MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Careers
  • ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నారా.? అయితే ఈ సినిమాలు చూడండి

ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నారా.? అయితే ఈ సినిమాలు చూడండి

చ‌దువు కంటే క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌కి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇది లేకే చాలా మంది ఉద్యోగాల‌ను పొంద‌లేక‌పోతున్నారు. ఇంటర్వ్యూలో మార్కుల‌ కంటే మీ ఆలోచనలను ఎంత స్పష్టంగా వ్యక్తపరిచారో అన్నదే ప్రాధాన్యం.  

1 Min read
Author : Narender Vaitla
Published : Aug 20 2025, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ముఖ్యం?
Image Credit : Getty

కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ముఖ్యం?

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో, ఎక్కువగా రీల్స్, షార్ట్ వీడియోలు, మెసేజీల్లో మునిగిపోతున్నారు. అందువల్ల, వాస్తవ జీవితంలో సంభాషణకు వస్తే చాలా మందికి భయమేస్తోంది. ముందున్న వ్యక్తి మాట్లాడుతుంటే, మనం తడబడి పదాలు దొరకక ఇబ్బందిపడతాం. ఇది ఇంటర్వ్యూలో నెగటివ్ ఇంప్రెషన్ కలిగిస్తుంది. అందుకే మాటలలో స్పష్టత, నమ్మకం, బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Thank You for Smoking – మాటల మంత్రం
Image Credit : amazonprime

Thank You for Smoking – మాటల మంత్రం

ఈ సినిమా ఒక తంబాకూ కంపెనీ లాబీయిస్ట్ అయిన నిక్ నైలర్ కథ. తన మాటలతోనే ఎలా అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తాడో చూపిస్తుంది. వాదనను ఎలా సమర్ధవంతంగా వినిపించాలి, బాడీ లాంగ్వేజ్, వాయిస్ టోన్ ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఈ సినిమాతో నేర్చుకోవచ్చు. మాటల శక్తిని అర్థం చేసుకోవాలంటే ఇది తప్పక చూడాల్సిన సినిమా.

35
Yes Man – పాజిటివ్ వైఖరి ప్రాధాన్యం
Image Credit : IMDB

Yes Man – పాజిటివ్ వైఖరి ప్రాధాన్యం

జిమ్ క్యారీ నటించిన ఈ కామెడీ చిత్రం, “య‌స్ చెప్ప‌డం ద్వారా కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో” చూపిస్తుంది. ఇంటర్వ్యూలో పాజిటివ్ అటిట్యూడ్ ఎంత ముఖ్యం, ఇతరులు చెప్పే మాట‌ల‌ను శ్రద్ధగా వినడం ఎందుకు అవసరం, కంఫర్ట్ జోన్‌ నుంచి బయటపడటం ఎలా విజయానికి దారి తీస్తుందో నేర్పిస్తుంది.

45
A Thousand Words – తక్కువ మాటల్లో ఎక్కువ అర్థం
Image Credit : Wiki

A Thousand Words – తక్కువ మాటల్లో ఎక్కువ అర్థం

ఎడ్డి మర్ఫీ నటించిన ఈ సినిమా, ఒక మాటే కొన్ని సార్లు పెద్ద వాక్యాల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుందని చెబుతుంది. ఇంటర్వ్యూలో మాటల క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం అని గుర్తుచేస్తుంది. బాడీ లాంగ్వేజ్, హావభావాలు కూడా సంభాషణలో కీలక పాత్ర వహిస్తాయని ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది.

55
Suckers – కస్టమర్‌ని ఎలా ఒప్పించాలి?
Image Credit : IMDB

Suckers – కస్టమర్‌ని ఎలా ఒప్పించాలి?

ఈ సినిమా కార్ల విక్రయాల చుట్టూ తిరుగుతుంది. కస్టమర్ మన మాటల వల్ల ఎలా ప్రభావితమవుతాడో చూపిస్తుంది. వేరువేరు వ్యక్తిత్వాలకు ఎలా తగిన విధంగా మాట్లాడాలి, వారి అవసరాలను ఎలా అర్థం చేసుకోవాలి అన్నదానిపై స్పష్టత ఇస్తుంది. సేల్స్, మార్కెటింగ్ రంగంలో ఉండేవారికి ఇది చాలా ఉపయోగకరమైన సినిమా.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఉద్యోగాలు, కెరీర్
విద్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే
Recommended image2
Free Education: ఉచిత విద్యను అందించే దేశాలు.. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image3
Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?
Related Stories
Recommended image1
2 రూపాయ‌ల నోటుతో రూ. 5 ల‌క్ష‌లు మీ సొంతం.. మీరు కూడా ఇలాంటి వార్త‌లు చ‌దివారా.?
Recommended image2
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved