MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • ఇండియాలో సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం అందించే టాప్ 5 బెనిఫిట్స్ ఇవే

ఇండియాలో సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం అందించే టాప్ 5 బెనిఫిట్స్ ఇవే

భారతదేశంలోని సీనియర్ సిటిజన్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. రిటైర్మెంట్ తర్వాత ఇతరులపై ఆదారపడకుండా వివిధ ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం...

2 Min read
Author : Galam Venkata Rao
Published : Jul 30 2024, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా పదవీ విరమణ సమయంలో ఇతరులపై ఆధారపడకుండా తమ ఆర్థిక అవసరాలను చూసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు పలు పెన్షన్ పథకాలు, పలు ప్రయోజనాలను అందజేస్తోంది. ఈ కథనంలో భారతదేశంలో సీనియర్ సిటిజన్లకు అందించే ప్రయోజనాలను మీరు చూడవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అధిక వడ్డీ రేటు

అధిక వడ్డీ రేటు

ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ), రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్‌డీ) లాంటి పొదుపు పథకాలు సాధారణ వ్యక్తుల కంటే సీనియర్ సిటిజన్‌లకు ఎక్కువ వడ్డీని ఇస్తారు. ప్రత్యేకించి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్‌లకు సాధారణ ప్రజల కంటే 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు ఎక్కువ వడ్డీని ఇస్తారు. అధిక వడ్డీని అందజేస్తున్నందున సీనియర్ సిటిజన్లు వారి పొదుపు నుంచి మరింత సంపాదించవచ్చు. పదవీ విరమణ సమయంలో అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఈ పథకాలు సహాయపడతాయి. 

36
పన్ను ప్రయోజనాలు

పన్ను ప్రయోజనాలు

పొదుపు పథకాలతో పాటు సీనియర్ సిటిజన్లకు వివిధ పన్ను రాయితీలు కూడా పొందవచ్చు. ప్రస్తుతం 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న సీనియర్ సిటిజన్లు రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. 80 ఏళ్లు పైబడిన వారు రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే, ఆరోగ్య బీమా ప్రీమియంలు, కొన్ని పథకాల పెట్టుబడి కోసం రూ.50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు.

46
ఆరోగ్య బీమా

ఆరోగ్య బీమా

వయసు పైబడ్డాక సీనియర్ సిటిజన్లు వివిధ వ్యాధులతో బాధపడుతుంటారు. వారికి క్రమం తప్పకుండా వైద్య సహాయం అవసరం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల అవసరాలను తీర్చే అనేక ఆరోగ్య బీమా పథకాలు ఉన్నాయి. ఈ ప్లాన్లు వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో సమగ్ర కవరేజీని, ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.

56
ప్రజా రవాణా

ప్రజా రవాణా

అనేక రాష్ట్రాలు బస్సు లేదా రైలులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రాయితీ ఛార్జీలను కూడా అందిస్తాయి. అంటే ప్రయాణ ఛార్జీలపై 50 శాతం వరకు తగ్గింపుని ఇస్తాయి. ఇది సీనియర్ సిటిజన్లకు రవాణా ఖర్చులపై డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది.

66
ఆస్తి పన్ను మినహాయింపు

ఆస్తి పన్ను మినహాయింపు

భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలు సీనియర్ సిటిజన్లకు ఆస్తి పన్ను మినహాయింపును అందిస్తున్నాయి. ఈ మినహాయింపు ఆస్తిని కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. 
 

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image2
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image3
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved