MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • JioCoin అంటే ఏమిటి? మీరు వీటిని ఎలా పొందాలో, ఎలా వాడాలో తెలుసుకొండి.

JioCoin అంటే ఏమిటి? మీరు వీటిని ఎలా పొందాలో, ఎలా వాడాలో తెలుసుకొండి.

ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన వ్యాపారసంస్థ 2025 ఆరంభంలోనే కీలక ప్రకటన చేసారు. రిలయన్స్ జియో సరికొత్తగా JioCoin ప్రవేశపెట్టింది. దీనిగురించి వివరంగా తెలుసుకుందాం. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jan 18 2025, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
JioCoin

JioCoin

JioCoin : క్రిప్టో కరెన్సీ... ఇది మన కంటికి కనిపించని, చేతితో తాకలేని డబ్బులు. ఈ ఆధునిక యుగంలో డిజిటల్ కరెన్సీ వినియోగం బాగా పెరిగింది... దీంతో క్రిప్టో జోష్ కూడా పెరిగింది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ విలువ ఊహించని స్థాయికి చేరుకుంది. బిట్ కాయిన్ విషయానికే వస్తే కేవలం ఒక్కదాని విలువు లక్ష డాలర్ల మార్క్ ను దాటింది...దీన్నిబట్టే క్రిప్టో కరెన్సీకి వున్న క్రేజ్ ఏమిటో అర్థమవుతోంది.

భవిష్యత్ లో వర్చువల్ కరెన్సీకి వున్న డిమాండ్ ను దృష్టిలో వుంచుకుని భారతీయ వ్యాపారదిగ్గజం రిలయన్స్ ఇందులో అడుగు పెట్టింది. తమ వినియోగదారులకు జియో కాయిన్ (Jio Coin) పేరిట క్రిప్టో కరెన్సీని తీసుకువచ్చింది. 

2025 ఆరంభంలో ఇండియన్ రిచ్చెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ నేత‌ృత్వంలోని రిలయన్స్ సంస్థ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఈ జియో కాయిన్. బ్లాక్ చెయిన్ ఆదారిత రివార్డ్ టోకెన్ విధానాన్ని జియో ప్రవేశపెట్టింది. ఇండియాలో క్రిప్టో కరెన్సీ చట్టబద్దత నేపథ్యంలో జియో కాయిన్ క్రిప్టో కరెన్సీ అనలేం... కానీ అలాంటిదే. ప్రస్తుత డిజిటల్ ఎకానమీ హవా నడుస్తున్న నేపథ్యంలో జియో సరికొత్తగా ఇందులో అడుగుపెడుతోంది. 

ఇటీవలే (జనవరి 15, 2025) రిలయన్స్ సంస్థకు చెందిన జియో ప్లాట్ ఫారం పాలిగాన్ ల్యాబ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి అనుకూలమైన Web3 ని తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నమిది. ఇలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న రిలయన్స్ జియో కాయిన్ ను పరిచయం చేస్తోంది.  ఈ బ్లాక్ చెయిన్ ఆదారిత రివార్డ్ సిస్టమ్ ద్వారా వినియోగదారులను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది రిలయన్స్ జియో. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
JioCoin

JioCoin

ఏమిటీ జియోకాయిన్ :

జియోకాయిన్ అనేది రిలయన్స్ యొక్క బ్లాక్ చెయిన్ బేస్డ్ రివార్డ్ ప్రోగ్రామ్ (BBRP) లో భాగం. జియో ప్లాట్ ఫార్మ్స్, అప్లికేషన్ యూజర్స్ కు రివార్డ్ టోకెన్స్ అందించేందుకు రిలయన్స్ ఈ విధానాన్ని తీసుకువచ్చింది.

జియో యాప్స్ ను వినియోగించడం ద్వారా యూజర్స్ ఈ బ్లాక్ చెయిన్ ఆధారిత టోకెన్స్ పొందవచ్చు. అంటే ఇది క్రిప్టో కరెన్సీ మాదిరిగా కాకుండా ప్రస్తుతం జియో వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. భవిష్యత్ లో ఇది జియో వినియోగదారులకు మరిన్ని సేవలతో అందుబాటులోకి రానుంది. 
 

