World Super Billionaires వీళ్లే తాజా ప్రపంచ కుబేరులు: అంబానీ, అదానీ స్థానమెంతో తెలుసా?
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితా విడుదలైంది. వీళ్ల సంపద, సంపాదన ఊహించని రీతిలో ఉంది. ఈ సంపన్నుల జాబితాలో మొదటి స్థానం ఎవరిది? ఈ జాబితాలో భారతీయ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఎక్కడ ఉన్నారు.. అని తెలుసుకోవాలని ఉందా.. ? అయితే పదండి.

సూపర్ బిలియనీర్లు..
వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) కొత్త ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఇది సూపర్ బిలియనీర్ జాబితా. కనీసం 50 బిలియన్ డాలర్ల ఆస్తి ఉండాలి.
సూపర్ బిలియనీర్ల జాబితాలో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. అతని ఆస్తి 419.4 బిలియన్ డాలర్లు. అతడిని సెంటీ బిలియనీర్ అని కూడా పిలుస్తారు.
ప్రపంచంలోని 24 మంది సూపర్ బిలియనీర్ల జాబితాలో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. అంబానీ, అదానీ కూడా జాబితలో చోటు దక్కించుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ జాబితాలో 17వ స్థానంలో ఉన్నారు. అతని ఆస్తి విలువ 90.6 బిలియన్ డాలర్లు. భారత్ లో మాత్రం మొదటిస్థానం అతడిదే.
గౌతమ్ అదానీ 21వ స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్ ద్వారా ఎనర్జీ, పోర్ట్, ఎయిర్‌పోర్ట్ రంగాల్లో ఆయన పెట్టుబడులు ఉన్నాయి. ఈమధ్యకాలంలో షేర్ మార్కెట్ లో అదానీ షేర్లు కుదేలవడంతో, జాబితాలో కిందకి పడిపోయాడు.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 2వ స్థానంలో ఉన్నారు. LVMH అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ 3వ స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరూ అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజాలే.
లారెన్స్ ఎలిసన్, మార్క్ జుకర్‌బర్గ్, సెర్గీ బ్రిన్, స్టీవెన్ బాల్మెర్, వారెన్ బఫెట్, జేమ్స్ వాల్టన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీళ్లు సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, టెలికామ్, ఆయిల్.. తదితర రంగాలకు చెందినవాళ్లు.