MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Business
  • చిన్న కారులో ఎన్ని ఫీచర్లో: గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా VF3

చిన్న కారులో ఎన్ని ఫీచర్లో: గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా VF3

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో పలు కంపెనీలు సూపర్ టెక్నాలజీతో తయారు చేసిన కార్లను ప్రదర్శిస్తున్నాయి. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ సంస్థ అతి చిన్న SUV కారును ప్రదర్శించింది. ఇది ఇండియా మార్కెట్ లోకి వస్తే భారతదేశంలో అతి చిన్న SUV కారుగా రికార్డుల్లో నిలుస్తుంది. మరి ఈ కారు ప్రత్యేకతలు తెలుసుకుందామా?

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 19 2025, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

భారతదేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎక్స్‌పో అయిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను జనవరి 17 న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొబిలిటీ రంగంలోని అన్ని అంశాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

జనవరి 22 వరకు భారత్ మండపం యశోభూమి, ఇండియా ఎక్స్‌పో సెంటర్, గ్రేటర్ నోయిడాలోని మార్ట్ అనే మూడు ప్రదేశాల్లోొ ఎక్స్‌పో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల వాహనాలను ప్రదర్శించడానికి 9 షోలు నిర్వహించనున్నారు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో వివిధ కంపెనీల కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, ఈ స్కూటర్లు ప్రదర్శిస్తున్నాయి. వివిధ కంపెనీలు అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన తన వాహనాలను ప్రదర్శిస్తున్నాయి.  

ఈ ప్రదర్శనలో వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ సంస్థ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో అతి చిన్న SUV కారును ప్రదర్శించింది. ఈ బుల్లి కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కారు పేరు VF3. ఇది SUV కారే కానీ మినీ SUV.

34

భారతదేశంలో దీని అమ్మకాలు మొదలైతే ఇండియాలో అతి చిన్న SUV కారుగా నిలుస్తుంది. విన్‌ఫాస్ట్ సంస్థ తమిళనాడులో తన ఫ్యాక్టరీ ప్రారంభించే పనిలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత ఈ కారు తయారీని భారతదేశంలోనే ప్రారంభించే అవకాశం ఉంది.

VF3 కారు అతి చిన్న మోడల్‌ కారు. ఇది మైక్రో SUV కారే కాకుండా అతి చిన్న ఎలక్ట్రిక్ వెహికల్. 2075మి.మీ. వీల్‌ బేస్ కలిగిన ఈ కారు కేవలం 3190 మి.మీ. పొడవు ఉంటుంది. దీని చిన్న బాడీ వల్ల VF3 కారు SUV లాగానే కనిపిస్తుంది.

 

44

Vin Fast VF3 బ్యాటరీ ప్యాక్ 18.64 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీన్ని ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జింగ్ చేయవచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 190 మి.మీ. ఇంటీరియర్ కూడా సింపుల్ గా కనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్న పెద్ద టచ్‌స్క్రీన్‌లో అనేక ఫంక్షన్‌లు ఉన్నాయి.

విన్‌ఫాస్ట్ సంస్థ మొదట చిన్న మోడల్ కారు ద్వారా ఇండియాలోకి అడుగు పెట్టి తర్వాత తన పెద్ద మోడళ్లను ప్రీమియం విభాగంలో విడుదల చేయనుంది. తమిళనాడులో ఫ్యాక్టరీ ప్రారంభమైన తర్వాత ఇలాంటి మోడళ్లను తీసుకువస్తుందని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved