TVS NTorq 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ లాంచ్: తక్కువ ధరలో అదిరిపోయే హై ఫీచర్స్!
TVS Ntorq 125 : యువత ఎంతగానో ఎదురు చూస్తున్న Ntorq 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అత్యంత తక్కువ ధరతోనే ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్కూటర్ ఫీచర్స్ ఏంటో ఓ లూక్కేయండి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 అదిరిపోయే ఫీచర్స్
టీవీఎస్( TVS ) మోటార్ కంపెనీ దేశభక్తిని ప్రతిబింబించేలా మరో వినూత్న మోడల్‌ను విడుదల చేసింది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా టీవీఎస్ కంపెనీ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS NTorq 125 Super Soldier scooter) స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్, Marvel Avengers Super Squad సిరీస్‌లో భాగంగా రూపొందించబడింది. Captain America నుంచి ప్రేరణ పొందిన ఈ బైక్ డిజైన్ చేశారు. స్కూటర్ స్పోర్టీ లుక్, ప్యాట్రియాటిక్ థీమ్‌తో యువతను ఆకట్టుకుంటోంది.
కెప్టెన్ అమెరికా ఎడిషన్‌కు యువత ఫిదా!
మార్వెల్‌తో భాగస్వామ్యంలో టీవీఎస్ ఎన్‌టార్క్ కొత్త సూపర్ సోల్జర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది కెప్టెన్ అమెరికా థీమ్‌తో వచ్చింది. ఈ స్కూటర్ జెన్‌జెడ్ (gen Z) తరానికి నచ్చేలా డిజైన్ చేయబడింది. ఈ స్కూటర్ స్టైల్, ఫీచర్లతో అందర్నీ ఆట్రాక్ చేస్తుంది.
మొట్టమొదటి బ్లూటూత్ స్మార్ట్ స్కూటర్!
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 భారతదేశంలో మొట్టమొదటి బ్లూటూత్ కనెక్ట్ అయ్యే స్మార్ట్ స్కూటర్‌గా పేరుగాంచింది. ఇది అధిక పనితీరు, స్పోర్టీ స్టైలింగ్, అధునాతన ఫీచర్లతో యువతలో విపరీతమైన ఆదరణ పొందింది. 2020లో టీవీఎస్ Marvel భాగస్వామ్యంలో కెప్టెన్ అమెరికా ఎడిషన్‌ను "సూపర్ స్క్వాడ్" లైనప్‌లో భాగంగా పరిచయం చేసింది.
ధర ఎంత?
ఈ నయా సూపర్ స్క్వాడ్ ఎడిషన్ స్కూటర్అ ద్భుతమైన గ్రాఫిక్స్, స్పోర్టీ డిజైన్‌తో యువతను ఆకట్టుకుంటోంది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ ధర రూ. 98,117/- (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించబడింది.