MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Automobile
  • Cars
  • మీరు మొదటిసారి కారు కొనాలని చూస్తున్నారా..? తక్కువ ధర, ఎక్కువ మైలేజీ కలిగిన బెస్ట్ బడ్జెట్ కార్లు ఇవే

మీరు మొదటిసారి కారు కొనాలని చూస్తున్నారా..? తక్కువ ధర, ఎక్కువ మైలేజీ కలిగిన బెస్ట్ బడ్జెట్ కార్లు ఇవే

మీరు మొదటిసరి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇస్తూనే ఎక్కువకాలం సర్వీస్ ఇచ్చే వాహనాలేవో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి కార్ల వివరాలు మీకోసం...   

2 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 13 2024, 08:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొదటిసారి కారు కొంటున్నారా?

మొదటిసారి కారు కొంటున్నారా?

ఏ వాహనమూ లేనివారికి బైక్ కొనాలని కోరిక... బైక్ వున్నవారికి కారు కొనాలనే కోరిక వుంటుంది. అయితే బైక్ అయినా, కారు అయినా... మొదటిసారి కొనేటప్పుడు ఆ ఆనందమే వేరు. ఆ కుటుంబమంతా సంతోషంలో మునిగిపోతుంది. అయితే ఇలా మొదటిసారి కారు కొనేవారు భవిష్యత్ లో ఈ కారు ఎందుకు కొన్నామురా బాబు? అని బాధపడకుండా వుండాలంటే ఇప్పుడే జాగ్రత్తగా వుండాలి.

తక్కువధరలో మంచి కంపనీకి  చెందినది, ఉత్తమ మైలేజీ ఇచ్చేది, బడ్జెట్ మెయింటెనెన్స్ కలిగిన కారును ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే మార్కెట్ లో అనేక కంపనీలు, వాటిలో అనేక మోడల్ కార్లు వున్నాయి...వాటిలో ఏది ఉత్తమమో తెలుసుకోవడం చాలా కష్టంతో కూడిన అంశం.  చాలామంది ఈ విషయంలో అయోమయానికి గురవుతుంటారు. 

తొలిసారిగా కారు కొనూవారు డబ్బుకు తగిన విలువను అందించే వాహనాన్ని ఎంపిక చేసుకోవాలి. ధర,మెయింటెనెన్స్, మైలేజితో పాటు రీసెల్ విలువను కూడా చూసుకోవాలి. ఇలా సరైన కారును ఎంపికచేసి కొనుగోలుచేయడం ద్వారా మొదటిసారి కారు వాడేవారు దీర్ఘకాలికంగా ఆనందంగా వుంటారు. లేదంటే బాధపడాల్సి వస్తుంది. ఇలా బడ్జెట్ తో పాటు అన్ని అంశాల్లోనూ మెరుగైన కార్ల వివరాలు మీకోసం... 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
TATA Tiago

TATA Tiago

టాటా టియాగో :

టాటా టియాగో భారతదేశంలో తొలిసారి కారు కొనుగోలు చేయాలనుకునేవారికి సరిగ్గా సరిపోతుంది. అందుబాటు ధర, భద్రతా ఫీచర్లతో లభిస్తుంది. ముఖ్యంగా భద్రత విషయంలో గ్లోబల్ NCAP నుండి ఇది ఫోర్ స్టార్ రేటింగ్ పొందింది, 

ఈ కారు పెట్రోల్ తోనే కాదు సిఎన్జి తో నడిచే ఏర్పాటును కలిగివుంది. దీని ప్రత్యేకమైన CNG-AMT సెటప్ ఈ ఫీచర్‌ను అందించే ఏకైక కారుగా నిలిచింది. ఈ కారుప్రారంభ ధర ₹5.59 లక్షలు మాత్రమే. (ప్రాంతాన్ని బట్టి ఈ ధర మారుతుంది)

35
Maruti Suzuki S-Presso

Maruti Suzuki S-Presso

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో : 

అదనపు ప్రయోజనాలతో చిన్న కారు కోసం చూస్తున్న తొలిసారి కొనుగోలుదారులకు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోను పరిశీలించవచ్చు. ఇది చిన్న హ్యాచ్‌బ్యాక్ యొక్క సౌలభ్యాన్ని, మినీ-SUV యొక్క లుక్ ను కలిగివుంటుంది. ఇది రద్దీగా ఉండే నగర వీధులలో ప్రయాణానికి సౌకర్యవంతంగానూ, ఇరుకైన ప్రదేశాలలో పార్కింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కారు కూడా పెట్రోల్-, సిఎన్జి వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర ₹4.26 లక్షల నుండి ₹6.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది 

45
Maruti Suzuki Alto K10

Maruti Suzuki Alto K10

మారుతి సుజుకి ఆల్టో K10

మారుతి సుజుకి ఆల్టో K10 తొలిసారి కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఉత్తమ ఎంపిక. ముఖ్యంగా ఇంధన సామర్థ్యం, సరసమైన ధరకు ప్రాధాన్యత ఇచ్చేవారు దీనిని పరిశీలించవచ్చు. ఈ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ నగర డ్రైవింగ్‌కు బాగా సరిపోతుంది. 

చాలా తక్కువ ఖర్చుతో రోజువారీ ప్రయాణాలకు ఈ కారు అనుకూలంగా ఉంటుంది. దీని ధర ₹3.99 లక్షల నుండి ₹5.96 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఆల్టో K10లో కొన్ని అధునాతన ఫీచర్లు ఉండకపోవచ్చు,. కానీ ఇది చాలా బడ్జెట్ ప్రెండ్లీ వాహనం.   

55
Hyundai Grand i10 Nios

Hyundai Grand i10 Nios

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ దాని ప్రీమియం ఫీల్, ఫీచర్-ప్యాక్డ్ డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. స్టైలిష్ లుక్ తో కూడిన బడ్జెట్ కారు కోసం చూస్తున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలంపెట్రోల్, పెట్రోల్‌-సిఎన్జి తో రెండు రకాలుగా వేరియంట్స్ లో లభిస్తుంది. 

 గ్రాండ్ i10 నియోస్ మాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుంది. దీని ధర ₹5.73 లక్షల నుండి ₹8.51 లక్షల వరకు ఉంటుంది. ఇది సరసమైన ధర, ప్రీమియం ఫీచర్ల యొక్క పరిపూర్ణ సమ్మేళనం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
EV Car: 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌.. ఏకంగా 1100కిలో మీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ కారు
Recommended image2
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image3
Mahindra Scorpio Pickup Truck: అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ గ్రాండ్ ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved