Credit Card: క్రెడిట్ కార్డు ఉన్నా వాడట్లేదా? అయినా బిల్లు కట్టాల్సిందే..!
క్రెడిట్ కార్డు ఉన్నా దానిని వాడటం లేదా? దీని వల్ల మీ సిబిల్ స్కోర్ దెబ్బ తింటుందని మీకు తెలుసా? అదనంగా ఫైన్ కూడా కట్టాల్సి రావచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us

క్రెడిట్ కార్డు వాడకం..
భారతదేశంలో క్రెడిట్ కార్డుల వాడకం ఏటేటా పెరుగుతోంది. ఆన్ లైన్ షాపింగ్, అత్యవసర ఖర్చులకు క్రెడిట్ కార్డులపై ఆధారపడటం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే. కొందరు క్రెడిట్ కార్డు తీసుకొని కూడా దానిని వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ, ఇలా క్రెడిట్ కార్డు తీసుకొని కూడా వాడకపోవడం వల్ల కూడా నష్టం కలుగుతుంది. ఎక్కువ కాలం క్రెడిట్ కార్డు వాడకపోతే.. సిబిల్ స్కోర్ దెబ్బతినే అవకాశం ఉంది.
కార్డు ఇన్ యాక్టివ్ అవుతుందా?
క్రెడిట్ కార్డులో ఎలాంటి లావాదేవీలు లేకుండా ఎక్కువు కాలం వాడకపోతే, ఆ ఖాతా ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఏకంగా, బ్యాంక్ ఎకౌంట్ కూడా మూతపడే అవకాశం ఉంది.
క్రెడిట్ లిమిట్..
క్రెడిట్ కార్డును వాడకపోతే, మీ క్రెడిట్ లిమిట్ తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల మీ 'క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో' పెరుగుతుంది. ఇది మీ సిబిల్ స్కోరును ప్రభావితం చేస్తుంది.
సరిగా వాడితే...
క్రెడిట్ కార్డును పరిమితంగా వాడి, బిల్లులను సకాలంలో చెల్లించడం వల్ల మంచి క్రెడిట్ హిస్టరీ ఏర్పడుతుంది. దీనివల్ల సిబిల్ స్కోరు పెరుగుతుంది. కార్డును వాడకపోతే ఈ ప్రయోజనాన్ని కోల్పోతారు.
కార్డు వాడకపోతే...
చాలా క్రెడిట్ కార్డులకు వార్షిక రుసుము ఉంటుంది. కొన్ని కార్డులకు, ఒక నిర్దిష్ట మొత్తం ఖర్చు చేస్తే ఆ రుసుము మినహాయింపు లభిస్తుంది. కార్డును వాడకపోతే, వార్షిక రుసుము చెల్లించాల్సి వస్తుంది.
క్రెడిట్ కార్డు ఎలా వాడాలి?
క్రెడిట్ కార్డును పరిమితంగా, క్రమశిక్షణతో వాడటం ముఖ్యం. కనీసం కొన్ని నెలలకు ఒకసారి చిన్న లావాదేవీలు చేసి, బిల్లులను సకాలంలో చెల్లించడం మంచిది. దీనివల్ల మీ సిబిల్ స్కోరు, మీ విశ్వసనీయత కూడా పెరుగుతుంది.