ఫాష్ ఇంగ్లీష్ లో కాదు పక్కా తెలుగులో టెక్ పాఠాలు.. ఐటీ జాబ్ కన్ఫర్మ్..!
Join Devops : మీరు ఇంగ్లీష్ లో వీకా… అయినా పర్లేదు… తెలుగులో కూడా టెక్ పాఠాలు చెప్పె ఆన్లైన్ కోచింగ్ యాప్ వచ్చేసింది. ఇది మీ సాప్ట్ వేర్ జాబ్ కలను సాకారం చేస్తుంది.

తెలుగులోనే ఐటీ కోర్సులు ... ఓ తెలుగు కుర్రాడి అద్భుతం
IT Jobs : ఐఐటీలు, ఫారెన్ చదువుల యువతీయువకులకే లక్షల జీతంతో ఐటీ ఉద్యోగాలు వస్తాయనేది అపోహ మాత్రమేనని నిరూపించాడో తెలుగబ్బాయి. అచ్చ తెలుగులో చదివినవారు.. ఫాష్ ఇంగ్లీష్ మాట్లాడలేనివారిని కూడా కూడా పెద్దపెద్ద ఐటీ కంపెనీల్లో సాప్ట్ వేర్ ఉద్యోగాలను సాధించేలా తయారుచేస్తున్నాడు. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఎందులోనూ తక్కువకాదని... భాష అనేది వారి ఎదుగుదలను ఆపలేదని నిరూపించాడు. తెలుగోళ్లకు ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెడుతున్నాడు నెల్లూరు కుర్రాడు శివకుమార్ రెడ్డి.
తెలుగోళ్ల కోసమే ''జాయిన్ డెవాప్స్'' స్టార్టప్
సాప్ట్ వేర్ ఉద్యోగం అనగానే సబ్జెక్ట్ పై పట్టులేకున్నా ఇంగ్లీష్ పై మంచి పట్టు ఉంటేచాలు సాధించవచ్చు అనేది చాలామంది భావన. కానీ ఇంగ్లీష్ అనేది కేవలం కమ్యూనికేషన్ కోసమే.. మనకు సబ్జెక్ట్ పై పట్టు ఉంటే చాలంటున్నారు 'జాయిన్ డెవాప్స్' స్టార్టప్ వ్యవస్థాపకులు శివకుమార్ రెడ్డి.
డెవాప్స్ అంటే 'డెవలప్మెంట్ ఆండ్ ఆపరేషన్స్'.. ఇది తెలుగులో టెక్ పాఠాలను బోధించే ఓ ఆన్లైన్ కోచింగ్ యాప్. సాప్ట్ వేర్ ఉద్యోగాల్లో చేరాలంటే ఇంజనీరింగ్ తో పాటు ప్రత్యేకంగా కొన్ని కోర్సులు చేయాల్సి ఉంటుంది... కానీ చాలా కోచింగ్ సెంటర్లు వీటిని ఇంగ్లీష్ లోనే అందిస్తున్నాయి. ఈ ఇంగ్లీష్ వీక్ నెస్ కారణంగా తెలుగు యువత ఐటీ రంగంలో రాణించలేకపోతున్నారు... ఇది గమనించిన నెల్లూరు కుర్రాడు శివకుమార్ రెడ్డి ఆలోచనలోంచి పుట్టిందే 'జాయిన్ డెవాప్స్'.
ఈ ఆన్లైన్ ఐటీ కోచింగ్ యాప్ లో తెలుగులోనే శిక్షణ ఇస్తారు... కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు వర్క్ అనుభవాన్ని కూడా అందిస్తారు. అంటే ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా చేరితే ఎలాంటి విధులు నిర్వర్తించాలి? ప్రాజెక్ట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? అనేది నేర్పిస్తారు. దీనివల్ల తెలుగు యువతలో కాన్పిడెంట్ పెరిగి మంచిమంచి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. ఇప్పటివరకు జాయిన్ డెవాప్స్ లో శిక్షణపొందిన దాదాపు 3500 మంది మంచి సాలరీతో టాప్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించినట్లు వ్యవస్థాపకులు శివకుమార్ రెడ్డి చెబుతున్నారు.
ఎవరీ శివకుమార్ రెడ్డి?
ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని మారుమూల గ్రామం కలువాయిలో రైతు కుటుంబంలో జన్మించాడు శివకుమార్. అతడి విద్యాభ్యాసమంతా స్వస్థలంలోనే సాగింది... ఇంజనీరింగ్ కర్నూల్ లో పూర్తిచేశాడు. ఎలాగోలా కష్టపడి ప్రముఖ ఐటీ కంపెనీ టిసిఎస్ లో సాప్ట్ వేర్ ఉద్యోగం సాధించాడు. ఆ తర్వాత అనేక ఐటీ కంపెనీల్లో చాలా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు.
అయితే ఎంతోమంది తెలుగు యువత ఇంగ్లీష్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని... ఇంగ్లీష్ వస్తేనే ఐటీ ఉద్యోగం అన్న భ్రమలో ఉన్నారని శివకుమార్ గుర్తించాడు. ఇది కేవలం అపోహ మాత్రమే... తెలుగు చదివి కూడా ఐటీ ఉద్యోగాలు సాధించవచ్చని నిరూపించాలని అనుకున్నాడు. దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తెలుగులో ఐటీ పాఠాలు బోధించడం ప్రారంభించాడు.
యూట్యూబ్ లో టెక్ పాఠాలు
యూట్యూబ్ ద్వారా ఎక్కువమందికి తన తెలుగు ఐటీ పాఠాలు చేరడంలేదని గుర్తించిన శివకుమార్ 'జాయిన్ డెవాప్స్' పేరిట ప్రత్యేక ఆన్లైన్ కోచింగ్ స్టార్టప్ ను ప్రారంభించాడు. అతి తక్కువ ఫీజుతో యువతకు తెలుగులోని నిపుణులు పాఠాలు బోధించే ఏర్పాటు చేశాడు. ఇలా ఇక్కడ ఐటీ పాఠాలు నేర్చుకుని చాలామంది సాప్ట్ వేర్ ఉద్యోగాలను పొందారు. స్టార్టప్ గా మొదలైన ఈ 'జాయిన్ డెవాప్స్' కూడా మంచి ఆదరణ పొంది లాభాలను పొందుతోంది.
గ్రామీణ ప్రాంత యువత కోసమే 'జాయిన్ డెవాప్స్'
గ్రామీణ ప్రాంతాలు, చిన్నచిన్న పట్టణాల్లో ఇప్పటికీ చాలామందికి ఇంగ్లీష్ అంటే భయం... అద్భుత ప్రతిభ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేక వెనకబడిపోతుంటారు. ఇలాంటి విద్యార్థుల్లో కాన్ఫిడెంట్ కలిగించి ఉద్యోగాలను సాధించేలా చేయడమే 'జాయిన్ డెవాప్స్' పని. తెలుగులోనే ఐటీ పాఠాలను బోధిస్తారు కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండదు... కాబట్టి సాప్ట్ వేర్ ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు నేర్చుకుంటారు. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగి ఈజీగా ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. ఇలా యువతకు ఇంగ్లీష్ లో కాదు తెలుగులో ఐటీ రంగానికి సంబంధించిన కోచింగ్ ఇస్తూ అద్భుతాలు చేస్తోంది 'జాయిన్ డెవాప్స్'