ఇండియాలో ఎక్కువ మంది తాగే టాప్ 5 బీర్లు
పగలంతా ఉరకలు పరుగులతో హడావుడిగా కనిపించే ఈ ప్రపంచం రాత్రయితే మత్తులో ఊగుతుంటుంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం అమ్మకాలు చేయని దేశాలుండవంటే అతిశయోక్తి కాదు. ఇండియాలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. కానీ ఏ బ్రాండ్ బీర్లు ఎక్కువ మంది తాగుతారో మీకు తెలుసా? భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 బీర్ బ్రాండ్‌ల జాబితా ఇక్కడ ఉంది.
బడ్‌వైజర్
మన దేశంలో చాలా మంది బీరు ప్రియులు తక్కువ ఆల్కహాల్ కలిగిన డ్రింక్స్ ను ఇష్టపడతారు. వాటిలో బడ్‌వైజర్ దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే బీరుల్లో 5వ స్థానాన్ని(2%) కలిగి ఉంది. చాలా మంది దీనిని మంచి బ్రాండ్ అని నమ్ముతారు.
కళ్యాణి బ్లాక్ లేబుల్
యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్‌కు చెందిన మరో బీర్ బ్రాండ్ కళ్యాణి బ్లాక్ లేబుల్. ఇది పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా అమ్ముడవుతుంది. ఈ బ్రాండ్ పశ్చిమ బెంగాల్‌తో పాటు తూర్పు రాష్ట్రాల్లో కూడా విక్రయిస్తారు. బీర్ అమ్మకాల్లో కళ్యాణి బ్లాక్ లేబుల్ 4వ స్థానంలో (2.7 శాతం) ఉంది.
నాక్ అవుట్
SAB Miller బ్రేవరీస్ ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 బ్రూయింగ్ కంపెనీలలో ఒకటి. దీనికి 150 కంటే ఎక్కువ బీర్లు ఉన్నాయి. ఈ కంపెనీ దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే నాక్ అవుట్ బ్రాండ్ బీర్‌ను ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది. బాక్సింగ్ ఛాంపియన్ లాగా పోజులిచ్చే ఈ బీర్ అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాండ్‌లో 3వ స్థానాన్ని(8.7 శాతం) కలిగి ఉంది.
హేవర్డ్స్
SAB Miller కంపెనీకి చెందిన మరో బ్రాండ్ హేవర్డ్స్. పేదవాడి పానీయంగా దీనికి పేరుంది. దేశంలో అతి తక్కువ ధరకు అమ్ముడవుతుంది. హేవర్డ్స్ బ్రాండ్ బీర్ అత్యధికంగా అమ్ముడయ్యే బీర్‌లో 2వ స్థానాన్ని(15 శాతం) కలిగి ఉంది. ఇది దేశంలోని రాష్ట్రాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే మద్యం బ్రాండ్. దీనిని స్థానిక బ్రాండ్ అని కూడా అంటారు.
కింగ్‌ఫిషర్
కింగ్‌ఫిషర్ అనేది భారతదేశంలోని బెంగళూరులోని యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ నుండి వచ్చిన బీర్. ఈ బ్రాండ్ మొదట 1857లో ప్రవేశపెట్టారు. భారతదేశంలో రూ.9 వేల కోట్లకు పైగా రుణం తీసుకుని దేశం విడిచి వెళ్లిన RCB మాజీ యజమాని విజయ్ మాల్యా తర్వాత 1978లో కింగ్‌ఫిషర్ బ్రాండ్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ కింగ్‌ఫిషర్ బ్రాండ్ బీర్ దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే బీర్ (41 శాతం).ఉ