- Home
- Business
- భారీ లగేజీలతో రైలు ఎక్కేస్తున్నారా? జరిమానాలు పడిపోతాయి జాగ్రత్త, లగేజీ ఈ పరిమితికి ఎంచకూడదు
భారీ లగేజీలతో రైలు ఎక్కేస్తున్నారా? జరిమానాలు పడిపోతాయి జాగ్రత్త, లగేజీ ఈ పరిమితికి ఎంచకూడదు
కొంతమంది తమతోపాటు ఐదారు లగేజీ బ్యాగులు పట్టుకొని ట్రైన్ ఎక్కేస్తారు. ఒకే బెర్త్ బుక్ చేసుకున్న కూడా లగేజీల కోసమే ఎక్కువ ప్లేస్ ను ఆక్రమిస్తారు. ఇకపైన అలా ఎక్కువ లగేజీతో రైలు ఎక్కలేరు.

ఐఆర్సీటీసీ రూల్స్ మారాయ్
ఐఆర్‌సిటిసి ఎప్పటికప్పుడు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త నియమాలను అమలు చేస్తూనే ఉంది. ఇప్పుడు రైలు ప్రయాణికులు లగేజీలకు కూడా ఒక పరిమితిని విధించే నియమాలను కఠినతరం చేయబోతోంది. విమానాల మాదిరిగానే రైలు ఎక్కేందుకు ఆ లగేజీ బరువుకు ఒక పరిమితి ఉంటుంది. అంతకుమించి ఒక వ్యక్తి ఎక్కువ లగేజీలు పట్టుకోకూడదు. రైలులో ప్రయాణికుల భద్రతా సౌకర్యాల కోసమే భారతీయ రైల్వే ఈ ప్రయత్నాలను చేస్తోంది.
లగేజీ విషయంలో విమాన ప్రయాణికుల మాదిరిగానే రైల్వేలు కూడా కఠినంగా నియమాలను అమలు చేయాలని భావిస్తోంది. మనం తీసుకెళ్లే సామాను బరువు ఎంత ఉండాలో ఇప్పటికే నిర్ణయించింది ఐఆర్సిటిసి.
లగేజీ లిమిట్ ఇంతే
దేశంలోనే కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో లగేజీ బరువు పరిమితిని కచ్చితంగా అమలు చేయబోతున్నారు. విమానాలలాగే రైలు ప్రయాణానికి కూడా ఈ నియమాలను పూర్తిగా అందుబాటులోకి తేవాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ నియమాలు ప్రకారం ఉచిత లగేజీ అందరికీ ఒకేలా ఇకపై ఉండదు. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచింగ్ లో ప్రయాణించేవారు తమతోపాటు 70 కిలోల వరకు లగేజ్‌ను తీసుకెళ్లవచ్చు. అదే ఏసీ సెకండ్ క్లాస్‌లో ప్రయాణికులు 50 కిలోల బరువున్న లగేజీని థర్డ్ చేసి స్లీపర్ కోచ్ ప్రయాణికులు 40 కిలోల వరకు లగేజీలను మోసుకెళ్లవచ్చు.
జనరల్ టిక్కెట్ పై ఎన్ని కిలోలు?
ఇక జనరల్ టికెట్ పై ప్రయాణించే ప్రయాణికుల విషయానికొస్తే వారు తమతో పాటు తీసుకెళ్లే లగేజీ వరకు 35 కిలోలు దాటి ఉండకూడదు. అన్ని రైల్వే స్టేషన్లలో ఈ లగేజీ బరువును కొలిచే సాధనాలు ఉండకపోవచ్చు. కానీ లక్నో, ప్రయోగరాజ్ డివిజన్లోని ప్రధాన స్టేషన్లో ఈ నియమాలను త్వరలో ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచి మిగతా రైల్వే స్టేషన్లోకి కూడా వ్యాపించే అవకాశం ఉంది.
లగేజీని ముందుగానే బుక్ చేసుకోవాలి
ట్రైన్ ప్రయాణికుల భద్రతా, సౌలభ్యం కోసమే ఈ నియమాలు పెట్టామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే చాలామంది ప్రయాణికులు తమతో పాటు అధిక సామాను తీసుకెళ్తారు. దీని వల్ల కోచ్ లో కూర్చోవడానికి నడవడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకే సామాను ఎంత తీసుకెళ్లాలి? అన్నది ఐఆర్సిటిసి నిర్ణయిస్తోంది. విమానాశ్రయంలో చేసినట్టే రైల్వే స్టేషన్లో కూడా మీ లగేజీని బుక్ చేసుకునే సౌకర్యం ప్రారంభిస్తారు. మీరు తీసుకెళ్లే బ్యాగులు బ్రీఫ్ కేసులు పరిమితి కంటే ఎక్కువ బరువు ఉంటే జరిమానా కూడా విధిస్తారు. లగేజ్‌ని తనిఖీ చేస్తున్నప్పుడే వాటి బరువును కూడా చెక్ చేస్తారు. ఇక ప్రయాణికులు తమతో పాటు అంటే హ్యాండ్ బ్యాగ్ లో, బ్యాక్ ప్యాక్ లో ఒక పది కిలోల వరకు అదనపు బరువును తీసుకెళ్లవచ్చు. దీనికన్నా ఎక్కువ ఉంటే మాత్రం లగేజీని ముందుగానే బుక్ చేసుకోవాలి.
జరిమానాలు తప్పవు
భారతీయ రైల్వేస్టేషన్లో ఎలక్ట్రానిక్ లగేజి యంత్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. రైల్వే ప్లాట్ ఫామ్ లోకి ప్రవేశించే ముందే ప్రయాణికులు బ్యాగుల బరువును పరిమాణాన్ని తనిఖీ చేయించుకోవాలి. కేవలం బ్యాగులు బరువే కాదు ఆ బ్యాగుల పరిమాణం కూడా పరిగణనలోకి తీసుకుంటారు. బ్యాగ్ పరిమాణం మరీ పెద్దగా ఉన్న జరిమానా విధించే అవకాశం ఉంది.