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తుంది. చైనాలోని వుహాన్ లొ తొలుత ఈ వైరస్ ప్రారంభం కాగా.. ప్రపంచ దేశాలకు పాకింది. అయితే... ఇప్పుడు మరో చిక్కు వచ్చిపడింది. ఈ వైరస్ కారణంగా దంపతులు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారట.
ఇంతకీ మ్యాటరేంటంటే...చైనాలో వైరస్ మహమ్మారిలా వ్యాపిస్తున్న సమయంలో..అక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. లాక్ డౌన్ ద్వారా వైరస్ ని కట్టడి చేద్దామని అనుకున్నారు. అయితే.. అదే కారణం కొందరి దంపతుల మధ్య గొడవలకు కారణం అయ్యింది.
లాక్ డౌన్ తో కుటుంబసభ్యులంతా ఇంట్లోనే ఉండిపోయారు. మామూలుగా అయితే.. ఉదయం ఆఫీసులకు వెళితే.. మళ్లీ రాత్రి సమయంలోనే భార్యభర్తలు ఒకరి ముఖాలు మరోకరు చూసుకునేవారు. కానీ కరోనా వైరస్ కారణంగా.. అందరూ ఇళ్లకేపరిమితమయ్యారు.
అయితే..భార్యాభర్తలు ఇళ్ళల్లోనే ఉండవలసి రావడం.. ఆ సమయంలో వారికి గొడవలు ఎక్కువగా జరగడం గమనార్హం. అదే ఇప్పుడు విడాకులకు దారి తీసింది.
జియాన్, సిచువాన్ ప్రావిన్స్‌లలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ కేసుల కారణంగా మార్చి ప్రారంభంలో విడాకుల కేసుల సంఖ్య అత్యధికంగా నమోదైంది.
మిలువో సిటీ గవర్నమెంట్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం విడాకుల కోసం వచ్చిన దంపతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, కార్యాలయం సిబ్బంది కనీసం మంచి నీళ్ళు తాగడానికి సైతం సమయం దొరకడం లేదు.
కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధంలో భాగంగా విధించిన అష్ట దిగ్బంధనాన్ని పాక్షికంగా మార్చి రెండో వారంలో సడలించారు. అప్పటి నుంచి షాంఘైలోని ఓ న్యాయవాది వద్దకు వచ్చిన కేసుల సంఖ్య సాధారణం కన్నా 25 శాతం పెరిగింది.
జనం ఇళ్ళ దగ్గర లేనపుడు లవ్ అఫైర్లు నడపటానికి అవకాశం ఉంటుందని, అందుకే ‘‘నమ్మక ద్రోహం’’ కారణంగా విడాకులు కోరేవారు ఎక్కువగా కనిపిస్తున్నారని ఆ న్యాయవాది తెలిపారు.
విడాకుల విషయంలో చైనా చట్టాల్లో 2003 నుంచి మార్పులు వచ్చాయి. అప్పటి నుంచి విడాకుల రేటు క్రమంగా పెరుగుతోంది. ఆ ఒక్క ఏడాదిలోనే 13 లక్షల మంది విడాకులు పొందారు. 2018కి వచ్చే సరికి ఈ సంఖ్య 45 లక్షలకు చేరింది.
అయితే.. కరోనా విషయంలో చైనా ని చూసి ఇతర దేశాలు ఎలా అప్రమత్తమయ్యాయో.. ఈ విడాకుల విషయంలో కూడా అలర్ట్ అవ్వాలని అధికారులు చెబుతున్నారు.
ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా చాలా దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో.. అక్కడ కూడా విడాకులు కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.