మీ ఫోన్ వాటర్ లో పడిందా? వెంటనే పనిచేయాలంటే ఇలా చేయండి
మీ ఫోన్ నీటిలో పడిపోయిందా? ఇక ఆ ఫోన్ ఎందుకు పనికి రాదు అని బాధ పడకండి. ఫోన్ నీటిలో పడినప్పుడు వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫోన్ మళ్లీ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సెల్ ఫోన్ నీటిలో పడిపోవడానికి ప్రధాన కారణం నిర్లక్ష్యమే. సెల్ఫీలు తీసుకొనేటప్పుడు, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, వాటర్ దగ్గర పనిచేస్తూ కాల్స్, వీడియోలు చూడటం లాంటి కారణాల వల్ల సెల్ ఫోన్లు నీటిలో పడిపోతాయి. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు నీటిలో ఫోన్ పడదని మనం పైకి చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాం. కాని లోపల టెన్షన్ గా ఉంటుంది. అందువల్లనే ఫోన్ నీటిలో పడిపోతుంది. ఇలా జరగకూడదంటే ఈ టిప్స్ పాటించండి.
వెంటనే ఫోన్ బయటకు తీసేయాలి
ఫోన్ నీటిలో పడితే బాధ పడుతూ వదిలేయద్దు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీటిలో పడిన ఫోన్ ను బయటకు తీసే ప్రయత్నం చేయండి. ఇలా చేయమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అయితే ఎక్కువ సేపు నీటిలో ఉంచడం వల్ల పాడయ్యే అవకాశాలు పెరుగుతాయి.
ఫోన్ స్విచ్ ఆఫ్ ఆపేయాలి
సెల్ ఫోన్ నీటిలో పడినా కూడా ఒక్కోసారి కొంత సేపు బాగానే పనిచేస్తుంది. తర్వాత దానికదే ఆగిపోతుంది. ఇలా జరగకుండా నీటిలో పడిన ఫోన్‌ను వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నీరు ఫోన్ లోపలికి వెళ్లి సర్క్యూట్స్‌ను తాకకుండా ఉంటుంది. ఫోన్ ఆన్ లో ఉన్నప్పుడు నీరు సర్క్యూట్స్ ని తాకితే మొత్తం మదర్ బోర్డ్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఫోన్ నీటిలో పడితే వెంటనే పనిచేయకుండా ఆపడం బెటర్.
బ్యాటరీ, సిమ్ కార్డ్, మెమొరీ కార్డ్‌లను తీసేయాలి
సెల్ ఫోన్ నీటిలో పడినప్పుడు వెంటనే బయటకు తీసేయగలిగితే కొన్ని పార్ట్స్ నైనా కాపాడవచ్చు. దీనికోసం నీటిలో పడిన ఫోన్ ను బయటకు తీసి వెంటనే బ్యాటరీ, సిమ్, మెమొరీ కార్డ్ లాంటి సెపరేట్ పార్ట్స్ ను వేరు చేయాలి. ఎందుకంటే ఈ భాగాలు నీరు తాకినప్పుడు తుప్పుపట్టి పాడయ్యే ప్రమాదం ఉంటుంది.
క్లాత్ పెట్టి తుడవాలి
నీటిలో పడిన ఫోన్‌ను బయటకు తీసి ముందుగా వాటి పార్ట్స్ ను వేరు చేయాలి. తర్వాత శుభ్రమైన క్లాత్ పెట్టి తుడవాలి. ముఖ్యంగా కాటన్ క్లాత్ అయితే బెటర్. ఇది నీటిని బాగా పీల్చేస్తుంది. హెడ్ ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్ట్ వంటి ప్లేసెస్ లో గట్టిగా నొక్కిపెట్టి తుడవవద్దు. దీనివల్ల ఆ ప్లేసెస్ లో ఉన్న నీరు మరింత లోపలికి వెళ్లిపోయే ఛాన్స్ ఉంటుంది. స్మూత్ గా క్లీన్ చేయాలి.
బియ్యంలో ఉంచాలి
ఇది చాలా మంచి టెక్నిక్. పెద్దగా ఎవరికీ తెలియదు. సెల్ ఫోన్ నీటిలో పడితే వెంటనే బయటకు తీసి వీలైంతన వరకు తుడిచి తర్వాత పొడి బియ్యం(రైస్)లో పెట్టాలి. ఫోన్ మొత్తం కవర్ అయ్యేలా రైస్ తో నింపేయాలి. ఇలా సుమారు ఒక రోజు లేదా రెండు రోజులు రైస్ డబ్బాలో వదిలేయాలి. దీని వల్ల ఫోన్ లో మిగిలిన తేమను కూడా తొలగించవచ్చు.
వాక్యూమ్ క్లీనర్ వాడొచ్చు
ఫోన్ నీటిలో పడినప్పుడు దాన్ని తీసి వెంటనే చిన్న సైజ్ వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించి నీటిని పీల్చేలా చేయవచ్చు. ఇది ఛార్జింగ్, ఇయర్ ఫోన్ పోర్ట్స్, ఫోన్ పగిలిన చోట ఉన్న నీటిని వెంటనే బయటకు తీసేస్తుంది. అయితే ఇది అన్ని వేళలా మంచిది కాదు.
హెయిర్ డ్రైయర్ వాడటం అస్సలు చేయవద్దు.
ఫోన్ లో నీరు ఆవిరి అయిపోతుందన్న ఆలోచనతో హెయిర్ డ్రైయర్ వాడటం అస్సలు చేయవద్దు. దీని వల్ల మంచి కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఫోన్ వేడెక్కితే లోపల పార్ట్స్ పాడవుతాయి. కనుక హీటింగ్ పరికరాలు వాడకుండా ఉండాలి.
సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి
ఈ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత కూడా మీ ఫోన్ పనిచేయకపోతే చివరగా జాగ్రత్తగా ఫోన్‌ను సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి. రిపేర్ చేసే మెకానిక్ తో నిజాలు చెప్పండి. రెండు రోజుల క్రితం ఫోన్ నీటిలో పడితే ఇప్పుడే పడిందని చెప్పడం లాంటివి చేస్తే మెకానిక్ ఫోన్ ని సరిగ్గా బాగు చేయలేకపోవచ్చు.