TVS నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్: లాంచ్ ఎప్పుడంటే..
TVS మోటార్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదల చేసిన iQube, TVS X వంటి ప్రోడక్ట్స్ ద్వారా టీీవీఎస్ భారీ లాభాలు సంపాదించింది. ఈ సంవత్సరం ఆరు నెలల్లో 1.27 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మి, రూ.1,600 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే స్పీడ్ లో మరో కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తోంది. కొత్త వెహికల్ గురించి మరిన్ని డీటైల్స్ ఇక్కడ ఉన్నాయి.
TVS మోటార్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత మార్కెట్లో iQube, ప్రీమియం TVS X ఫేమస్ అయి క్లిక్ అవడానికి టీవీఎస్ ఫాలో అయిన స్ట్రాటజీ అద్భుతం. వాటి విక్రయాల ద్వారా వచ్చిన పోర్ట్‌ఫోలియోను విస్తరించి మార్చి 2025 నాటికి కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి టీవీఎస్ కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే TVS కంపెనీ 1.27 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మి రికార్డ్ నెలకొల్పింది. వీటి విక్రయాల ద్వారా రూ.1,600 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
TVS మోటార్స్ కంపెనీ చెన్నై ప్రధాన కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా ద్విచక్ర మార్కెట్ ను సాధించింది. ఆదాయ పరంగా ఇతి ఇండియాలోనే మూడో అతి పెద్ద మోటార్ సైకిల్ కంపెనీగా రూపొందింది. TVS మోటార్ కంపెనీ కూడా 60 దేశాలకు ఎగుమతులు చేస్తూ భారతదేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహనాల ఎగుమతిదారుగా నిలిచింది. ఈ కంపెనీని ప్రారంభించింది టీవీ సుందరం అయ్యంగార్. 1911 లో ఒక బస్సు సర్వీస్ ను ఆయన ప్రారంభించారు. తర్వాత ట్రక్కులు, బస్సులతో రవాణా వ్యాపారంలో మంచి లాభాలు సంపాదించిన సుందరం.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని క్లేటన్ దేవాండ్రే హోల్డింగ్స్ సహకారంతో 1962లో TVS స్థాపించారు. ఇది ప్రారంభంలో బ్రేక్‌లు, ఎగ్జాస్ట్‌లు, కంప్రెసర్‌లు, అనేక ఇతర ఆటోమోటివ్ భాగాలను తయారు చేసింది. తర్వాత కాలంలో ద్విచక్రవాహనాల తయారీలోకి దిగి అగ్రగామిగా నిలిచింది.
టీవీఎస్ నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి TVS మోటార్ డైరెక్టర్, CEO కె.ఎన్. రాధాకృష్ణన్ మాట్లాడుతూ, “మేము బాగా ప్రణాళికాబద్ధమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉత్పత్తి శ్రేణిని కలిగి ఉన్నాం. అందువల్లనే మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు మరిన్ని ప్రోడక్ట్ లాంఛ్ లను మీరు చూస్తారు. మా లక్ష్యాలను పూర్తి చేసే విధంగా కొత్త ఉత్పత్తులను రూపొందిస్తున్నాం. ఒక కొత్త కస్టమర్ సెగ్మెంట్, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వస్తుంది.’’ అన్నారు.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఆమోదానికి నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ ఈ రంగంలో గణనీయమైన వృద్ధి సాధ్యమవుతుందని వాహన తయారీదారులు విశ్వసిస్తున్నారు. అందుకే మరిన్ని ప్రోడక్ట్స్ తీసుకురావడానికి వివిధ రకాల కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
టీవీఎస్ నుంచి రాబోయే ఉత్పత్తి గురించి రాధాకృష్ణన్ అదనపు వివరాలను వెల్లడించలేదు. ఇది కొత్త కస్టమర్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంటుందని మాత్రమే పేర్కొన్నారు. మా విడుదల సమయంలో మేము జాగ్రత్తగా ఉంటాము అని మాత్రమే పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ డిమాండ్ కు అనుగుణంగా తాము వేగంగా వృద్ధి చెందాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఆయన అన్నారు. మాన్యుఫ్యాక్టరింగ్ వేగంగా, అనుకున్నట్లుగానే సాగుతోందని, విడుదల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఆగస్టు వరకు ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ ను ఓ ఊపు ఊపింది. భారీగా ఆ వాహనాలు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత స్థానంలో TVS iQube శ్రేణి నిలిచింది. ఈ వాహనాలు మార్కెట్ లో అత్యధికంగా అమ్ముడయ్యాయి. అయితే సెప్టెంబర్‌లో బజాజ్ ఆటో దాని Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో స్థానాన్ని సంపాదించింది.
TVS iQube శ్రేణి 2.2 kWh, 3.4 kWh, 5.1 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఐదు వేరియంట్‌లను కలిగి ఉంది. మార్కెట్ లో దీని ధర రూ. 94,999 నుండి రూ. 1.85 లక్షలకు ఉంది. iQubeతో పాటు TVS ప్రీమియం TVS Xని విడుదల చేసింది. ఇది ఇంకా భారతీయ రోడ్లపై విడుదల కాలేదు.
అదేవిధంగా iQube SD లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 78 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 5 గంటలు పడుతుంది. రోజువారీ ప్రయాణాలకు, నగరంలో షికారు చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా కొత్త డిజైన్‌తో రానుంది.