MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Dirtiest Train: మన దేశంలోనే అత్యంత మురికి రైలు ఇదే, దీనిలో ప్రయాణం నరకతో సమానం.. అయినా టికెట్లు దొరకవు

Dirtiest Train: మన దేశంలోనే అత్యంత మురికి రైలు ఇదే, దీనిలో ప్రయాణం నరకతో సమానం.. అయినా టికెట్లు దొరకవు

మన దేశంలో ఎన్నో రైళ్లు ఉన్నాయి. అన్నింట్లో అతి మురికి రైలుగా పేరు తెచ్చుకుంది ఒక ట్రైను. దీనిలో ప్రయాణం చేయడం చాలా కష్టం. అయితే ఈ ట్రైన్‌కి టికెట్లు కూడా దొరకవు. అంతగా ప్రయాణికులు దీనిలో ప్రయాణం చేస్తారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 11 2025, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారతీయ రైల్వేలో మురికి రైళ్లు
Image Credit : IRCTC

భారతీయ రైల్వేలో మురికి రైళ్లు

వందే భారత్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉన్న రైలులో ప్రయాణం చేశాక మన దేశంలో ఉన్న కొన్ని మురికి రైళ్లల్లో ప్రయాణం చేయలేరు. మన దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైళ్లు ఉన్నాయి. కొన్ని నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటాయి. మరికొన్ని ఎక్కువ దూరాలు ప్రయాణిస్తాయి. అన్నింట్లో వందే భారత్, రాజధాని ఎక్స్ ప్రెస్ వంటివి ఎక్కువ సౌకర్యాలను కలిగి ఉంటాయి. అయితే మన రైళ్లలో కొన్ని మురికి రైళ్లు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మురికి రైళ్లపై నివేదిక
Image Credit : IRCTC

మురికి రైళ్లపై నివేదిక

అత్యంత మురికి రైళ్లు అని చెప్పి ఏ ట్రైన్లకు కూడా అధికారికంగా బిరుదును ఇవ్వలేదు. ట్రైన్లు మురికిగా ఉన్నాయనే ఫిర్యాదులు ఆధారంగానే ప్రస్తుతం భారతదేశంలో అత్యంత మురికి రైళ్ల జాబితా గురించి చెప్పుకోవచ్చు. రైళ్లల్లో మురికిగా ఉంటే ఫిర్యాదులు చేయమని రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను ఇస్తూ ఉంటుంది. ఆ నెంబర్లకి కాల్ చేయడం లేదా ఫిర్యాదు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి రైళ్ల విషయంలో ఒక నివేదిక వెలుగులోకి వచ్చింది.

35
పరమ మురికి రైలు
Image Credit : IRCTC

పరమ మురికి రైలు

ట్రావెల్ వ్లాగర్ అయినా ఉజ్వల సింగ్ అనే వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో అతను రైలు లోపల ఉన్న మురికి, చెత్తచెదారం చూపించారు. రైలు పేరు కన్యాకుమారి వివేక ఎక్స్‌ప్రెస్. ఆ రైలులో ప్రయాణం చేయడం అంటే నరకంతో సమానమేనని అనిపిస్తుంది. ఇది 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది దేశంలోనే అత్యంత మురికి రైలుగా ప్రజలు చెప్పుకుంటారు. ఈ రైలు కన్యాకుమారిలో మొదలై దిబ్రూగడ్ వరకు ప్రయాణిస్తుంది. ఇలా వెళ్లడానికి 74 నుండి 75 గంటలు పడుతుంది. 9 రాష్ట్రాల గుండా ప్రయాణించే ఈ రైలులో అత్యంత దుర్వాసన వస్తూ ఉంటుంది.

45
ఇది మరొక మురికి రైలు
Image Credit : IRCTC

ఇది మరొక మురికి రైలు

ప్రస్తుతం రైల్వే సౌకర్యాలను ఐఆర్సిటిసి పెంచుతూనే ఉంది. కానీ కొన్ని రైళ్లల్లో మాత్రం ఇంకా ఎలాంటి పరిశుభ్రతను పాటించడం లేదు. అమృత్సర్ నుండి వెళ్లే గరీబ్ రథ్ రైలు కూడా భారతదేశంలోనే మురికి రైలుగా చెప్పుకోవచ్చు. పంజాబ్లోని అమృత్సర్ నుండి ఇది బయలుదేరి బీహార్లోని సహర్సా జిల్లా వరకు వెళుతుంది. టికెట్ ధర కూడా ఎక్కువే ప్రజలు కూడా ఈ రైలును ఎక్కువగానే బుక్ చేసుకుంటారు. కానీ కోచ్ లన్నీ మురికి గానే ఉంటాయి.

55
ఇవి కూడా మురికి రైళ్లే
Image Credit : IRCTC

ఇవి కూడా మురికి రైళ్లే

పైన చెప్పిన రైళ్లు మాత్రమే కాదు జోగ్‌బాని ఆనంద్ విహార్ సీమాంచల్ ఎక్స్ ప్రెస్, బాంద్రా వైష్ణోద్వేవీ స్వరాజ్ ఎక్స్ ప్రెస్, ఫిరోజ్పూర్ అగర్తలా త్రిపుర సుందరి ఎక్స్ ప్రెస్, న్యూఢిల్లీ దిబ్రూఘర్ రాజధాని ఎక్స్ ప్రెస్ వంటివి కూడా. మురికి రైళ్లలో నీరు సరిగా రాదు. దుప్పట్లు కూడా మురికిగా ఉంటాయి. సీట్లు చిరిగిపోయి బాత్రూం కంపు కొడుతూ ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Vande Bharat Train: వందే భారత్ మొదటి స్లీపర్ రైలు వచ్చేస్తోంది, ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో
Recommended image2
భారీ లగేజీలతో రైలు ఎక్కేస్తున్నారా? జరిమానాలు పడిపోతాయి జాగ్రత్త, లగేజీ ఈ పరిమితికి ఎంచకూడదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved