మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడమే మంచిది.. ఎందుకంటే..
డబ్బు.. మనిషి జీవితానికి చాలా అవసరం. ప్రతి ఒక్కరు తాము సంపాదించిన దాంట్లో ఖర్చులు పోను మిగిలిన డబ్బుని దాచుకోవడానికి ఎన్నో మార్గాలు వెతుకుతూ ఉంటారు. స్టాక్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ఇలా ఎక్కడ డబ్బు పెట్టినా లాభనష్టాలు భారీగానే ఉంటాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే రిస్క్ లేకుండా లాభాలు అందిస్తాయి. ఎందుకో తెలియాలంటే ఈ తొమ్మిది పాయింట్లు తెలుసుకోవాలి.
1. విభజన(diversification):పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బును మ్యూచువల్ ఫండ్స్ అనేక స్టాక్స్, బాండ్ల రూపంలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఒకే చోట పెట్టుబడి పెట్టినప్పుడు కలిగే నష్టం కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఆ రిస్క్ తక్కువగా ఉంటుంది.
2. వృత్తిపరమైన నిర్వహణ(professional management): మ్యూచువల్ ఫండ్స్ ను నిపుణులైన ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. వీరు తమ ఎక్పీరియన్స్ ను ఉపయోగిస్తూ సరైన విభాగాలు, కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు.
3. ద్రవ్యత(liquidity): మ్యూచువల్ ఫండ్స్ ను సులభంగా కొనుగోలు చేయవచ్చు, అమ్ముకోవచ్చు, పెట్టుబడిదారులు తమ డబ్బును తక్షణమే పొందడానికి అవకాశం ఉంటుంది.
4.లభ్యత(accessibility): తక్కువ పెట్టబడితో మ్యూచువల్ ఫండ్స్ తో పెట్టుబడి పెట్టొచ్చు. దీంతో కొద్దిపాటి డబ్బు ఉన్నా వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్ చాలా తక్కువ. మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువమంది పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుంది.
5. సౌకర్యం(convenience): చాలా సింపుల్ గా ఆన్లైన్ ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టబడి పెట్టొచ్చు. నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టడానికి సౌకర్యవంతమైన మార్గాన్ని సూచిస్తాయి. ఫండ్ మేనేజర్లు పరిశోధన, ఎంపిక, పెట్టుబడుల మానిటరింగ్ ఇన్వెస్టర్లకు భరోసానిస్తాయి.
6. వైవిధ్యమైన మార్గాలు(veriety): మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ పెట్టుబడి పెట్టడానికి వివిధ రకాలైన మార్గాలను అందుబాటులో ఉంచింది. ఇందులో పెట్టుబడి లక్ష్యాలు చాలా సేఫ్ గా ఉంటాయి. రిస్క్ మేనేజ్మెంట్, టైమ్ పీరియడ్ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
7. అధికారిక నియంత్రణ, పారదర్శకత(regulation and transparency): మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా ప్రభుత్వ సంస్థలతో నియంత్రించబడతాయి. సెక్యూరిటీ మరియు ఎక్స్చేంజ్ బోర్డు(SEBI) వీటిని పర్యవేక్షిస్తుంది. పెట్టుబడిదారులకు రక్షణ, పారదర్శకతను అందిస్తాయి. రెగ్యులర్ రిపోర్టులు, వివరణలు పెట్టుబడిదారులను ఫండ్ పనితీరు , హోల్డింగ్స్ గురించి సమాచారం అందిస్తాయి.
8.క్రమబద్ధమైన పెట్టుబడి(systematic investment):క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలు మీకు స్థిరమైన లాభాలు వచ్చే విధంగా ప్రోత్సహిస్తాయి.
9.అధిక రాబడి(High income): మార్కెట్ ను నిశితంగా పరిశీలిస్తే సంప్రదాయ పొదుపు పద్ధతుల కంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఆదాయాన్ని ఇస్తున్నాయి. నిర్వహణ బాగున్న ఫండ్స్ గురించి తెలుసుకొని వాటిలో డబ్బులు పెడితే లాభాలు కచ్చితంగా వస్తాయి.