అత్తగారి పుట్టినరోజున టీనా అంబానీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది లైకులు, కామెంట్లు
నేడు టీనా అంబానీ అత్తగారు కోకిలాబెన్ 87వ పుట్టినరోజు సందర్భంగా ఆమే ఇన్‌స్టాగ్రామ్‌లో హత్తుకునే పోస్ట్ చేశారు. అత్తగారి పుట్టినరోజు సందర్భంగా చేసిన పోస్టులో కోకిలాబెన్ అంబానీని "మీరు మా బలం, మా అండ అంటూ ప్రశంసించారు. మేము చేసే ప్రతి పనిలో మీరు మాకు మార్గనిర్దేశం చేస్తూ ఎప్పుడు స్ఫూర్తినిస్తూ ఉంటారు." అని టీనా అంబానీ పోస్టులో రాశారు.
పోస్టుతో పాటు మాజీ నటి అయిన టీనా అంబానీ మూడు కుటుంబ ఫోటోలను కూడా షేర్ చేసింది. మొదటి ఫోటోలో కోకిలాబెన్ చిన్న కుమారుడు అనిల్ అంబానీ, అతని భార్య టీనా అంబానీ వారి ఇద్దరు కుమారులు అన్మోల్ ఇంకా అన్షుల్‌తో కలిసి కనిపిస్తారు. రెండవ ఫోటోలో టీనా అంబానీ అత్త కోకిలాబెన్‌తో కలిసి ఉంది. మూడవ ఫోటోలో టీనా అంబానీ, అనిల్ అంబానీ కలిసి కోకిలాబెన్ కలిసి ఉంటుంది.
64 ఏళ్ల టీనా అంబానీ కుటుంబానికి అడ్డంగా ఉన్న తన అత్తగారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమే ఎల్లప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని" కోరుకుంటూ ఆమె తన పుట్టినరోజు మెసేజుని ముగించింది.
టీనా అంబానీ తన అత్తగారు కోకిలాబెన్ ఫోటోని షేర్ చేస్తూ ఆమే మా కుటుంబానికి మూలస్తంభంగా అభివర్ణించి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా 'ఒక మహిళగా, నేను ప్రతిరోజూ మీ నుండి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను అని పోస్ట్ పెట్టారు.
ఈ రోజు ఉదయం ఈ పోస్ట్ షేర్ చేసినప్పటి నుండి వేలకు పైగా లైక్‌లు, బర్త్ డే కామెంట్లు వచ్చాయి. టీనా అంబానీ క్రమం తప్పకుండా కుటుంబ ఫోటోలను, ఆమె స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. గత సంవత్సరం కూడా ఆమే తన అత్తగారి కోసం ఒక పోస్ట్ చేశారు.
కోకిలాబెన్ అంబానీ గుజరాత్ లోని జామ్ నగర్ లో జన్మించారు. ఆమె 21 ఏళ్ళ వయసులో ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకుని ముంబైకి వెళ్లింది, ఆమె తన పెద్ద కుమారుడు ముకేష్ అంబానీతో కలిసి నివసిస్తోంది.