KYC Rules మళ్లీ KYC.. చేయలేదంటే.. ప్రభుత్వ పథకాలు కట్??
బ్యాంక్ ఖాతాలు, ప్రభుత్వ పథకాలు, ఇతర చాలావాటికి KYC చేయడం ఒక తప్పనిసరి నిబంధన. గతంలో మనమందడం కేవైసీ చేసే ఉన్నాం. అయితే ఇప్పడు కొత్త ఆదాయపు పన్ను పరిమితి నిబంధనల ప్రకారం మరోసారి ఆ ప్రక్రియ కొనసాగించాల్సి ఉంది. ఏడాదికి ఒకసారి KYC అప్‌డేట్ చేయాలని బ్యాంక్ రూల్స్‌లో కూడా చెప్పారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రభుత్వ పథకాలు హష్ కాకి
బ్యాంక్ ఖాతా కొనసాగించాలంటే KYC చాలా అవసరం. ఇది ఇప్పుడు తప్పనిసరి కూడా. ఏడాదికి ఒకసారి KYC అప్‌డేట్ చేయాలని బ్యాంక్ నిబంధనలు పేర్కొంటున్నాయి. దాని ప్రకారం కేవైసీ చేయనివాళ్లు ఎవరైనా ఉంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి.
KYC కొత్త రూల్స్
ఇప్పుడు ఈ KYC బ్యాంకులకు మాత్రమే పరిమితం కాదు. గ్యాస్ సిలిండర్ రాయితీ, నగదు బదిలీ లబ్దిలాంటి ప్రభుత్వ పథకాలు అన్నింటికీ కేవైసీ తప్పనిసరి చేశారు. ప్రస్తుతం ఉన్న పథకాల్లో మీ పేరు కొనసాగించాలంటే కేవైస్ ఎప్పటికప్పడు అప్ డేట్ చేయాల్సిందే.
ఎందుకంటే...
సమాజంలో అవినీతిని అరికట్టడానికి ఇది చాలా అవసరం. ఎవరెవరు ఏ పథకం అందుకుంటున్నారు, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారో వీటితో తెలుస్తుంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరెలాంటి లావాదేవీలు చేస్తున్నారో తెలిసిపోతుంది. ఎందుకంటే చాలామంది అవినీతి చేసి పేదల డబ్బును వాళ్లే తీసుకుంటున్నారు.
కొత్త ఆదాయపు పన్ను చట్టంలో సమస్యలు
ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కేవైసీ నిబంధనల పాటించకపోతే బ్యాంకులు, బీమా, షేర్ మార్కెట్, మొబైల్ కనెక్షన్, గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డు వంటి వాటిలో సమస్యలు ఏర్పడతాయి.
కొత్త ఆదాయపు పన్ను చట్టం
కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చేలోపే బ్యాంకులో KYC చేయించుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. లేదంటే డబ్బు లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు చాలా చోట్ల ఆన్‌లైన్‌లో KYC చేస్తున్నారు. ఆ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
కొత్త ఆదాయపు పన్ను చట్టం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు. దానిపై చర్చించిన తర్వాత పాస్ చేస్తారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం వస్తే వినియోగదారుల కోసం చాలా కొత్త రూల్స్ వస్తాయి. అందుకే ఇప్పుడే KYC చేసుకోవడం మంచిది.
KYC లేకపోతే సమస్య
బ్యాంక్ ఖాతాలో KYC చేయకపోతే మీరు చేసే ఏ లావాదేవీ అయినా ఆగిపోవచ్చు. అంతేకాదు, లబ్దిదారులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా పొందలేరు. అందుకే త్వరపడండి.