15 వేల కంటే తక్కువకు దొరికే టాప్ 6 ఫోన్లు ఇవే..
మీరు కొత్తగా ఫోన్ కొనాలనుకుంటున్నారా.. బడ్జెట్ రూ.15000 అయితే అంతకంటే తక్కువకే మీకు మార్కెట్ లో అద్భుతమైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ తక్కువ ధరకే మంచి కాన్ఫిగరేషన్ తో ఉన్న టాప్ 6 ఫోన్లు ఇవిగో..
1. ఐక్యూ జడ్9 లైట్
లుక్ పరంగా చాలా అందంగా ఉంటుంది ఈ ఫోన్. 4 జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే 50 ఎంపీ, 20 ఎంపీ బ్యాక్ కెమెరా కాగా సెల్ఫీ కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా అమర్చారు. ఇది 6.56 అంగుళాల డిస్ల్పే కలిగి ఉంది. దీని ప్రాసెసర్ వచ్చి 6300 మీడియాటెక్ డైమెన్సిటీ.
2.లావా బ్లేజ్ ఎక్స్
4 జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న లావా బ్లేజ్ ఎక్స్ 6.67 అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉంది. దీనికి కూడా మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉండటం వల్ల వేగంగా పనిచేస్తుంది. కెపాసిటీ బ్యాటరీ 5000 ఎంఏహెచ్. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ కాగా, 64 ఎంపీ, 2 ఎంపీలో బ్యాక్ కెమెరా ఇచ్చారు.
3. మోటో జీ 64
6.67 అంగుళాల డిస్ల్పే కలిగిన మోటో జీ 64 మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. దీని రామ్ కెపాసిటీ మాత్రం ఇతర ఫోన్ల కంటే ఎక్కువ. 6 జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువ. 5100 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. కాని ఫ్రంట్ కెమెరా మాత్రం 8 ఎంపీ, బ్యాక్ కెమెరా మాత్రం 32 ఎంపీ, 2 ఎంపీ కెపాసిటీతో అమర్చారు.
4. రియల్ మి జీటీ 6టీ
రియల్ మి జీటీ 6టీ ఫోన్ 2780, 1264 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. డిస్ల్పే 6.78 అంగుళాలు. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7, జెన్ 3 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి 5500 ఎంఏహెచ్.
5.రెడ్ మి 13
ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4, జెన్ 2 ఏఈ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. రెడ్ మి 13లో 6 జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 13 ఎంపీ కెపాసిటీ కాగా బ్యాక్ కెమెరా వచ్చి 108 ఎంపీ, 2 ఎంపీ కెపాసిటీ కలిగి ఉన్నాయి. 6.79 డిస్ల్పే ఉన్న రెడ్ మి 13 బ్యాటరీ కెపాసిటీ 5030 ఎంఏహెచ్.
6. ఒప్పో కె12 ఎక్స్
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది ఒప్పో కె 12 ఎక్స్ ఫోన్. 6.67 అంగుళాల డిస్ల్పే ప్రత్యేక ఆకర్షణ. 6 జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ దీని సొంతం. కెమెరా విషయానికొస్తే 32 ఎంపీ, 2 ఎంపీ బ్యాక్ కెమెరా ఫీచర్ కాగా, సెల్పీ తీసుకొనేందుకు ఫ్రంట్ కెమెరా 8 ఎంపీగా ఉంది.