Electric Car: టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లలో టాటా కార్లే మూడున్నాయ్.. అవేంటో తెలుసా?
Electric Cars: మీరు ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే టాప్ 5 కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ప్రత్యేకమైన విషయం ఏంటంటే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లలో 3 కార్లు టాటా బ్రాండ్ కి చెందినవే ఉన్నాయి. ఆ కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? దీంతో పాటు టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు కూడా చూద్దాం రండి.

ప్రస్తుతం ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ వాహనాలకు పోటీగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. కాలుష్య రహిత వాహనాలు కావడంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అలాంటి టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. MG కామెట్ EV
ప్రస్తుతం భారతదేశంలో అత్యంత తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ వెహికల్ MG కామెట్ EV. ఈ మోడల్ దాని అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన రూపం వల్ల జాబితాలో టాప్ 1 లో ఉంది. ముఖ్యంగా ఇది నగర రోడ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇది బాక్స్ లాంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. 2.9 మీటర్ల పొడవుతో, ఈ EV మోడల్ నలుగురు వ్యక్తులు ప్రయాణించడానికి కరెక్ట్ గా సరిపోతుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో LED హెడ్‌లైట్లు, ఏరో వైపర్, డిజిటల్ వెహికల్ కీ, స్టీరింగ్ వీల్ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీ. వరకు ప్రయాణించగలదు.

Tata Tiago EV
2. టాటా టియాగో EV
టాప్ ఎలక్ట్రిక్ కార్ల లిస్టులో రెండవ స్థానంలో టాటా టియాగో EV ఉంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.99 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ వివిధ రకాల ఛార్జింగ్ ఎంపికలు, బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంది. 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 స్పీకర్ హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, చిల్డ్ గ్లోవ్‌బాక్స్, ఇతర ముఖ్యమైన సౌకర్యాలు ఈ వేరియంట్‌లో ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 315 కి.మీ. వరకు వెళ్లగలదు.

3. టాటా పంచ్ EV
విక్రయాల్లో టాప్ లో ఉన్న కారు టాటా పంచ్. ఈ చిన్న SUV విశాలమైన క్యాబిన్ ను కలిగి ఉంది. ఈ మినీ SUV 1.74 మీటర్ల పొడవు, 2.44 మీటర్ల వీల్‌బేస్ ను కలిగి ఉంది. దీని కారణంగా ఐదుగురు ప్రయాణికులు హాయిగా ప్రయాణించగలరు. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 315 కి.మీ. వెళుతుంది. ఇతర వేరియంట్లు అయితే 425 కి.మీ. కూడా ప్రయాణిస్తాయి.

4. సిట్రోయెన్ eC3
సిట్రోయెన్ eC3 అనేది విభిన్నమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లతో కూడిన బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది ఏకంగా 11 వేర్వేరు వెర్షన్‌లలో లభిస్తుంది. ఈ EV మోడల్ దాని స్టైలిష్ లుక్ వల్ల బాగా ఫేమస్ అయ్యింది. డ్యూయల్-టోన్ పెయింట్, డైమండ్ కట్‌లతో కూడిన 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక స్కిడ్ ప్లేట్లు మొదలైన వాటికి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర రూ.11.69 లక్షలు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ. ప్రయాణిస్తుంది.

5. టాటా టిగోర్ EV
టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారులో ఐదుగురు హాయిగా కూర్చొని ప్రయాణించొచ్చు. ఎందుకంటే ఇది 3.9 మీటర్ల పొడవు, 2.4 మీటర్ల వీల్‌బేస్, 1.7 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్కువ స్పేస్ వల్ల జనానికి బాగా నచ్చింది. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్, ఇతర ఆకర్షణీయమైన ఫీచర్ల ఉండటం వల్ల టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లలో చోటు సంపాదించింది. దీని ప్రారంభ ధర రూ. 12.49 లక్షలు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 315 కి.మీ. ప్రయాణించగలదు.
ఇది కూడా చదవండి ఇంత తక్కువ ధరలో ఇన్ని సేఫ్టీ ఫీచర్సా? దేశంలోనే ఎక్కువగా అమ్ముడయ్యే రెండు కార్లు ఇవే