ఫ్యూచర్‌ను మార్చే అద్భుతమైన టాప్ 5 టెక్నాలజీలు
సాంకేతికంగా విప్లవాత్మక మార్పులతో ప్రపంచం దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక దేశాలు డిజిటల్ టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి. సాఫ్ట్‌వేర్ మాత్రమే కాకుండా మాన్యుఫాక్చరింగ్, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్, డిఫెన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇలా అనేక రంగాలు 5జీ కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తును మార్చబోయే 5 అద్భుతమైన టెక్నాలజీల గురించి తెలుసుకుందాం..
క్వాంటం కంప్యూటింగ్
క్వాంటం కంప్యూటింగ్ ఓ సాంకేతిక విప్లవం. ఇది మరింత అభివృద్ధి చెందనుంది. క్లాసికల్ కంప్యూటర్లలో బిట్‌లు 0 , 1 విలువలను మాత్రమే గుర్తించగలవు. క్వాంటం కంప్యూటర్లలో 0, 1 మరియు రెండింటినీ కలిపి ఒకే సమయంలో గుర్తించగలవు. దీనివల్ల కంప్యూటర్ ఒకేసారి అనేక సమస్యలను పరిష్కరించగలదు. క్వాంటం కంప్యూటింగ్ లో సెక్యూరిటీ, మెటీరియల్స్ సైన్స్, ఆప్టిమైజేషన్, క్యూబిట్ స్టేబిలిటీ, ఎర్రర్ కరెక్షన్ వంటి ప్రత్యేకతలున్నాయి. ప్రస్తుతం IBM, Google, D-Wave వంటి సంస్థలు క్వాంటం కంప్యూటర్‌లను అభివృద్ధి చేస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆటోమేషన్
AI టెక్నాలజీలను ఉపయోగించి మనుషులు చేయాల్సిన పనులన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. దీంతో అనేక రంగాల్లో మేన్‌పవర్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది వ్యాపారాలకు, పరిశ్రమలు లాభదాయకం కావచ్చు కానీ ఉద్యోగులకు తీవ్ర కష్టకాలం కలిగించనుంది. అయితే తక్కువ సమయంలో వేగంగా పనులు పూర్తవుతాయి. కంప్యూటింగ్‌లో చాలా వరకు తప్పులు తగ్గుతాయి. సెక్యూరిటీ గోప్యతపై సందేహాలున్నాయి.
ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ..
ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) టెక్నాలజీలు మరో సాంకేతిక విప్లవం. ఇవి ఎంటర్‌టైన్మెంట్, విద్య, అనేక ఇతర రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. వాస్తవ ప్రపంచానికి డిజిటల్ సమాచారాన్ని జోడించడం AR ప్రత్యేకత. ఈ టెక్నాలజీని ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లో ఉపయోగిస్తారు. ప్రత్యేకమైన హెడ్సెట్‌లు, సిమ్యులేటర్లు ద్వారా పూర్తి వర్చువల్ ప్రపంచంలో మునిగిపోవడం VR ప్రత్యేకత.
5జీ టెక్నాలజీ..
3G ,4G టెక్నాలజీలను మించిన అత్యంత వేగవంతమైన నెట్వర్క్ 5G టెక్నాలజీ, సూపర్ స్పీడ్, లో లేటెన్సీతో డిజైన్ చేయబడింది. 5G టెక్నాలజీ 10 Gbps వేగంతో డేటా ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు, ట్రాఫిక్ లైట్ కంట్రోల్, ఎనర్జీ మేనేజ్మెంట్, పబ్లిక్ సర్వీసుల్లో 5జీ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే దీని ఏర్పాటుకు 5G బేస్ స్టేషన్లు, కొత్త ఆంటెన్లు ఏ
ర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. నెట్‌వర్క్ సెక్యూరిటీలో సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు.
బ్లాక్ చెయిన్, క్రిప్టోకరెన్సీ
బ్లాక్ చెయిన్ అనేది ఒక డిజిటల్ లెడ్జర్ లాంటిది. అంటే ఒక నెట్‌వర్క్‌లో గమనించిన అన్ని ట్రాన్సాక్షన్లను సెక్యూర్‌గా నమోదు చేసే విధానం అన్నమాట. ఇందులో ట్రాన్సాక్షన్లు ఒకసారి చేసిన తర్వాత, అవి మార్చడం, తొలగించడం చాలా కష్టం. ఇందులో పబ్లిక్ బ్లాక్‌చెయిన్, ప్రైవేట్ బ్లాక్ చెయిన్ అని రెండు రకాలున్నాయి. ఇక క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్, ఇథరియం వంటి డిజిటల్ కరెన్సీలకు పునాది. ఇది ఆటోమేటిక్‌గా ఒప్పందాలు నెరవేర్చడానికి ఉపయోగించబడతాయి. ఇది అత్యంత సెక్యూరిటీని కలిగి ఉంటుంది.