రూ.50 వేల కంటే తక్కువకు దొరికే బెస్ట్ 4 ఎలక్ట్రిక్ స్కూటర్స్
మీరు టూవీలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్‌కు సరిపోయే వాహనాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే మార్కెట్ లో బెస్ట్ కంపెనీలు వీటిని అందిస్తున్నాయి. అయితే మీ బడ్జెట్ రూ.50 వేలు మాత్రమే అయితే ఇక్కడ తెలిపిన 4 స్కూటర్లు మీకు మంచి ఆప్షన్ అవుతాయి. మీకు నచ్చిన మోడల్ సెలక్ట్ చేసుకొని తక్కువ ధరకే సొంతం చేసుకోండి.
మన దేశంలో బైక్‌లు, స్కూటర్‌లకు డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ మంది పేదలు, మధ్య తరగతి వారే ఎక్కువగా జీవిస్తున్నారు. ప్రజల రోజు వారీ అవసరాలు తీర్చడంలో టూ వీలర్స్ చాలా అవసరం. బైక్ లేదా స్కూటర్ కొనాలనుకునే చాలా మంది తక్కువ బడ్జెట్‌లోనే కొనాలని ప్రయత్నిస్తుంటారు. మీ బడ్జెట్ రూ. 50,000 లోపు అయితే ఇక్కడ కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఉన్నాయి. వాటిని ఓ సారి పరిశీలించి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి.
కొమకి ఎక్స్‌జీటీ కెఎం(Komaki XGT KM)
కొమకి ఎక్స్‌జీటీ కెఎం ధర కేవలం రూ.42,500. ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే 85 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ 25 కి.మీ/గం. ఇది లోకల్ గా పనులు చేసుకొనేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. దూర ప్రయాణాలకు అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఇందులో 60V లిథియం-అయాన్ బ్యాటరీ ఉపయోగించారు. ఇంటర్నల్ అలర్ట్ సిస్టమ్ దీని ప్రత్యేకత. బ్యాటరీ ఛార్జ్ అయిపోతున్నా, ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే ఇంటర్నల్ అలర్ట్ సిస్టమ్ ఇండికేషన్స్ ద్వారా అలర్ట్ చేస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ కంట్రోల్ అనే రెండు మోడ్ లు ఉన్నాయి. అవసరమైన దాన్ని బట్టి వీటిని ఉపయోగించుకోవచ్చు.
యో ఎడ్జ్(Yo Edge)
యో ఎడ్జ్ తక్కువ బడ్జెట్ లో దొరికే ఒక చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో ఛార్జింగ్ కోసం USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 60 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఈ EVలోని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 25 కి.మీ.
Yo Edge 10 రంగులలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్. యో ఎడ్జ్ ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. ఎడ్జ్ చక్కటి ఈవీ బ్రాండ్, యో బైక్స్ నుండి వస్తున్న తక్కువ స్పీడ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. లిథియం-అయాన్, లెడ్-యాసిడ్ బ్యాటరీలు ఈ మోడల్స్ లో అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చిన బ్యాటరీ మోడల్ ను మీరు ఎంపిక చేయవచ్చు. యో ఎడ్జ్ సరసమైన ధర రూ.49,000.
NIJ ఆటోమోటివ్ యాక్సిలెరో ఆర్14(NIJ Automotive Accelero R14)
NIJ ఆటోమోటివ్ యాక్సిలెరో R14 స్కూటర్ లిథియం-అయాన్ లేదా లీడ్-యాసిడ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ కలిగిన మోడల్ ధర రూ.49,731. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 180 కి.మీ. వరకు ప్రయాణించొచ్చు. దూర ప్రయాణాలకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీని టాప్ స్పీడ్ 50-55 కి.మీ./గం. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఆప్షన్స్ తో ఈ స్కూటర్ ను మీరు కొనుగోలు చేయొచ్చు. ఇంత తక్కువ బడ్జెట్ లో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ ఇదే కావడం విశేషం.
ఉజాస్ ఇగో లా(Ujaas eGo LA)
ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యంత తక్కువ ధరకు లభించే స్కూటర్ Ujaas eGo LA.దీని ధర రూ.34,880 మాత్రమే. ఈ ధరలో పెట్రోల్, సీఎన్జీ వంటి ఏ వెర్షన్ స్కూటర్లు కూడా దొరకవు. ఇది ఇంత తక్కువ ధరకు రావడానికి ప్రధాన కారణం లిథియం-అయాన్ బ్యాటరీ. ఇందులో 48V లిథియం-అయాన్ బ్యాటరీ ఉపయోగించారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 75 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. ప్రతి రోజు చిన్న చిన్న పనుల మీద తిరగాలనుకొనే వారికి ఇది ఫ్రెండ్లీ బడ్జెట్ తో లభిస్తుంది. ఎందుకంటే ఈ స్కూటర్ గరిష్ఠ వేగం 25 కి.మీ./గం మాత్రమే. అత్యంత తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన స్కూటర్ ఇది. ఇందులో స్టోరేజ్ స్పేస్ చాలా ఎక్కువ ఇచ్చారు. LED లైటింగ్ డిజిటల్ క్లస్టర్ దీని ప్రత్యేకతలు.