- Home
- Business
- Valentine Day 2023: వాలెంటైన్స్ డే సందర్భంగా మీ ప్రియురాలికి ఇలాంటి గిఫ్ట్ ఇస్తే, ఆమె కోటీశ్వరురాలు అవడం ఖాయం
Valentine Day 2023: వాలెంటైన్స్ డే సందర్భంగా మీ ప్రియురాలికి ఇలాంటి గిఫ్ట్ ఇస్తే, ఆమె కోటీశ్వరురాలు అవడం ఖాయం
వాలెంటెన్స్ డే సందర్భంగా మీ ప్రియురాలికి లేదా మీ సతీమణికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ఆ గిఫ్ట్ కేవలం ఒక్కరోజు మాత్రమే పరిమితం అయ్యేలా ఉంటే సరిపోదు. అది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉండాలి. మరో వాలెంటైన్ డే వరకూ వారి ఆర్థిక భవిష్యత్తు దోహదపడేలా ఉపయోగపడితే బాగుంటుంది. మీరు అలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే కొన్ని ఫైనాన్షియల్ ఐడియాస్ మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది అలాంటి ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం

మీ ప్రియురాలి పేరిట ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి..
మీ ప్రియురాలు లేదా సతీమణి పేరిట ఒక మ్యూచువల్ ఫండ్ ప్రారంభించడం అందులో సిగ్గు పద్ధతిలో ప్రతినెల డబ్బు ఇన్వెస్ట్ చేయడం ద్వారా వారికి ఒక సంవత్సరంలోనే పెద్ద మొత్తంలో డబ్బులు మీరు గిఫ్ట్ గా ఇచ్చే అవకాశం ఉంది అది వారి ఆర్థిక భద్రతకు కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్లతో పాటు ఈ ఫండ్స్ కూడా మంచి రాబడి ఇచ్చే అవకాశం ఉంది. ఇండెక్స్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లతో పాటు లాభాలను అగ్నిస్తాయి మీరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే పని నేరుగా ఇన్వెస్ట్ చేశాను ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చక్కటి లాభాలను పొందే అవకాశం ఉంది.
మీ ప్రియురాలి పేరిట ఒక ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయండి
మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లయితే మీ ప్రియురాలు లేదా సతీమణి పేరిట ఒక ప్లాటును కొనుగోలు చేయడం ద్వారా, చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్న ఈ తరుణంలో పలు సంస్థలు అందిస్తున్నటువంటి ఓపెన్ ప్లాట్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా చక్కటి లాభం అందుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీరు ఆ ఓపెన్ ప్లాటులో ఇల్లు కట్టుకోవచ్చు. లేదా మంచి రేటు లభిస్తే విక్రయించి లాభం పొందే వీలుంది.
నీ ప్రియురాలి పేరిట డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయండి
మీ వద్ద బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువ డబ్బు లేకపోతే పలు డిజిటల్ వాలెట్స్ అందిస్తున్నటువంటి డిజిటల్ గోల్డ్ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొద్ది మొత్తంలో డిజిటల్ గోల్డ్ పొందవచ్చు. మీరు దీన్ని డిజిటల్ బంగారాన్ని నాణాల రూపంలో డెలివరీ పొందే అవకాశం ఉంది. డిజిటల్ గోల్డ్ మీరు మంచి ధర ఉన్నప్పుడు మీ డిజిటల్ వాలెట్ లోనే విక్రయించి డబ్బు చేసుకోవచ్చు.
వాలెంటైన్స్ డే సందర్భంగా మీ ప్రియురాలికి మెడిక్లెయిం పాలసీ కొనివ్వండి
ప్రస్తుత గతంలో కరోనా సందర్భంగా ప్రతి ఒక్కరికి మెడిక్లయిం పాలసీ ప్రాధాన్యత తెలిసి వచ్చింది. ఎందుకంటే మెడిక్లెయిం పాలసీ ద్వారా ఎప్పుడైనా ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లయితే మెడిక్లెయిం ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉంది. లేకపోతే ఆసుపత్రి బిల్లులో తడిసి మోపడయ్యే ప్రమాదం ఉంది.