34
JioCoin

JioCoin

జియోకాయిన్ పొందడం ఎలా? 

డౌన్లోడ్ జియోస్ఫెర్ యాప్ :

వినియోగదారులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి అధికారిక జియోస్ఫేర్ బ్రౌజర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. 

సైన్ అప్ చేయండి:

ఇన్‌స్టాలేషన్ తర్వాత వినియోగదారులు "ఇప్పుడే JioCoin సంపాదించడం ప్రారంభించడానికి సైన్ ఇన్ చేయండి" అని ప్రాంప్ట్ చేసే పాప్-అప్ నోటిఫికేషన్‌ను కనుగొనవచ్చు. సైన్అప్ ప్రక్రియకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో సహా వ్యక్తిగత వివరాలను నమోదు చేయడం అవసరం.

JioCoin వాలెట్‌ని క్రియేట్ చేయండి:

సైన్అప్ ప్రాసెస్‌ను పూర్తి చేయడం ద్వారా యాప్‌లో JioCoin వాలెట్‌ని సృష్టిస్తుంది, ఇక్కడ వినియోగదారులు వారి రివార్డ్ టోకెన్‌లను మానిటర్ లేదా మేనేజ్ చేయవచ్చు

ఇలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత వినియోగదారులు జియో యాప్స్ ద్వారా ప్రత్యేకమైన టాస్క్ కంప్లీట్ చేసి ఈ కాయిన్స్ పొందవచ్చు. అయితే ఈ టోకెన్స్ గెలుచుకోవడం అనేది యూజర్స్ జియో యాప్స్ వినియోగాన్ని బట్టి వుంటుంది. అంటే జియో యాప్స్ ను ఎక్కువగా వినియోగించేవారు ఎక్కువగా ఈ జియో కాయిన్ టోకెన్స్ పొందవచ్చన్నమాట. 

జియోకాయిన్ ఎలా వినియోగించాలి? 

జియోకాయిన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికి వీటిని ఎలా వినియోగించుకోవాలో మాత్రం రిలయన్స్ వెల్లడించలేదు. త్వరలోనే ఈ కాయిన్స్ ఎలా రెడీమ్ చేసుకోవాలో అధికారికంగా వెల్లడించనున్నారు. 

అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఏంటంటే జియోకాయిన్ ను రీచార్జ్, టికెట్ బుకింగ్స్, గిప్ట్స్ కొనుగోలుకు వినియోగదారులు ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నారని. అలాగే ఇతర రిలయన్స్ జియో సేవలను పొందేందుకు కూడా ఈ కాయిన్స్ ను ఉపయోగించవచ్చు. ఇలా జియోకాయిన్ ద్వారా కొత్త అనుభూతిని వినియోగదారులకు అందించే ఏర్పాటు చేసింది రిలయన్స్. 
 

44
JioCoin

JioCoin

JioCoin పై క్రిప్టో పరిశ్రమ ఏమంటోంది : 

JioCoin పట్ల క్రిప్టో పరిశ్రమ స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు దీనిని ఆశాజనకమైన చొరవగా చూస్తుండగా, మరికొందరు దాని చట్టబద్ధత మరియు నిజమైన విలువ గురించి సందేహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మరీముఖ్యంగా X లో ఈ జియోకాయిన్ పై తీవ్ర చర్చ జరుగుతోంది.  

ప్రముఖ క్రిప్టో ఇన్‌ఫ్లుయెన్సర్ కాషిఫ్ రజా ఈ వెంచర్ పట్ల ఆశాజనకంగా ఉన్నారు. జియో యొక్క 470 మిలియన్ల భారీ యూజర్ బేస్ కేవలం నెలల్లోనే 400 మిలియన్ల మందిని వెబ్3 వ్యవస్థలోకి చేర్చగలదని, భారతదేశంలో బ్లాక్‌చెయిన్ స్వీకరణను గణనీయంగా పెంచుతుందని ఆయన స్పష్టం చేసారు.
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image3
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved