MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Vande Bharat Train: వందే భారత్ మొదటి స్లీపర్ రైలు వచ్చేస్తోంది, ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో

Vande Bharat Train: వందే భారత్ మొదటి స్లీపర్ రైలు వచ్చేస్తోంది, ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో

వందే భారత్ రైలు ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పటికే కొన్ని రూట్లలో వందే భారత్ రైలు నడుస్తోంది. మొదటిసారిగా స్లీపర్ రైలును ప్రవేశపెట్టబోతున్నారు. హై స్పీడ్ లగ్జరీ, హైటెక్స్ సౌకర్యాలతో ఇది రాబోతోంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 04 2025, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వందే భారత్ స్లీపర్ రైలు
Image Credit : Asianet News

వందే భారత్ స్లీపర్ రైలు

దీపావళికి ముందే మోడీ ప్రభుత్వం ప్రజల కోసం బహుమతులను ప్రకటిస్తోంది. ఇప్పటికే జీఎస్టీ స్లాబులను తగ్గించి మధ్యతరగతి, పేద ప్రజలకు పెద్ద కానుకనే ఇచ్చింది. అలాగే త్వరలోనే స్లీపర్ వందే భారత రైలు రాబోతోంది. ఇప్పటికే దేశంలో కొన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. అయితే అవన్నీ కూడా కూర్చొని ప్రయాణం చేసేవే. ఇంకా స్లీపర్ రైళ్ళను ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు తొలిసారి హై స్పీడ్, లగ్జరీ, హైటెక్స్ సౌకర్యాలతో తొలి వందే భారత్ స్లీపర్ రైలు రాబోతోంది. ఇదే మనదేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలుగా చెప్పుకోవాలి. సుదూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడానికి వందే భారత్ రైలు ప్రవేశపెడుతున్నారు.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ చెబుతున్న ప్రకారం గత నెలలో గుజరాత్‌లోని భావ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. జూలై 25న పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో మొదటి రేక్ సిద్ధం చేశామని, ఫీల్డ్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని.. త్వరలోనే ఇది ప్రారంభమవుతుందని చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏ మార్గంలో నడుస్తుంది?
Image Credit : Rediff

ఏ మార్గంలో నడుస్తుంది?

వందే భారత్ మొదటి స్లీపర్ రైలు ఏ మార్గంలో నడుస్తుందో మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఎక్కువ మంది ప్రయాణికులకు దీని ద్వారా ప్రయోజనం పొందేలా చూడాలని భావిస్తున్నారు. ఇందుకోసం సుదూర ప్రాంతం నడిచే రైలుగా మార్చాలని అలాగే రద్దీగా ఉండే మార్గాల్లోనే నడపాలని భావిస్తున్నారు. అలాగే ఏ రాష్ట్రానికి ఈ స్లీపర్ రైలు చెందుతుందో కూడా ఇంకా ప్రకటించలేదు.

35
స్పెషాలిటీలు ఇవే?
Image Credit : Wikipedia

స్పెషాలిటీలు ఇవే?

వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా తయారు చేశారు. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆధునిక స్లీపర్ రైళ్లలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో ప్రయాణికులకు హైటెక్ సౌకర్యాలు ఉంటాయి. ప్రతి సీటుకు ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, యుఎస్బి ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. పబ్లిక్ అనౌన్స్మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టం సౌకర్యాలు కూడా ఉంటాయి.

45
వేడి నీళ్ల స్నానం
Image Credit : vandebharatexpress.co.in

వేడి నీళ్ల స్నానం

వందే భారత్ రైళ్లలో ప్రతి కోచ్ లోపల డిస్ ప్లే ప్యానెల్, సెక్యూరిటీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆధునికమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. దివ్యాంగులైన ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన వ్యక్తులను టాయిలెట్లను కూడా నిర్మిస్తున్నారు. ఇక ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్న వారికి హాట్ షవర్ సౌకర్యం ఉంటుంది. అంటే వేడి నీళ్లతో స్నానం చేసే అవకాశం వారికి లభిస్తుంది.

55
విమాన ప్రయాణంతో సమానంగా
Image Credit : wikimedia

విమాన ప్రయాణంతో సమానంగా

వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణం దాదాపు విమాన ప్రయాణానికి సమానమైన అనుభవాన్ని ఇచ్చేలా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. విశాలమైన బెర్తులు అన్ని సౌకర్యాలు అధిక వేగంతో త్వరగానే గమ్యస్థానానికి చేర్చడం.. ఇవన్నీ కూడా విమానానికి పోటీ ఇచ్చేవే. దాదాపు వందే భారత్ స్లీపర్ రైలు... ఫైవ్ స్టార్ హోటల్ లో కనిపించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది ఏ రూట్ లో నడుపుతారో తెలియాల్సి ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
భారీ లగేజీలతో రైలు ఎక్కేస్తున్నారా? జరిమానాలు పడిపోతాయి జాగ్రత్త, లగేజీ ఈ పరిమితికి ఎంచకూడదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved