Jio, Airtelకు పోటీగా Vi: రూ.175 రూపాయలకే అదిరిపోయే కొత్త సినిమా ప్లాన్
మీకు సినిమాలంటే ఇష్టమా? మీ కోసం Vodafone Idea (Vi) కేవలం రూ.175 కే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. BSNL దెబ్బకు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి Jio, Airtel తదితర అన్ని టెలికాం కంపెనీలు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే జియో, ఎయిర్ టెల్ అనేక టారిఫ్ ప్లాన్లు ప్రకటించాయి. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా వంతు వచ్చింది. అందులో భాగంగానే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
తమ వినియోగదారులను ఆకర్షించడానికి అనేక టెలికామ్ కంపెనీలు వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా జియోకు పోటీగా ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ రకరకాల టారిఫ్ ప్లాన్లు అమలు చేస్తున్నాయి. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఇప్పటికే జియో, ఎయిర్ టెల్ ప్రత్యేక ఆఫర్లతో తమ వినియోగదారులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. వొడాఫోన్-ఐడియా కంపెనీ కూడా తమ కస్టమర్లను ఆహ్లాదపరచడానికి కొత్త సినిమా ప్లాన్ తీసుకొచ్చింది. సినిమా, వినోద ప్రియుల కోసం రూ.175 కే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది.
Vi Movies & TV యాప్‌లో భాగంగా అందుబాటులో ఉండే ఈ ప్లాన్ 15 కి పైగా ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ ను అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులకు ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలను మరింత చేరువ చేసి ఆనందాన్ని పంచుతోంది.
ఈ ఏడాది ప్రారంభంలో Vi Movies & TV యాప్ ను వొడాఫోన్-ఐడియా ప్రకటించింది. ఇది ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాం లను అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో 17 OTT యాప్‌లు, 350 లైవ్ టీవీ ఛానెల్‌లు Vi వినియోగదారులకు వినోదాన్ని పంచుతున్నాయి. విభిన్న కంటెంట్ లైబ్రరీలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు వివిధ సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌ల ద్వారా అందుబాటులో ఉన్నాయి.
ఇండియాలో OTT ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో OTT వీక్షకుల సంఖ్య 547.3 మిలియన్లకు చేరుకుంది. ఇంటర్ నెట్ డేటా వినియోగం చాలా ఎక్కువ పెరిగింది. తక్కువ ధరతో ఎక్కువ డాటా పొందే ఆఫర్లు రావడంతో OTT ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేసే వెసులుబాటుకు టెలికాం కంపెనీలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం Vi కూడా ఇదే అమలు చేస్తోంది. కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో ఈ సినిమా ప్లాన్ సహాయపడుతుందని Vi భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వీడియో వినియోగంలో 65% వాటా ఉందని ఓ సర్వే చెబుతోంది. 97% OTT వీక్షకులు స్మార్ట్‌ఫోన్‌లను ప్రాథమిక పరికరంగా ఉపయోగిస్తున్నందున, మొబైల్ ఆధారిత వినోదం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి Vodafone Idea కొత్త ప్లాన్ అందిస్తోంది.
సినిమాలు, టీవీ షోలు మరియు లైవ్ స్పోర్ట్స్‌ని ఇష్టపడే వారికి Vodafone Idea అందించే రూ.175 ప్రీపెయిడ్ ప్లాన్ అద్భుతమైన ఎంపిక. వినోదంతో పాటు డేటాను కలిపి అందించడం ద్వారా వినియోగదారులు ఎక్కువ ఖర్చు లేకుండా ప్రీమియం కంటెంట్‌ను ఆస్వాదించవచ్చని ఈ ఆఫర్ ద్వారా తెలుస్తోంది.
రూ.175 సూపర్ ప్యాక్ ద్వారా ప్రీపెయిడ్ వినియోగదారులు SonyLIV, ZEE5, ManoramaMAX, FanCode PlayFlix వంటి OTT ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు, షోలను చూడవచ్చు. స్ట్రీమింగ్ ప్రయోజనాలతో పాటు ఈ ప్లాన్ 10 GB మొబైల్ డేటాను కూడా అందిస్తోంది. తద్వారా వినియోగదారులు డేటా పరిమితుల గురించి ఆందోళన చెందకుండా వీడియోలను ఆస్వాదించవచ్చు.
Vi కొత్త సూపర్ ప్యాక్ కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్యాక్‌ని ఎంచుకునే వినియోగదారులు తమకు ఇష్టమైన కంటెంట్ అంతా ఒకే చోట చూడవచ్చు. అంతేకాకుండా వేరే ప్లాట్‌ఫామ్‌ల కోసం వేర్వేరుగా సబ్‌స్క్రిప్షన్‌లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
Vi Movies & TV అందించే ఆల్-ఇన్-వన్ యాక్సెస్ ఇస్తోంది. ఇది సౌకర్యవంతంగా, లో బడ్జెట్ లో మీరు పొందవచ్చు. ఇది వినియోగదారులకు కేవలం రూ.175 కే భారీ కంటెంట్ లైబ్రరీని అందిస్తుంది.
మరో రెండు హీరో ప్లాన్లు..
ఈ సూపర్ ప్యాక్ గురించి తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే Vi's Hero అన్‌లిమిటెడ్ ప్యాక్‌లను రూ. 449 లేదా రూ.979 తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు కూడా OTT ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లు అపరిమిత కాల్స్ ను అనుమతిస్తాయి. రోజువారీ డేటా ఎలాగో ఉంటుంది. అయితే రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత హై-స్పీడ్ డేటాను మీరు ఎంజాయ్ చేయవచ్చు.