రూ. 6 లక్షలకే కొత్త కారు.. రెనాల్ట్ కిగర్‌లో కళ్లు చెదిరే ఫీచర్లు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ మార్కెట్లోకి కొత్త కారును లాంచ్ చేసింది. కిగర్ పేరుతో ఈ కారును తీసుకొచ్చారు. ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సరికొత్త డిజైన్‌తో
రెనాల్ట్ తన కాంపాక్ట్ SUV కిగర్‌ను 2025 మోడల్‌గా కొత్త రూపంలో మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2025 కిగర్‌కు కొత్తగా రీడిజైన్ చేసిన 10-స్లాట్ ఫ్రంట్ గ్రిల్, మధ్యలో తాజా రెనాల్ట్ లోగో, సాటిన్ క్రోమ్ ఎయిర్ డ్యామ్ అమర్చారు. అదేవిధంగా ఇందులో కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఫాగ్ ల్యాంపులు, స్టైలిష్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్రెష్ బంపర్ డిజైన్ వంటివి కిగర్‌కు మరింత ఆధునిక SUV లుక్ ఇచ్చాయి.
KNOW
ఇంటీరియర్ అండ్ కంఫర్ట్
కారు లోపలి భాగంలో వైట్-బ్లాక్ డ్యూయల్-టోన్ క్యాబిన్ థీమ్‌ను ప్రవేశపెట్టారు. సీట్లపై కొత్త అప్‌హోల్స్టరీ వాడగా, డోర్ ప్యాడ్స్, డాష్‌బోర్డ్‌లో తాజా ట్రిమ్ ఇన్సర్ట్స్ జోడించారు. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.
సేఫ్టీ ఫీచర్లలో పెద్ద అప్‌డేట్
ఈసారి రెనాల్ట్ భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పుడు అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి ఫీచర్లను ఇచ్చారు.
ఇంజిన్ ఆప్షన్లు
కొత్త కిగర్ రెండు ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది:
* 1.0L నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్
పవర్: 71 bhp
టార్క్: 96 Nm
గేర్‌బాక్స్: 5-స్పీడ్ మ్యాన్యువల్ / 5-స్పీడ్ AMT
* 1.0L టర్బో పెట్రోల్
పవర్: 98.6 bhp
టార్క్: 160 Nm
గేర్‌బాక్స్: 5-స్పీడ్ మ్యాన్యువల్ / x-ట్రానిక్ CVT
ధర ఎంతంటే.?
కొత్త కిగర్ ధరలు రూ. 6.29 లక్షల నుంచి రూ. 11.29 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ప్రారంభంలో ఈ ధరలు ఇంట్రడక్షన్ ఆఫర్‌గా అందిస్తున్నారు. ఈ కారును కాస్పియన్ బ్లూ, ఐస్ కూల్ వైట్, మూన్ లైట్ సిల్వర్, స్టీల్త్ బ్లాక్, రేడియంట్ రెడ్, ఒయాసిస్ ఎల్లో (కొత్త), షాడో గ్రే (కొత్త) కలర్స్‌లో తీసుకొచ్చారు. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, స్కోడా కుశక్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి పోటీనిస్తోంది.