MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Train Travel: అత్యవసర సమయంలో టిక్కెట్ లేకపోయినా ఇలా రైళ్లలో ప్రయాణించవచ్చు, కానీ...

Train Travel: అత్యవసర సమయంలో టిక్కెట్ లేకపోయినా ఇలా రైళ్లలో ప్రయాణించవచ్చు, కానీ...

రైళ్లలో అత్యవసరంగా అప్పటికప్పుడు ప్రయాణం (Travel) చేయాల్సి రావచ్చు.  టిక్కెట్ బుక్ చేసుకుందామన్నా ఒక్కోసారి కుదరదు. అలాంటప్పుడు ఏమి చేయాలి? భారతీయ రైల్వే నియమం ప్రకారం మీరు టిక్కెట్ బుక్ చేసుకోకపోయినా రైలులో ప్రయాణించవచ్చు. అదెలాగో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 13 2025, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అత్యవరసర ప్రయాణం చేయాల్సి వస్తే...
Image Credit : Google

అత్యవరసర ప్రయాణం చేయాల్సి వస్తే...

ఎప్పుడు అత్యవసర పని పడుతుందో తెలియదు. ఏదైనా అర్జెంట్ పని ఉంటే రైలు మీద ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఏదైనా ముఖ్యమైన పనికి వెంటనే వెళ్లాల్సి వస్తే టికెట్ తీసుకోవడానికి సమయం ఉండదు. ఆన్‌లైన్‌లో టికెట్ దొరక్క పోవచ్చు. ఇలాంటి సమయంలో టికెట్ లేకుండా ప్రయాణించవచ్చా?  ఈ విషయంలో భారతీయ రైల్వే నియమాలు ఏమిటో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇలా ప్రయాణించవచ్చు
Image Credit : GEMINI AI

ఇలా ప్రయాణించవచ్చు

మీకు అత్యవసర పరిస్థితులు వస్తే  భారతీయ రైల్వే నియమం ప్రకారం ప్రయాణించవచ్చు.  మీరు ముందుగా  ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకుని రైలు ఎక్కవచ్చు. నిజంగా అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. ప్లాట్‌ఫారమ్ టికెట్ త్వరగా దొరుకుతుంది.

35
ప్లాట్‌ఫారమ్ టికెట్ తో
Image Credit : Social Media

ప్లాట్‌ఫారమ్ టికెట్ తో

ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకుని రైలు ఎక్కి టిటిఇకి మీ సమస్యను చెప్పండి. వారు మీకు అప్పటికప్పుడు టికెట్ ఇస్తారు. కానీ పూర్తి ఛార్జీని చెల్లించాలి. అలాగే జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. టికెట్ లేకుండా ప్రయాణించినందుకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలాగని జనరల్ కోచ్ టికెట్ తీసుకుని స్లీపర్ లేదా ఎసి కోచ్‌లో ప్రయాణించడం వంటివి చేయవద్దు. 

45
జనరల్ టికెట్
Image Credit : Instagram

జనరల్ టికెట్

లేదా జనరల్ టికెట్ తీసుకుని కూడా ప్రయాణించవచ్చు. తక్కువ దూరాలు ప్రయాణించేవారు జనరల్ టిక్కెట్ మీద ప్రయాణింవచ్చు. లాంగ్ జర్నీ మాత్రం జనరల్ లో చాలా కష్టం. కానీ మీకు జనరల్ టికెట్ కచ్చితంగా దొరుకుతుంది. అన్ని రైళ్లలోనూ జనరల్ కంపార్ట్‌మెంట్ ఉంటుంది. రిజర్వేషన్ లేకుండా వెళ్లవచ్చు. కానీ జనం ఎక్కువగా ఉంటారు. లాంగ్ జర్నీకి కష్టమైనా, సడన్ ట్రిప్‌కి జనరల్ టికెట్ బెస్ట్.

55
జరిమానా
Image Credit : Pixabay

జరిమానా

కొన్నిసార్లు జరిమానా కట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నా రైలులో కన్ఫర్మ్ టికెట్ దొరకడం అనుమానమే. భారతీయ రైలు నియమాల ప్రకారం వెయిటింగ్ టికెట్ తీసుకుని స్లీపర్ కోచ్‌లో ప్రయాణించకూడదు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Dirtiest Train: మన దేశంలోనే అత్యంత మురికి రైలు ఇదే, దీనిలో ప్రయాణం నరకతో సమానం.. అయినా టికెట్లు దొరకవు
Recommended image2
భారీ లగేజీలతో రైలు ఎక్కేస్తున్నారా? జరిమానాలు పడిపోతాయి జాగ్రత్త, లగేజీ ఈ పరిమితికి ఎంచకూడదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved