MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Upcoming IPO : ఈ వారం మార్కెట్లోకి రానున్న ఐపీవోలు ఇవే, ఇన్వెస్టర్లకు నిపుణులు ఇస్తున్న సలహా ఇదే..

Upcoming IPO : ఈ వారం మార్కెట్లోకి రానున్న ఐపీవోలు ఇవే, ఇన్వెస్టర్లకు నిపుణులు ఇస్తున్న సలహా ఇదే..

కొత్త వారంలో 3 ఐపీవోలు మార్కెట్లలోకి రానున్నాయి. నేటితో LIC IPO సందడి ముగియనుంది. మే 10, 11 తేదీల్లో మూడు ఐపీవోలు మార్కెట్లో ప్రారంభం కానున్నాయి. Venus Pipes & Tubes Limited, Prudent Corporate Advisory Services, Delhivery సంస్థలు ఐపీవో ద్వారా నిధులను సేకరించనున్నాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 09 2022, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ వారం IPO మార్కెట్ లో లిస్టింగులు సందడి నెలకొని ఉంది. ఓ వైపు LIC IPO సోమవారంతో ముగియనుంది. కానీ ఈ వారంలో 3 కొత్త ఇష్యూలు  తెరుచుకోనున్నాయి. Venus Pipes & Tubes Limited, Prudent Corporate Advisory Services, Delhivery సంస్థలు ఐపీవో ద్వారా ఈ వారం నిధులను సేకరించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచంతో పాటు దేశీయ మార్కెట్‌లోనూ పరిస్థితి ఇంకా బాగోలేదు. నిఫ్టీ 16,500 దిగువన ట్రేడవుతోంది. అటువంటి పరిస్థితిలో, IPO లో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం అని నిపుణులు పేర్కొంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మే రెండవ వారంలో, Venus Pipes & Tubes Limited, Prudent Corporate Advisory Services, Delhivery IPOలు తెరుచుకోనున్నాయి. అంటే, ఈ వారం మీ ప్రైమరీ మార్కెట్‌లో పెట్టుబడి కోసం 3 కొత్త ఆప్షన్‌లు ఉంటాయి. ఈ 3 IPOల పరిమాణం దాదాపు 6 వేల కోట్లు ఉంటుంది.
 

37

Prudent Corporate Advisory Services IPO మే 10న ప్రారంభమవుతుంది. మరుసటి రోజు, Delhivery, Venus Pipes & Tubes Limited IPOలు మే 11న తెరుచుకోనున్నాయి. ఈ మూడు IPOలలో, ముందుగా ప్రారంభమయ్యే ప్రుడెంట్ కార్పొరేట్ IPO పరిమాణం రూ. 538.61 కోట్లు, వీనస్ పైప్స్ & ట్యూబ్స్ IPO రూ. 165.42 కోట్లు మరియు ఢిల్లీవేరీ IPO రూ. 5,235 కోట్లుగా ఉంది.

47
Prudent Corporate Advisory Services IPO:

Prudent Corporate Advisory Services IPO:

ఈ IPO 10న ప్రారంభమై మే 12న ముగుస్తుంది. ఇందులో డబ్బు పెట్టుబడి పెట్టడానికి 3 రోజుల సమయం ఉంటుంది. దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 595 నుంచి 630గా నిర్ణయింయారు. దీని వాటాల కేటాయింపు మే 18న జరుగుతుంది. దీని లిస్టింగ్ మే 23న BSE, NSEలలో ఉంటుంది. ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూల అధికారిక రిజిస్ట్రార్‌గా నియమించారు.

57
Delhivery IPO

Delhivery IPO

దేశంలోని ప్రముఖ లాజిస్టిక్ సంస్థ డెలివరీ,  రూ. 5,235 కోట్ల IPO మే 11న ప్రారంభమై మే 13న ముగుస్తుంది. దీని ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 462 నుండి 487గా నిర్ణయించారు. షేర్ కేటాయింపు మే 19న జరుగుతుంది. అయితే దీని లిస్టింగ్ మే 24న NSE, BSE రెండింటిలోనూ జరిగే అవకాశం ఉంది. లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాని రిజిస్ట్రార్.

67
Venus Pipes & Tubes Limited

Venus Pipes & Tubes Limited

ఇది మే 11న ప్రారంభమై మే 13న ముగిసిపోతుంది. ఈ IPO ఇష్యూ సైజ్ రూ. 165.42 కోట్లుగా నిర్ణయించారు . దీని ప్రైజ్ బ్యాండ్ రూ. 310 నుండి 326గా ఉంది. దీని వాటాల కేటాయింపు మే 19న జరుగుతుంది. దీని లిస్టింగ్ మే 24న జరిగే అవకాశం ఉంది. 

77

ప్రస్తుతం మార్కెట్‌లో అనిశ్చితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు భారీ హెచ్చు తగ్గులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా IPOలో డబ్బు పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో IPOలు నష్టాలను మిగిల్చాయి. కొత్త IPO వాల్యుయేషన్‌పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందువల్ల, నిపుణులు చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani
వ్యాపారం
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Saving Tips: మీ జీతంలో ఎంత దాస్తున్నారు? సేవింగ్ చేసేవాళ్లలో మీరు ఏ కేటగిరీ?
Recommended image2
Gold Price Hike: అమెరికా ఎన్నికల తర్వాత మారిన మార్కెట్ లెక్కలు.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు
Recommended image3
Kavya Maran: రూ. 26000 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు.. SRH పాప వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved