ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 10 లక్షల రుణం.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
విద్యార్థుల చదువుకు డబ్బు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పలు రకాల పథకాలను అమలు చేస్తుంటాయి. ఇలాంటి వాటిలో విద్యాలక్ష్మి పథకం ఒకటి. ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. 10 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఇంతకీ పథకంలో ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పేద విద్యార్థులకు సాయం
ఖరీదైన ఉన్నత విద్య చాలా మంది విద్యార్థులకు కలగానే మిగిలిపోతుంది. ఈ కారణంగానే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా 10 లక్షల వరకు రుణం పొందవచ్చు.
కుటుంబ ఆదాయం 8 లక్షల లోపు
విద్యార్థుల ఉన్నత విద్య కలను నెరవేర్చడమే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం లక్ష్యం. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారి ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాల్సి ఉంటుంది.
విద్యాలక్ష్మి పథకం ప్రయోజనాలు
ఈ పథకం ద్వారా విద్యార్థులు రూ. 10 లక్షల వరకు గ్యారెంటీ లేకుండా రుణం పొందవచ్చు. అంతేకాకుండా 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. డిజిలాకర్ ద్వారా దరఖాస్తులను త్వరగా ధృవీకరించవచ్చు.
అర్హత ప్రమాణాలు
విద్యార్థి చేరిన సంస్థ NIRF జాతీయ ర్యాంకింగ్‌లో టాప్ 100 లేదా రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్‌లో టాప్ 200లో ఉండాలి. రూ. 7.5 లక్షల వరకు రుణానికి ప్రభుత్వం 75% క్రెడిట్ గ్యారెంటీ ఇస్తుంది.
దరఖాస్తు ఎలా చేయాలి?
ఇందుకోసం విద్యార్థులు ముందుగా విద్యాలక్ష్మి పోర్టల్‌లోకి వెళ్లాలి. అనంతరం డిజిలాకర్ ద్వారా వెరిఫికేషన్ చేసుకుంటే. సరిపోతుంది.
vidyalakshmi పోర్టల్‌లో రిజిస్ట్రేషన్
విద్యాలక్ష్మి పోర్టల్ (https://www.vidyalakshmi.co.in) లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆధార్, ఇతర వివరాలు నమోదు చేసి, సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి. డిజిలాకర్ ద్వారా ధృవీకరణ తర్వాత రుణం మంజూరు అవుతుంది.
ఏటా లక్ష మందికి రుణాలు
విద్యాలక్ష్మి పథకం ద్వారా ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఉన్నత విద్యలో చేరడానికి, వారి కలలు నెరవేరడానికి సాయపడుతుంది.