2024లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే
2024 Year Ender: 2024 మొత్తం మీద అత్యుత్తమ 5 స్మార్ట్‌ఫోన్లు ఏంటో మీకు తెలుసా? అద్భుతమైన కెమెరాలు, సున్నితమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్, బెస్ట్ ప్రాసెసర్‌లు, ఇలా అన్నింటిలో బెస్ట్ గా నిలిచిన 5 స్మార్ట్ ఫోన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం రండి.
1. iPhone 16
Apple iPhone 16 చాలా ఖరీదైన ఫోన్. కానీ పనితీరు, ఫీచర్స్, నాణ్యత విషయానికి వస్తే ఇది ది బెస్ట్ ఫోన్లలో ఒకటి. అదనంగా ఈ ఫోన్ A17 బయోనిక్ CPUని కలిగి ఉంది. దీని వల్ల ఎటువంటి లేట్ లేకుండా, ఇతర టెక్నికల్ సమస్యలు లేకుండా అద్భుతమైన గేమింగ్ పనితీరును ఆస్వాదించవచ్చు. ఇందులో 48 MP ప్రైమరీ కెమెరాతో పాటు 12 MP సెన్సార్‌తో ఉండటం వల్ల ఇది ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీని ధర మాార్కెట్లో రూ. 79,900 ఉంది.
2. Samsung Galaxy S24
Android ఉన్న ఉత్తమ ఫోన్‌లలో Galaxy S24 ఒకటి. ఈ ఫోన్ ధర మార్కెట్లో సుమారుగా రూ. 50,000 ఉంది. ఇందులో అత్యున్నత స్థాయి ట్రిపుల్ బ్యాక్ కెమెరా దీనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అంతేకాకుండా Samsung Exynos 2400 CPU చాలా బాగా ఫోన్ ను నడిపిస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఫోన్ ఏడు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ సపోర్ట్, అనేక AI ఫంక్షన్‌లను కలిగి ఉండటంతో వినియోగదారులకు ఈ ఫోన్ బెస్ట్ ఫోన్ గా మారింది.
3. OnePlus 12R
కేవలం రూ. 35,000 ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్లలో OnePlus 12R ఒకటి. ఇది గొప్ప చిప్‌సెట్‌లలో ఒకటైన Snapdragon 8 Gen 2 CPUని కలిగి ఉంది. మంచి గేమింగ్ పనితీరుతో పాటు, అద్భుతమైన కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. కొత్త OxygenOS సాఫ్ట్‌వేర్ స్మూత్ వర్కింగ్ ని అందిస్తుంది. అదనంగా ఈ ఫోన్ Android అప్‌గ్రేడ్‌లను యాక్సిస్ చేయగలదు. అందువల్ల OnePlus 12Rకి 2024లో బాగా క్రేజ్ వచ్చింది.
4. Redmi Note 14 Pro+
Redmi Note 14 Pro+ ఫోన్ ధర కేవలం రూ. 30,999 మాత్రమే. Snapdragon 7s Gen 3 CPUని కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్‌తో మంచి డిస్ప్లేతో వస్తోంది. Genshin Impact, ఇతర గేమ్‌లు ఆడటానికి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఇది రెండు రోజుల వరకు ఛార్జింగ్ ఉండే 6200 mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే కెెమెరా పనితీరు కూడా చాలా బాగుంటుంది.
5. Vivo T3 Ultra
Vivo T3 Ultra శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది సున్నితమైన పనితీరుతో పాటు వేగంగా స్పందిస్తుంది. ముఖ్యంగా ఇది గేమ్‌లు ఆడుకోవడానికిి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ బాడీ టెంపరేచర్ పెరగకుండా కంట్రోల్ చేసుకోగలదు. దీని ధర కేవలం రూ. 31,999. ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీతో పాటు ఫంక్షనల్ 50MP డ్యూయల్ కెమెరా కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది.