Visa Free Tours: రూ.5 వేలలో ఫారిన్ టూర్స్.. అదీ వీసా అక్కర్లేకుండానే!
Visa Free Tours: ఇంటర్నేషనల్ టూర్ వెళ్లాలని భావిస్తున్నారా? వీసా లేదని బాధపడాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్ లో వీసా లేకుండా విదేశాలకు వెళ్లవచ్చు. కేవలం రూ. 5000 లోపు విమాన టిక్కెట్లతో ఇండియా నుండి విదేశాలకు పోవచ్చు. వీసాలేని విదేశీ ప్రయాణాలివే..

Travel Guide
విదేశీ ట్రిప్ కలలు కంటున్నారా ? కానీ, వీసా, విమాన ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారా? అలాంటి వారికి శుభవార్త. భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారు పలు అందమైన దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అది కూడా ₹5000 లోపు విమాన టిక్కెట్ తోనే. ఎయిర్‌లైన్ సేల్స్ లేదా ఆఫ్-సీజన్ సమయాల్లో బుక్ చేసుకుంటే.. మరింత తక్కువ బడ్జెట్ లోనే ఈ ఫారెన్ టూర్స్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఇంతకీ వీసా లేని విదేశీ ప్రయాణాలేంటో ఓ లూక్కేయండి.
నేపాల్
ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం నేపాల్. హిమాలయాల అద్భుత దృశ్యాలు, కాఠ్‌మాండులోని పవిత్ర దేవాలయాలు, పోఖారాలో అడ్వెంచర్ ట్రెక్కింగ్ అనుభవాలు మీ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి.
విమాన ఛార్జీ: ₹2,000–₹3,000 (కోల్‌కతా లేదా ఢిల్లీ నుండి కాఠ్‌మాండు వరకు)
వీసా సమాచారం: భారత ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు ( ఆధార్/ ఓటరు గుర్తింపు కార్డు) ఉన్నవారికి వీసా అవసరం లేదు.
భూటాన్
“థండర్ డ్రాగన్ భూమి”గా ప్రసిద్ధి చెందిన దేశం భూటాన్. ఇక్కడ ప్రశాంతమైన మఠాలు, స్వచ్ఛమైన గాలి, ప్రకృతి దృశ్యాలు ఇక్కడి ప్రత్యేకతలు. ఈ దేశంలో ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.
విమాన ఛార్జీ: ₹4,000–₹5,000
వీసా సమాచారం: భారతీయులకు వీసా అవసరం లేదు. చెల్లుబాటు అయ్యే IDతో ఎంట్రీ పర్మిట్ తీసుకొని సులభంగా వెళ్లవచ్చు .
మాల్దీవులు
పచ్చని సముద్రజలాలు, పగడపు దిబ్బలు, అందమైన సముద్ర తీరాలు మాల్దీవుల ప్రత్యేకతలు. లగ్జరీ రిసార్ట్‌లు ఖరీదైనవి అయినప్పటికీ అక్కడ స్టే చేయడానికి బడ్జెట్‌లో వసతి లభిస్తుంది.
విమాన ఛార్జీ: ₹4,500 నుండి (కొచ్చి నుండి మాలే )
వీసా సమాచారం: భారతీయులకు 90 రోజుల వరకు వీసా అవసరం లేదు.
మారిషస్
బీచ్‌ల స్వర్గధామం మారిషస్. హిందూ మహాసముద్రంలో వెలసిన ఈ ఐలాండ్ లో అందమైన సముద్ర తీరాలు, ఆకట్టుకునే ప్రకృతి, ప్రత్యేకమైన సాంస్కృతిక అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.
విమాన ఛార్జీ: ₹5,000 లోపు (ముంబై /చెన్నై నుంచి )
వీసా సమాచారం: భారతీయులకు 60 రోజుల వరకు వీసా అవసరం లేదు, కేవలం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్‌తో ప్రయాణించవచ్చు.
ఇండోనేషియా (బాలి):
బీచ్‌లను ప్రేమించే వారికీ, డిజిటల్ నోమాడ్‌లకూ బాలి ఓ స్వర్గధామం. దేవాలయాలు, పంట పొలాలు, సర్ఫింగ్ బీచ్‌లు బాలి ప్రత్యేకతలు. ధార్మికత, ప్రకృతి, సాహసం అన్నీ ఒకేచోట చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ టూర్.
విమాన ఛార్జీ: ₹4,500–₹5,000 (చెన్నై/కోల్‌కతా నుండి జకార్తా/బాలికి )
వీసా సమాచారం: భారతీయులకు 30 రోజుల వరకు వీసా లేకుండా ఇక్కడ ఉండవచ్చు. ఏ ప్రత్యేక అనుమతులు అవసరం లేదు.

