విండోస్ ఓపెన్ చేసి కారు నడిపిస్తే మైలేజ్ తగ్గుతుందా.? ఇందులో నిజమెంత
Car Tips: చాలా మంది కారులో ఫ్యూయల్ ఆదా చేయాలంటే ఏసీ ఆఫ్ చేసి విండోలు తెరిచి డ్రైవ్ చేయడం మంచిదని భావిస్తారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది.? నఇజంగానే మైలేజ్‌కి విండోస్‌కి మధ్య సంబంధం ఉందా ఇప్పుడు తెలుసుకుందాం.

విండో తెరిచి డ్రైవ్ చేస్తే మైలేజ్ పెరుగుతుందా?
చాలామంది విండో తెరిచి డ్రైవ్ చేస్తే మైలేజ్ పెరుగుతుందని భావిస్తారు. కానీ ప్రతి పరిస్థితిలో ఇది నిజం కాదు. కార్లు తయారు చేసే సమయంలో వాటి ఎయిరోడైనమిక్స్‌కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. అంటే గాలి ప్రతిఘటన తక్కువగా ఉండేలా కారును డిజైన్ చేస్తారు. అయితే విండోలు తెరిస్తే గాలి నేరుగా కారులోకి వస్తుంది. దీంతో కారు సమతుల్యత కొంచెం మారుతుంది. ఈ కారణంగా ఇంజిన్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది. దాంతో ఫ్యూయల్ వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది.
వేగంగా డ్రైవ్ చేసినప్పుడు మైలేజ్ తగ్గే అవకాశం
కారు గంటకు 70–80 కిలోమీటర్ల వేగంతో లేదా అంతకంటే ఎక్కువ స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు విండోలు తెరిచి డ్రైవ్ చేస్తే “డ్రాగ్ ఎఫెక్ట్” అనే ప్రభావం ఏర్పడుతుంది. ఈ సమయంలో గాలి కారును వెనక్కి నెట్టేలా ఉంటుంది. దీంతో ఇంజిన్ మరింత శ్రమించాల్సి వస్తుంది. ఫలితంగా పెట్రోల్ లేదా డీజిల్ ఎక్కువగా ఖర్చవుతుంది. కొన్ని సందర్భాల్లో హైవేపై విండోలు తెరిచి డ్రైవ్ చేస్తే మైలేజ్ 10 నుంచి 20 శాతం వరకు ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎయిరోడైనమిక్స్ కారు పనితీరుపై ప్రభావం
కారు విండోలు మూసి ఉంచినప్పుడు వాహనం గాలిని సులభంగా చీల్చుకుంటూ ముందుకు వెళ్తుంది. దీనివల్ల కారు ఎయిరోడైనమిక్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. కానీ విండోలు తెరిస్తే గాలి లోపలికి రావడం వల్ల కారు ఆకారం చుట్టూ గాలి ప్రవాహం మారుతుంది. ఇది కారు వేగాన్ని కొంత ప్రభావితం చేస్తుంది. దీంతో ఇంజిన్ ఎక్కువ శక్తి వినియోగించాల్సి వస్తుంది.
నగరంలో నెమ్మదిగా డ్రైవ్ చేస్తే ఎలా?
మీరు నగరంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేస్తున్నప్పుడు విండోలు తెరిచి వెళ్లడం పెద్ద సమస్య కాదు. ఈ వేగంలో గాలి ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంజిన్‌పై అదనపు లోడ్ పడదు. అదే సమయంలో ఏసీ ఆన్ చేస్తే కాంప్రెసర్ ఇంజిన్ నుంచి శక్తి తీసుకుంటుంది. దీనివల్ల కొంత ఫ్యూయల్ వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది.
మైలేజ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి?
హైవేపై వేగంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు విండోలు మూసి ఏసీ ఆన్ చేసి ప్రయాణించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కారు ఎయిరోడైనమిక్స్ సరిగ్గా పనిచేస్తుంది. కారు స్మూత్‌గా ముందుకు సాగుతుంది. దీంతో ఫ్యూయల్ వినియోగం కూడా కొంత వరకు తగ్గుతుంది. మొత్తంగా చెప్పాలంటే తక్కువ స్పీడ్‌లో విండోలు తెరిచి డ్రైవ్ చేయవచ్చు. కానీ ఎక్కువ వేగంలో ప్రయాణిస్తున్నప్పుడు విండోలు మూసి ఏసీతో డ్రైవ్ చేయడం మైలేజ్‌కు మంచిదని నిపుణులు చెబుతున్నారు.

