- Home
- Careers
- ibps calendar 2025: ఐబీపీఎస్ క్యాలెండర్ 2025 విడుదల.. పీవో, క్లర్క్,ఎస్వో పరీక్షలు ఎప్పుడంటే?
ibps calendar 2025: ఐబీపీఎస్ క్యాలెండర్ 2025 విడుదల.. పీవో, క్లర్క్,ఎస్వో పరీక్షలు ఎప్పుడంటే?
ibps calendar 2025: ఐబీపీఎస్ 2025-26 పరీక్షల పునరుద్దరించిన షెడ్యూల్ ను విడుదల చేసంది. దీని ప్రకారం పీవో, క్లర్క్, ఎస్వో, ఆర్ఆర్బీ ఆఫీసర్ పరీక్షల తేదీలు మారాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

IBPS క్యాలెండర్ 2025 విడుదల
ibps calendar 2025: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2025-26 సంవత్సరానికి సంబంధించిన పునరుద్దరించిన పరీక్షల క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో ఆర్ఆర్బీ ఆఫీసర్, పీవో, క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల పరీక్షలకు సంబంధించిన తాజా తేదీలు పేర్కొన్నారు.
IBPS పరీక్షలపై స్పష్టతతో అభ్యర్థులకు మంచి అవకాశం
ఐబీపీఎస్ క్యాలెండర్ విడుదలతో బ్యాంకింగ్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు స్పష్టమైన టైమ్‌లైన్ లభించింది. పరీక్షలు 2025 ఆగస్టు నుండి 2026 ఫిబ్రవరి వరకు సాగనున్నాయి. ఈసారి పరీక్షలు నిర్ధిష్ట కాలపట్టిక ప్రకారం ఉండటం వల్ల అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను సమయపాలనతో ప్రణాళికాబద్ధంగా చేసుకోవచ్చు.
IBPS 2025-26 పరీక్షల తేదీలు
1. RRB ఆఫీసర్ (రీజనల్ రూరల్ బ్యాంకులు)
ఆఫీసర్ స్కేల్-I
- ప్రిలిమ్స్: జూలై 27, ఆగస్టు 2, 3
- మెయిన్స్: సెప్టెంబర్ 13
ఆఫీసర్ స్కేల్-II & III
- మెయిన్స్: సెప్టెంబర్ 13
ఆఫీసు అసిస్టెంట్స్
- ప్రిలిమ్స్: ఆగస్టు 30, సెప్టెంబర్ 6, 7
- మెయిన్స్: నవంబర్ 9
IBPS 2025-26 పరీక్షల తేదీలు
2. IBPS PO (ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్‌మెంట్ ట్రైనీ)
- ప్రిలిమ్స్: అక్టోబర్ 4, 5, 11
- మెయిన్స్: నవంబర్ 29
3. IBPS SO (స్పెషలిస్ట్ ఆఫీసర్)
- ప్రిలిమ్స్: నవంబర్ 22, 23
- మెయిన్స్: జనవరి 4 (2026)
4. IBPS Clerk (కస్టమర్ సర్వీస్ అసోసియేట్)
- ప్రిలిమ్స్: డిసెంబర్ 6, 7, 13, 14
- మెయిన్స్: ఫిబ్రవరి 1 (2026)
ఐబీపీఎస్ క్యాలెండర్ 2025 లో ప్రధానమైన మార్పులు
- IBPS క్లర్క్ మెయిన్స్ నవంబర్ 29న జరగనుండగా, ప్రిలిమ్స్ & మెయిన్స్ మధ్య సరైన గ్యాప్ ఇచ్చారు.
- IBPS SO మెయిన్స్ నవంబర్ 9న జరగనుంది. ప్రత్యేక విభాగాలైన ఐటీ, హెచ్‌ఆర్, మార్కెటింగ్, లా అభ్యర్థులకు మంచి ప్రిపరేషన్‌కు సమయం లభిస్తుంది.
- RRB Officer Scale II & III కోసం ఒకే ఒక్క మెయిన్స్ పరీక్ష డిసెంబర్ 28న జరగనుంది.
ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్ అవసరం
IBPS క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది పరీక్షల సమయాలు క్రమబద్ధంగా ఉండటంతో అభ్యర్థులు ఏ పరీక్ష అయినా.. పీవో, క్లర్క్, ఎస్వో లేదా ఆర్ఆర్బీ ఆఫీసర్.. లక్ష్యంగా పెట్టుకుని తగిన ప్రణాళిక ప్రిపరేషన్ లో ఉండాలి. టైమ్ టేబుల్‌ను అనుసరించి సబ్జెక్ట్ ప్రాధాన్యతను నిర్ణయించడం ద్వారా సమర్థవంతంగా ప్రిపరేషన్ చేయవచ్చు.
ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్: https://www.ibps.in చూడండి.