కేవలం ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్... నెలకు రూ.81,000 సాలరీ
కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.

ఐఐసిబిలో ఉద్యోగాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (CSIR – IICB) కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థ. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. 12వ తరగతి ఉత్తీర్ణులకు ఇది మంచి అవకాశం. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ జూలై 28, 2025న ప్రారంభమయ్యింది… ఇది ఆగస్టు 22, 2025న ముగుస్తుంది.
KNOW
IICB భర్తీచేసే ఖాళీలివే
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Gen./ F&A/ S&P):
మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణత అవసరం. కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం అంటే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. జీతం నెలకు రూ.19,900 నుండి రూ.63,200 వరకు ఉంటుంది.
జూనియర్ స్టెనోగ్రాఫర్:
ఇవి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీలో నిర్దిష్ట అర్హతలు ఉండాలి. జీతం నెలకు రూ.25,500 నుండి రూ.81,100 వరకు ఉంటుంది.
IICB ఉద్యోగాలకు వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు 28 సంవత్సరాలు, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు 27 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ STలకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు, PwBDలకు 10 నుండి 15 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
మహిళలు, SC/ ST, Ex-servicemen, PwBDలకు దరఖాస్తు ఫీజు లేదు. ఇతరులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం
అభ్యర్థులను స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు CSIR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ అధికారిక వెబ్సైట్ [https://iicb.res.in/] ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వెంటనే దరఖాస్తు చేసుకొండి
దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ లోని అర్హతలను పూర్తిగా చదివి నిర్ధారించుకోవడం ముఖ్యం. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే దరఖాస్తు చేసుకుని మీ ప్రభుత్వ ఉద్యోగ కలను సాకారం చేసుకోండి!